చిరు చిన్నల్లుడి సినిమా.. ఫస్ట్‌లుక్‌! | Mega Family Hero alyaan Dhev Look In Vijetha | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 3:40 PM | Last Updated on Sat, May 26 2018 6:54 PM

Mega Family Hero alyaan Dhev Look In Vijetha - Sakshi

‘విజేత’ సినిమాలో కల్యాణ్ దేవ్‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విజేత. ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల టైటిల్ లోగో రిలీజ్‌ తో ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో కల్యాణ్ దేవ్‌ లుక్‌ను రిలీజ్‌ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

రాకేష్‌ శశి దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్‌ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement