Kalyaan Dhev
-
Kalyaan Dhev And His Daughter Photos: కూతురితో కల్యాణ్ దేవ్.. నవిష్క అంటే పంచప్రాణాలు (ఫోటోలు)
-
అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. కానీ ఈ చిత్రాలు కల్యాణ్‌దేవ్‌కు సక్సెస్‌ను అందించలేకపోయాయి. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుతున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. (ఇది చదవండి: నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్.. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఈ ఫేక్ నెస్ ఈ ప్రపంచంలో ఉందంటే ఎవ్వరికీ ఆశ్చర్యం కలగదు. కానీ విధేయత ఉందని అంటే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు అంటూ సెటైరికల్ పోస్ట్ వేశాడు. అది ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కావడం లేదు. కాగా ఇటీవలే కల్యాణ్ దేవ్ తల్లి జ్యోతి కిషన్ బర్త్ డేను జరుపుకున్నారు. అమ్మ బర్త్ డే ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్న కల్యాణ్.. వి మిస్ యూ నవిష్క అంటూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ తనలోని ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తుంటారు. తన కూతురిని మిస్ అవుతున్నాను అంటూ పదే పదే పోస్టులు పెడుతుంటాడు. ఈ మధ్య అయితే వారానికి ఒక రోజు తన పాపతో ఉండేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్‌లు 2016లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్గా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో కల్యాన్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. చదవండి: సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడు నేరుగా స్పందించ లేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఈ పోస్ట్‌కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిమ ఎదైనా కీలక ప్రకటన రానుందా? అంటూ కొందరు ఈ పోస్ట్‌పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
శ్రీజ బర్త్‌డే.. ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసిన కల్యాణ్ దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీజ వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది.ఇదిలా ఉండగా శ్రీజ బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న(నవంబర్9)న శ్రీజ బర్త్‌డే సందర్భంగా ప్రతిసారి ఆమెకు విషెస్ చెప్పే కల్యాణ్ దేవ్ ఈసారి మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదు. కానీ తన వెకేషన్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..లైఫ్ అంత ఈజీగా సాగదు.. మనమే స్ట్రాంగ్ అవ్వాలి అంటూ ఓ ఆసక్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
నీ ప్రేమతో ఆ కష్టాలను ఎదురీదుతా: కల్యాణ్‌దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం కిన్నెరసాని. రమణతేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మునుపటి సినిమాల కంటే కిన్నెరసానిలో కల్యాణ్ బాగా నటించాడని ప్రశంసలు దక్కాయి అతడికి. ఇక సోలో ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడీ హీరో. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడు తన వర్కవుట్స్ వీడియోలను, ఫొటోలను కూడా షేర్ చేస్తుంటాడు. తాజాగా కల్యాణ్ దేవ్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. హ్యాపీ బర్త్‌డే మామ్, కొన్నిసార్లు జీవితం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ నీ ప్రేమతో ఆ కష్టాలను సైతం ఎదురీదగలనన్న నమ్మకం నాకుంది. ఎల్లప్పుడూ నావెంటే ఉన్నందుకు థ్యాంక్స్.. లవ్ యూ సో మచ్ మా.. అని రాసుకొచ్చాడు. దీనికి తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో కల్యాణ్ దేవ్ తన తల్లికి కేక్ కట్ చేయించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి: రన్నింగ్ సీన్లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్ స్టార్ అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్ మాత్రం డబుల్.. -
నేరుగా ఓటీటీలో వస్తున్న మెగా అల్లుడి సినిమా
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం కిన్నెరసాని. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాడు డైరెక్టర్. కానీ జీ5 వారు సినిమా చూసి అగ్రిమెంట్ చేసుకునే సమయంలో బిగ్ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని అనడంతో థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. జనవరి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తామన్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే కల్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి పెద్దగా ఆడకపోవడంతో థియేటర్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థ్రిల్లర్ మూవీ కిన్నెరసాని జూన్ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. #Kinnerasani a mystery thriller that follows the journey of Veda who is in search of her father.#Premieres10thJune only on #ZEE5#KinnerasaniOnZEE5 @kalyaan_dhev @RamanaTeja9 @annsheetal1 @RavindraVijay1 @Kashishkhannn @mahathibhikshu @mahathi_sagar @itsRamTalluri @LahariMusic pic.twitter.com/TVxvDJ4V7S — ZEE5 Telugu (@ZEE5Telugu) June 4, 2022 చదవండి: ఓటీటీలోకి విక్రమ్, రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే? Namita: గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ -
హోలీ ఆడిన శ్రీజ కూతుళ్లు, కల్యాణ్ దేవ్ ఏమన్నాడంటే?
చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఏం చేసినా అది సెన్సేషనే అవుతోంది. అతడు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవల సూపర్ మచ్చితో ప్రేక్షకులను పలకరించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కిన్నెరసాని త్వరలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించడం లేదు కల్యాణ్ దేవ్. అంతేకాదు ఈ మధ్య షేర్ చేస్తున్న ఫొటోల్లో శ్రీజ మిస్ అవుతుండటంతో వీళ్లు విడాకులు తీసుకుంటున్నారన్న ఊహాగానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని కల్యాణ్‌దేవ్ తన ముఖమంతా రంగులమయమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ హోలీ రోజు ప్రేమ, సరదాలను పంచండంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే తన కూతుళ్లు నివృత్తి, నవిష్క సెలబ్రేట్ చేసుకున్న హోలీ వీడియోలను సైతం ఇన్‌స్టా స్టోరీలో పెడుతూ రంగుల్లో మునిగిపోయారంటూ కామెంట్ చేశాడు. ఈ హోలీ వేడుకల్లో ఎక్కడా శ్రీజ కనిపించలేదు. మొత్తానికి కల్యాణ్‌దేవ్ హోలీ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Nivrithi_k (@nivrithi_k) View this post on Instagram A post shared by Navishka (@navishka_k) చదవండి: కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ బాడీగార్డ్‌కు రామ్‌చరణ్ సాయం -
బిగ్‌బాస్ బ్యూటీ అరియానాకు ‘మెగా’ ఆఫర్
యాంకర్‌గా కేరీర్ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. ఇప్పటికే యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి అరియానా ఓ సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అరియానా మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలో అరియానా నటిస్తుంది. శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్‌కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. నమో వెంకటేశ, దూకుడు సహా పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపన ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి : (బిగ్‌బాస్ భామ అరియానకు అరుదైన ఘనత) (ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు) -
మెగా అల్లుడి రెండో సినిమా
తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. -
నచ్చకపోతే అస్సలు మాట్లాడలేను : బన్నీ
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన విజేత సినిమా మంచి టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ఈ మూవీలోని మురళీ శర్మ, కళ్యాణ్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాథ్ సినిమాల్లోని క్లైమాక్స్‌లా ఉందని మెగాస్టార్ చిరంజీవి కితాబునిచ్చారు. విజేత విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బన్నీ విజేత గురించి మాట్లాడుతూ.. ‘నేను వచ్చేముందే సినిమా చూశాను. సినిమా నాకు చాలా నచ్చింది. నచ్చకపోతే అస్సలు మాట్లాడలేను. ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ చాలా కనెక్ట్ అయ్యాయి. నాకు మా ఫాదర్ అంటే ఇష్టముండటంతో ఆ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. సినిమాలోని పాటలు చాలా బాగున్నాయని, ముఖ్యంగా కోడి సాంగ్, మాన్సారే సాంగ్‌లు నచ్చాయి. హర్షవర్ధన్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. తను చేసిన అర్జున్ రెడ్డి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మురళీ శర్మ గారు చాలా బాగా నటించారు. ఈయన్ను అతిథి సినిమా నుంచి గమనిస్తున్నాను. చాలా బాగా యాక్ట్ చేస్తారు. కళ్యాణ్ ఎమోషనల్ సీన్స్‌లో ఎలా చేస్తారో అని అనుకున్నాను ,కానీ ఆటోలో మురళీ శర్మతో ఉన్న సీన్లో కళ్యాణ్ కనబడలేదు. క్యారెక్టర్ మాత్రమే కనబడింది. కళ్యాణ్ చాలా బాగా నటించారు. క్లైమాక్స్ చాలా బాగుంది. ట్విస్ట్ చాలా నచ్చింది’ అని అన్నారు. -
‘విజేత’ మూవీ రివ్యూ
టైటిల్ : విజేత జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్ సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్ దర్శకత్వం : రాకేష్ శశి నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా..? తొలి సినిమాతో కల్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్ ముందు విజేతగా నిలిచాడా..? కథ; రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. కానీ ఈ బాధ్యతలేవి పట్టని రామ్, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అల్లరి చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) రామ్ చేసిన ఓ పని కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్ చేసిన అల్లరి పనుల కారణంగా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా సహాయం చేయడు. చివరకు ఎలాగోలా తండ్రిని కాపాడుకున్న రామ్ ఎలాగైన జీవితంలో నిలబడాలనుకుంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్గా మాళవిక నాయర్ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్ ప్లస్ పాయింట్ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్, నోయల్, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ; మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్ శశి ఆ పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్ తనదైన టేకింగ్ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మలిచాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాల్లో రామ్ పాత్ర ఈ జనరేషన్ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్ చూపించాడు. సెంథిల్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. నిర్మాత సాయి కొర్రపాటి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; ఫస్ట్ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మరో విజేత
-
‘విజేత’ కల్యాణ్ కోసం రాసిన కథ కాదు!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 2015లో జతకలిసే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాకేష్ శశి డైరెక్షన్లో ‘విజేత’ సినిమాతో కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజేత సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు రాకేష్ శశి మీడియాతో పంచుకున్నారు. తొలిచిత్రం ‘జతకలిసే’ సమయంలోనే సాయి కొర్రపాటి గారితో పరిచయం ఏర్పడింది. అప్పడే వారాహి చలనచిత్రం బ్యానర్లో సినిమా చేయాలన్నారు. ఈ లోగా సాయి గారు ఇతర సినిమాల్లో బిజీ కావటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఫైనల్‌గా మూడేళ్ల తరువాత విజేతతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. విజేత, కల్యాణ్ దేవ్ కోసం రాసుకున్న కథ కాదు. ముందే కథ తయారు చేసుకున్నాం. హీరో కోసం వెతుకుతున్న సమయంలో వైజాగ్ సత్యానంద్ గారి ద్వారా కల్యాణ్ గురించి తెలిసింది. కల్యాణ్‌ను మా సినిమా ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. కల్యాణ్ రిచ్ ఫ్యామిలీలో పెరిగారు. మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం చాలా హోం వర్క్ చేశారు. సినిమా కథ.. టీజర్, ట్రైలర్లలో చూపించినట్టుగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుంది. అంతేకాదు మధ్య తరగతి కుటుంబాల్లోని అనుబంధాలు, ప్రేమలు, కష్టాలు, సర్థుబాట్లు అన్నిచూపించాం. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంతో విజేత కనెక్ట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. శ్రీనివాస రావు అనే ఫ్యాక్టరీ ఎంప్లాయ్ ఆయన కొడుకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి రామ్‌ల మధ్య జరిగే కథే విజేత. తండ్రి ఆశయం నిలబెట్టే కొడుకు కథ ఇది. అయితే గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా విజేత కొత్తగా అనిపిస్తుంది. సమాజంలోని 90 శాతం మంది జీవితాలను మా సినిమా ప్రతిభింబిస్తుంది. ఓ గొప్ప వ్యక్తి గెలుపు కన్నా, సామాన్యుడి విజయాన్ని ప్రేక్షకుల ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సామాన్యుడి కథే విజేత. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. కల్యాణ్ తో సినిమా అనుకున్న తరువాత సాయి గారితో కలిసి చిరంజీవి గారికి కథ వినిపించాం. పూర్తి స్క్రిప్ట్ (స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో సహా) విన్న తరువాతే చిరంజీవి గారు ఓకె చెప్పారు. ఆ తరువాతే సినిమా మొదలైంది. టైటిల్ తప్ప చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన అంశాలేవి విజేతలో కనిపించవు. ఇది పూర్తిగా కల్యాణ్ సినిమాలాగే ఉంటుంది. చిరంజీవి గారికి కథ వినిపించాలన్న కోరిక ఉండేది. ఆయనతో సినిమా చేయకపోయినా.. నా రెండో సినిమాకే ఆయనకు కథ వినిపించే అవకాశం రావటం ఆనందంగా ఉంది. గత చిత్రాల్లో మాళవిక నటన నాకు చాలా బాగా నచ్చింది. విజేతలో హీరోయిన్ పాత్రకు ఆమె అయితే పర్ఫెక్ట్ అన్న నమ్మకంతో ఆమెను సెలెక్ట్ చేసుకున్నాం. మా నమ్మకాన్ని మాళవిక నిలబెట్టారు. సినిమాలో ఆమె స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 12 ఏళ్ల వయసుల్లో మా ఫాదర్ చనిపోయారు. చిన్నతనంలో ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుక మేం చాలా కష్టపడ్డాం. అలాంటి సందర్భాలు సినిమాలో ప్రతిభింబిస్తాయి. పూర్తిగా అదే నేపథ్యం మాత్రం కాదు. తరుపరి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం విజేత రిలీజ్, రిజల్ట్కోసం ఎదురు చూస్తున్నాం. -
‘విజేత’కు క్లీన్ యూ
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నాటి సూపర్ హిట్ మూవీ ‘విజేత’ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య జరిగే సన్నివేశాలే హైలెట్‌గా నిలవనున్నాయి. విజేత ట్రైలర్, సాంగ్స్‌కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. -
యూ ట్యూబ్ ట్రెండ్‌లో ‘విజేత’ ట్రైలర్
-
అల్లుడు దుమ్ము లేపేస్తున్నాడు!
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవీ సూపర్ హిట్ మూవీ ‘విజేత’ను టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగతూ ఉన్నాయి. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు విజేత టీమ్. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో నడుస్తోంది. సినిమాకు డైలాగ్‌లు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఎలాగో మెగా అభిమానుల సపోర్ట్ ఉంది కాబట్టి, సినిమా విడుదలయ్యాక పాజిటివ్టాక్ వచ్చి మొదటి సినిమానే సూపర్ హిట్ అయితే ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్‌కు ఏ అడ్డు ఉండదు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. వారాహి చలన చిత్రంపై నిర్మించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘విజేత’కు విచ్చేస్తున్న చిరు, బాలయ్య!
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. మెగా ట్యాగ్‌తో ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. మెగా హీరోలందరూ వారి కంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుంటూ అభిమానుల్ని మెప్పిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ‘విజేత’గా రాబోతున్న మరో హీరో కళ్యాణ్ దేవ్ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. వారాహి సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను జూన్ 24న నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారాహి సంస్థతో ఉన్న అనుబంధంతో బాలకృష్ణ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలు బాలయ్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఈ వేడుకకు హాజరైతే... నందమూరి, మెగా అభిమానులకు ఇక పండగే. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్గా నటించింది. -
‘లైఫ్‌లో కొంచెం కాంప్రమైజ్ అయి బతకాలి’
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న మరో హీరో కల్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు (శ్రీజ భర్త) కల్యాణ్ విజేత సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలసిందే. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ (ఎవడే సుబ్రమణ్యం ఫేం) హీరోయిన్గా నటిస్తున్నారు. తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. జూన్ 24న అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. .జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మెగా అల్లుడి ‘విజేత’
-
రేపే మెగా అల్లుడి ‘విజేత’ టీజర్
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. మెగా సపోర్ట్‌తో ఎంట్రీ ఇచ్చినా.. తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు మెగా హీరోలు. ఈ నేపథ్యంలో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ‘విజేత’గా మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్ లుక్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు (జూన్ 12)న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ నెల 24న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ మాత్రమే కాక మిగతా మెగా హీరోలందరూ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హీరోకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయి చిత్రమైన విజేత సినిమా టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా విజయవంతమై కళ్యాణ్ దేవ్‌ను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్. Teaser of #Vijetha marking the debut of #KalyaanDhev will be out on June 12th at 8:59 am. A film by @rakeshsashii under #SaiKorrapati Production |@vaaraahicc. @iamMalavikaNair @DOPSenthilKumar @murlisharma72 #HarshavardhanRameshwar |#VijethaTeaser pic.twitter.com/TDOjoZMEYI — BARaju (@baraju_SuperHit) June 11, 2018 -
ఒకే వేదికపైకి మెగా ఫ్యామిలీ..!
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. టాప్ స్టార్స్ నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ తమ రేంజ్ తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ హీరోలందరినీ ఒకే వేదిక మీద చూసే అవకాశం మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన సంఘటన త్వరలో జరుగనుందన్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాన్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో విజేత సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 24న గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వేడుకలో మెగా హీరోలంతా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు వేడుకకు హాజరు కావటం ఖాయంగా తెలుస్తోంది. వీరితో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు కూడా తప్పని సరిగా హారవుతారంటున్నారు ఫ్యాన్స్. ఒక్క పవన్ కల్యాణ్ విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని భావిస్తున్నారు. -
చిరు చిన్నల్లుడి సినిమా.. ఫస్ట్‌లుక్!
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విజేత. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల టైటిల్ లోగో రిలీజ్ తో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో కల్యాణ్ దేవ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘విజేత’గా వస్తున్న చిరు చిన్నల్లుడు
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ (శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్లో మైల్ స్టోన్ లాంటి సినిమా విజేత. ఆ సినిమా టైటిల్‌నే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ మూవీకి టైటిల్‌గా ఎంచుకున్నారు చిత్రబృందం. టైటిల్ లోగోను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్ -
డబ్బింగ్ మొదలెట్టిన చిరు చిన్నల్లుడు
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర మీద సందడి చేయనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు.