
హీరో కల్యాణ్ దేవ్‌కు కూతురు నవిష్క అంటే పంచప్రాణాలు.

తను కనిపిస్తే చాలు ఈ లోకాన్నే మర్చిపోతాడు.

తండ్రిగా తన కోసం ఏదైనా చేసేస్తాడు.

కూతురు పక్కనుంటే ప్రపంచంలోని సంతోషమంతా అతడి ముఖంలోనే కనిపిస్తుంది.

ఈ మధ్యే నవిష్క ఆరో పుట్టినరోజు జరుపుకుంది.

ఈ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు కల్యాణ్ దేవ్.

తన గారాలపట్టి కోసం మిక్కీ మౌస్‌ను కూడా తెచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా చిరంజీవి కూతురు శ్రీజ- కల్యాణ్ దేవ్‌ల సంతానమే నవిష్క.

శ్రీజ, కల్యాణ్ విడిపోవడంతో అప్పుడప్పుడు మాత్రమే తన కూతురిని కలుసుకుంటూ ఉంటాడు.

కల్యాణ్.. విజేత, సూపర్‌మచ్చి, కిన్నెరసాని వంటి చిత్రాల్లో నటించాడు.



