
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. టాప్ స్టార్స్ నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ తమ రేంజ్ తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ హీరోలందరినీ ఒకే వేదిక మీద చూసే అవకాశం మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి అరుదైన సంఘటన త్వరలో జరుగనుందన్న టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాన్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.
కల్యాణ్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో విజేత సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 24న గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వేడుకలో మెగా హీరోలంతా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు వేడుకకు హాజరు కావటం ఖాయంగా తెలుస్తోంది. వీరితో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు కూడా తప్పని సరిగా హారవుతారంటున్నారు ఫ్యాన్స్. ఒక్క పవన్ కల్యాణ్ విషయంలోనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment