Rakesh Sashii
-
అదే నాకు అతి పెద్ద ప్రశంస: ‘ఊర్వశీవో రాక్షసివో’ డైరెక్టర్
‘‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమా ప్రివ్యూ అయిన తర్వాత శిరీష్‌గారు, ‘తెరపై నేను కనపడలేదు.. నేను చేసిన శ్రీకుమార్ పాత్ర మాత్రమే కనిపించింది.. థ్యాంక్స్’ అన్నారు.. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఆ తర్వాత అల్లు అరవింద్‌గారు కూడా హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉందన్నారు’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ‘‘జతకలిసే, విజేత’ చిత్రాల తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ చేశాను. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ‘విజేత’ చూసి, అల్లు అరవింద్‌గారు నన్ను పిలిపించి, శిరీష్ కోసం కథ సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత శిరీష్‌గారితో ప్రయాణం చేసి ‘ఊర్వశివో.. రాక్షసివో’ కథని రెడీ చేశాను. షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో లాక్డౌన్ రావడంతో ఆలస్యం అయింది. ఇప్పటివరకూ శిరీష్‌గారు చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఆయన కెరీర్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్ మణిరత్నంగారంటే నాకు ఇష్టం. ఆయనలా నాకు సినిమాలు తీయాలని ఉంది’’ అన్నారు. -
‘విజేత’ మూవీ రివ్యూ
టైటిల్ : విజేత జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కల్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, జయప్రకాష్ సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్ దర్శకత్వం : రాకేష్ శశి నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు. తాజాగా మరో మెగా హీరో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ కల్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రాకేష్ చెప్పిన కథ నచ్చటంతో కల్యాణ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయిన మెగా ఫ్యామిలీ ఓకె చెప్పింది. మరి వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా..? తొలి సినిమాతో కల్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడా..? ఈ విజేత బాక్సాఫీస్ ముందు విజేతగా నిలిచాడా..? కథ; రామ్ (కల్యాణ్ దేవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటాడు. రామ్ తండ్రి శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్ ఫ్యాక్టరీ లో పనిచేసే మధ్యతరగతి ఇంటిపెద్ద. కుటుంబ బాధ్యతల కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి చిరు ఉద్యోగిగా మిగిలిపోతాడు. కానీ ఈ బాధ్యతలేవి పట్టని రామ్, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అల్లరి చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన జైత్రను లవ్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. (సాక్షి రివ్యూస్) రామ్ చేసిన ఓ పని కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాసరావుకు గుండెపోటు వస్తుంది. గతంలో రామ్ చేసిన అల్లరి పనుల కారణంగా సమయానికి అంబులెన్స్ డ్రైవర్ కూడా సహాయం చేయడు. చివరకు ఎలాగోలా తండ్రిని కాపాడుకున్న రామ్ ఎలాగైన జీవితంలో నిలబడాలనుకుంటాడు. మరి అనుకున్నట్టుగా రామ్ విజయం సాధించాడా..? తన కోసం ఇష్టా ఇష్టాలను కోరికలను త్యాగం చేసిన తండ్రి కోసం రామ్ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్గా మాళవిక నాయర్ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్ ప్లస్ పాయింట్ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్, నోయల్, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాజీవ్ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ ; మెగా ఫ్యామిలీ హీరోను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్న దర్శకుడు రాకేష్ శశి ఆ పనిని సమర్ధవంతంగా పూర్తి చేశాడు. కల్యాణ్ పై ఉన్న అంచనాలకు తగ్గ కథా కథనాలతో ఆకట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. రాకేష్ తనదైన టేకింగ్ తో మెప్పించాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు లవ్ స్టోరితో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మలిచాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాల్లో రామ్ పాత్ర ఈ జనరేషన్ యువతకు ప్రతీకల కనిపిస్తుంది. మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్లను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు పాత్రల ఎంపికలోనూ తన మార్క్ చూపించాడు. సెంథిల్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. నిర్మాత సాయి కొర్రపాటి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. మేకింగ్‌లోనే కాదు కథల ఎంపికలోనూ వారాహి బ్యానర్‌కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్ అయ్యింది. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; ఫస్ట్ హాఫ్‌లో కాస్త నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘విజేత’ కల్యాణ్ కోసం రాసిన కథ కాదు!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 2015లో జతకలిసే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాకేష్ శశి డైరెక్షన్లో ‘విజేత’ సినిమాతో కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజేత సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు రాకేష్ శశి మీడియాతో పంచుకున్నారు. తొలిచిత్రం ‘జతకలిసే’ సమయంలోనే సాయి కొర్రపాటి గారితో పరిచయం ఏర్పడింది. అప్పడే వారాహి చలనచిత్రం బ్యానర్లో సినిమా చేయాలన్నారు. ఈ లోగా సాయి గారు ఇతర సినిమాల్లో బిజీ కావటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఫైనల్‌గా మూడేళ్ల తరువాత విజేతతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. విజేత, కల్యాణ్ దేవ్ కోసం రాసుకున్న కథ కాదు. ముందే కథ తయారు చేసుకున్నాం. హీరో కోసం వెతుకుతున్న సమయంలో వైజాగ్ సత్యానంద్ గారి ద్వారా కల్యాణ్ గురించి తెలిసింది. కల్యాణ్‌ను మా సినిమా ద్వారా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. కల్యాణ్ రిచ్ ఫ్యామిలీలో పెరిగారు. మధ్య తరగతి జీవితాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదు. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం చాలా హోం వర్క్ చేశారు. సినిమా కథ.. టీజర్, ట్రైలర్లలో చూపించినట్టుగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలోనే సాగుతుంది. అంతేకాదు మధ్య తరగతి కుటుంబాల్లోని అనుబంధాలు, ప్రేమలు, కష్టాలు, సర్థుబాట్లు అన్నిచూపించాం. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంతో విజేత కనెక్ట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. శ్రీనివాస రావు అనే ఫ్యాక్టరీ ఎంప్లాయ్ ఆయన కొడుకు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి రామ్‌ల మధ్య జరిగే కథే విజేత. తండ్రి ఆశయం నిలబెట్టే కొడుకు కథ ఇది. అయితే గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా విజేత కొత్తగా అనిపిస్తుంది. సమాజంలోని 90 శాతం మంది జీవితాలను మా సినిమా ప్రతిభింబిస్తుంది. ఓ గొప్ప వ్యక్తి గెలుపు కన్నా, సామాన్యుడి విజయాన్ని ప్రేక్షకుల ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సామాన్యుడి కథే విజేత. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. కల్యాణ్ తో సినిమా అనుకున్న తరువాత సాయి గారితో కలిసి చిరంజీవి గారికి కథ వినిపించాం. పూర్తి స్క్రిప్ట్ (స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో సహా) విన్న తరువాతే చిరంజీవి గారు ఓకె చెప్పారు. ఆ తరువాతే సినిమా మొదలైంది. టైటిల్ తప్ప చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన అంశాలేవి విజేతలో కనిపించవు. ఇది పూర్తిగా కల్యాణ్ సినిమాలాగే ఉంటుంది. చిరంజీవి గారికి కథ వినిపించాలన్న కోరిక ఉండేది. ఆయనతో సినిమా చేయకపోయినా.. నా రెండో సినిమాకే ఆయనకు కథ వినిపించే అవకాశం రావటం ఆనందంగా ఉంది. గత చిత్రాల్లో మాళవిక నటన నాకు చాలా బాగా నచ్చింది. విజేతలో హీరోయిన్ పాత్రకు ఆమె అయితే పర్ఫెక్ట్ అన్న నమ్మకంతో ఆమెను సెలెక్ట్ చేసుకున్నాం. మా నమ్మకాన్ని మాళవిక నిలబెట్టారు. సినిమాలో ఆమె స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 12 ఏళ్ల వయసుల్లో మా ఫాదర్ చనిపోయారు. చిన్నతనంలో ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుక మేం చాలా కష్టపడ్డాం. అలాంటి సందర్భాలు సినిమాలో ప్రతిభింబిస్తాయి. పూర్తిగా అదే నేపథ్యం మాత్రం కాదు. తరుపరి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం విజేత రిలీజ్, రిజల్ట్కోసం ఎదురు చూస్తున్నాం. -
చిరు చిన్నల్లుడి సినిమా.. ఫస్ట్‌లుక్!
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విజేత. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల టైటిల్ లోగో రిలీజ్ తో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో కల్యాణ్ దేవ్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
డబ్బింగ్ మొదలెట్టిన చిరు చిన్నల్లుడు
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర మీద సందడి చేయనున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు.