Kalyan Dev Shares Interesting Note On Instagram Stories, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Dev: ఆ విషయం చెబితే మాత్రం ఆశ్చర్యపోతారు.. కానీ: కల్యాణ్ దేవ్ సెటైరికల్ పోస్ట్

Published Fri, Jul 14 2023 12:27 PM | Last Updated on Fri, Jul 14 2023 1:24 PM

Kalyan Dev Shares A Note On Instagram Stories Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అ‍ల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. కానీ ఈ చిత్రాలు కల్యాణ్‌దేవ్‌కు సక్సెస్‌ను అందించలేకపోయాయి. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుతున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు.

(ఇది చదవండి: నాగార్జున బ్లాక్ బస్టర్‌ మూవీ.. సైడ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!)

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్.. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఈ ఫేక్ నెస్ ఈ ప్రపంచంలో ఉందంటే ఎవ్వరికీ ఆశ్చర్యం కలగదు. కానీ విధేయత ఉందని అంటే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు అంటూ సెటైరికల్ పోస్ట్ వేశాడు. అది ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కావడం లేదు.

కాగా ఇటీవలే కల్యాణ్ దేవ్ తల్లి జ్యోతి కిషన్‌ బర్త్‌ డేను జరుపుకున్నారు. అమ్మ బర్త్‌ డే ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్న కల్యాణ్.. వి మిస్ యూ నవిష్క అంటూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ తనలోని ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తుంటారు. తన కూతురిని మిస్ అవుతున్నాను అంటూ పదే పదే పోస్టులు పెడుతుంటాడు. ఈ మధ్య అయితే వారానికి ఒక రోజు తన పాపతో ఉండేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement