
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఇక శ్రీజతో విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు. ఇక ఇప్పటికే శ్రీజ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకోవడం, భర్త కల్యాణ్ దేవ్‌ను అన్‌ఫాలో చేయడంతో మరిన్ని రూమర్స్ తెరమీదకి వచ్చాయి.
ఇదిలా ఉంటే శ్రీజ-కల్యాణ్‌దేవ్‌ల చిన్నకూతురు నవిష్క ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది. తాజాగా నవిష్క లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన కల్యాణ్ దేవ్.. 'మిస్ యూ సో మచ్' అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ తెగ బాధపడిపోయిన కల్యాణ్ దేవ్ 'నువ్వే నా ప్రపంచం'.. అంటూ స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment