
Kalyan Dev Birthday,Daughter Navishka Sweet Wishes: చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే మరింత పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్ రీసెంట్‌గానే తన మేకోవర్ లుక్‌తో షాకిచ్చాడు. ఎవరేం చెప్పినా పెద్దగా పట్టించుకోకు.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్స్‌తో చర్చకు దారితీసిన కల్యాణ్ దేవ్ రీసెంట్‌గానే తన 32వ పుట్టినరోజును జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చిన్న కూతురు నవిష్క తండ్రికి బర్త్‌డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే డాడా అంటూ క్యూట్‌గా విషెస్ చెప్పింది. దీనికి థ్యాంక్యూ బంగారు అంటూ కల్యాణ్ దేవ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎంతో క్యూట్‌గా విషెస్ చెప్పిందో.. తండ్రీ-కూతుళ్ల ప్రేమ నెవర్ ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.