Chiranjeevi Daughter Sreeja Konidela Emotional Post On Family And Friends Goes Viral - Sakshi
Sakshi News home page

Sreeja Konidela: 'కొండంత అండగా నిలబడ్డారు.. కష్టాల్లో తోడున్నారు' అంటూ శ్రీజ ఎమోషనల్‌

Published Thu, Sep 22 2022 3:25 PM | Last Updated on Thu, Sep 22 2022 5:11 PM

Chiranjeevi Daughter Sreeja Konidela Emotional Post Goes Viral - Sakshi

మెగా డాటర్‌ శ్రీజ కొణిదెల ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలె ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీతో వెకేషన్స్‌కి వెళ్లిన శ్రీజ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటకిప్పుడు తన లైఫ్‌లో జరిగిన విషయాలను షేర్‌ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్టును షేర్‌చేసింది.

'నా కష్టసుఖాల్లో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజం తట్టారు. నేను మాట్లాడినప్పుడు విన్నారు. నేను ఏం చేసినా యాక్సెప్ట్‌ చేస్తూ వచ్చారు. నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ దొరికినందుకు ఎంతో లక్కీగా ఫీల్‌ అవుతున్నా' అంటూ శ్రీజ పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్‌చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement