
చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవీ సూపర్ హిట్ మూవీ ‘విజేత’ను టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగతూ ఉన్నాయి. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్‌లో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు విజేత టీమ్.
నిన్న విడుదల చేసిన ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో నడుస్తోంది. సినిమాకు డైలాగ్‌లు, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఎలాగో మెగా అభిమానుల సపోర్ట్ ఉంది కాబట్టి, సినిమా విడుదలయ్యాక పాజిటివ్‌టాక్ వచ్చి మొదటి సినిమానే సూపర్ హిట్ అయితే ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్‌కు ఏ అడ్డు ఉండదు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చగా, రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వారాహి చలన చిత్రంపై నిర్మించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment