మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్‌లు 2016లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో కల్యాన్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు.
చదవండి: సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్?
తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడు నేరుగా స్పందించ లేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఈ పోస్ట్‌కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
చదవండి: బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిమ ఎదైనా కీలక ప్రకటన రానుందా? అంటూ కొందరు ఈ పోస్ట్‌పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment