
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. మెగా ట్యాగ్‌తో ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. మెగా హీరోలందరూ వారి కంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుంటూ అభిమానుల్ని మెప్పిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ‘విజేత’గా రాబోతున్న మరో హీరో కళ్యాణ్ దేవ్ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. వారాహి సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను జూన్ 24న నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారాహి సంస్థతో ఉన్న అనుబంధంతో బాలకృష్ణ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలు బాలయ్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఈ వేడుకకు హాజరైతే... నందమూరి, మెగా అభిమానులకు ఇక పండగే. కళ్యాణ్ దేవ్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment