
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
తాజాగా తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలను తీసుకొని తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నా ప్రపంచం, నా జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment