Actor Kalyan Dhev Shared Emotional Post On His Mother Birthday - Sakshi
Sakshi News home page

Kalyaan Dhev Emotional Post: జీవితంలోని కష్టాలను నీ ప్రేమతో గెలిచేస్తా.. కల్యాణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Wed, Jul 13 2022 5:06 PM | Last Updated on Wed, Jul 13 2022 6:23 PM

Kalyaan Dhev Emotional Post On His Mother Birthday - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కిన్నెరసాని. రమణతేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మునుపటి సినిమాల కంటే కిన్నెరసానిలో కల్యాణ్‌ బాగా నటించాడని ప్రశంసలు దక్కాయి అతడికి. ఇక సోలో ట్రిప్‌లు ఎంజాయ్‌ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడీ హీరో. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడు తన వర్కవుట్స్‌ వీడియోలను, ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటాడు.

తాజాగా కల్యాణ్‌ దేవ్‌ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. హ్యాపీ బర్త్‌డే మామ్‌, కొన్నిసార్లు జీవితం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ నీ ప్రేమతో ఆ కష్టాలను సైతం ఎదురీదగలనన్న నమ్మకం నాకుంది. ఎల్లప్పుడూ నావెంటే ఉన్నందుకు థ్యాంక్స్‌.. లవ్‌ యూ సో మచ్‌ మా.. అని రాసుకొచ్చాడు. దీనికి తల్లితో దిగిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఇందులో కల్యాణ్‌ దేవ్‌ తన తల్లికి కేక్‌ కట్‌ చేయించినట్లు తెలుస్తోంది.

చదవండి: రన్నింగ్‌ సీన్‌లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్‌ స్టార్‌
అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్‌ మాత్రం డబుల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement