హోలీ ఆడిన శ్రీజ కూతుళ్లు, కల్యాణ్‌ దేవ్‌ ఏమన్నాడంటే? | Sreeja Husband Kalyaan Dhev Share Holi Pics | Sakshi
Sakshi News home page

Kalyaan Dhev: రంగులద్దుకున్న శ్రీజ భర్త కల్యాణ్‌, ఫొటోలు వైరల్‌

Published Fri, Mar 18 2022 9:19 PM | Last Updated on Fri, Mar 18 2022 9:26 PM

Sreeja Husband Kalyaan Dhev Share Holi Pics - Sakshi

చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ ఏం చేసినా అది సెన్సేషనే అవుతోంది. అతడు సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అవుతోంది. విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్‌ దేవ్‌ ఇటీవల సూపర్‌ మచ్చితో ప్రేక్షకులను పలకరించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కిన్నెరసాని త్వరలో రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించడం లేదు కల్యాణ్‌ దేవ్‌. అంతేకాదు ఈ మధ్య షేర్‌ చేస్తున్న ఫొటోల్లో శ్రీజ మిస్‌ అవుతుండటంతో వీళ్లు విడాకులు తీసుకుంటున్నారన్న ఊహాగానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని కల్యాణ్‌దేవ్‌ తన ముఖమంతా రంగులమయమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ హోలీ రోజు ప్రేమ, సరదాలను పంచండంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చాడు. అలాగే తన కూతుళ్లు నివృత్తి, నవిష్క సెలబ్రేట్‌ చేసుకున్న హోలీ వీడియోలను సైతం ఇన్‌స్టా స్టోరీలో పెడుతూ రంగుల్లో మునిగిపోయారంటూ కామెంట్‌ చేశాడు. ఈ హోలీ వేడుకల్లో ఎక్కడా శ్రీజ కనిపించలేదు. మొత్తానికి కల్యాణ్‌దేవ్‌ హోలీ ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్‌ బాడీగార్డ్‌కు రామ్‌చరణ్‌ సాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement