Vijetha Movie Teaser: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ కల్యాణ్ దేవ్‌ టీజర్ - Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 9:47 AM | Last Updated on Tue, Jun 12 2018 2:25 PM

Kalyaan Dhev Vijetha Teaser - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న మరో హీరో కల్యాణ్ దేవ్‌. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు (శ్రీజ భర్త) కల్యాణ్ విజేత సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలసిందే. రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్‌ (ఎవడే సుబ్రమణ్యం ఫేం) హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్‌ డ్రామా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ ను రిలీజ్‌ చేశారు. జూన్‌ 24న అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు హాజరవుతారన్న టాక్‌ వినిపిస్తోంది. .జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement