kotagiri
-
పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలను తీసుకొని తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నా ప్రపంచం, నా జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
రెవెన్యూ అధికారులపై రాళ్ల దాడి
నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని వద్ద మంజీరా నదిలో రెవెన్యూ అధికారులపై మహారాష్ట్రకు చెందిన 50 మంది రాళ్ల దాడి చేశారు. మంజీర నదిలో తెలంగాణ భూభాగంలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మహారాష్ట్ర కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీలను బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి సీజ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు తహసీల్దార్ విఠల్‌తో పాటు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు రెవెన్యూ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాళ్ల దాడితో భయపడిపోయి వెనక్కి తగ్గటంతో డోజర్ జేసీబీలను మహారాష్ట్ర కాంట్రాక్టర్ అనుచరులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు మృత్యువాత
కోటగిరి (నిజామాబాద్) : బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రాయికూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. -
ఏసీబీకి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగిని
కోటగిరి (నిజామాబాద్ జిల్లా) : కోటగిరి ఎమ్మార్వో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుశీల అనే ప్రభుత్వ ఉద్యోగిని.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి గతంలో ఆర్ఐగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అయితే ఇస్మాయిల్‌కు సంబంధించిన ఇంక్రిమెంట్ ఫైల్ మూవ్ చేయటానికి సుశీల రూ.2 వేలు లంచం అడిగింది. దీంతో ఇస్మాయిల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇస్మాయిల్ దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా సుశీలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన
కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సోమవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రోద్బలంతో అనర్హులకు కూడా పింఛన్ వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదన్నారు. నిజామాబాద్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సిద్ధార్ధ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్ గురించి వైఎస్సార్సీపీ నాయకులు డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే అర్హులకు పింఛన్లు ఇప్పించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిద్ధార్ధ రెడ్డి చెప్పారు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కోటగిరి, న్యూస్‌లైన్: కోటగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో బాధితుడు వద్ద నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఆధ్వర్యంలో అధికారులు కార్యదర్శిని అరెస్టు చేశారు. వివరాలు.. కోటగిరికి చెందిన ఒడ్డె లింగయ్యకు నర్సింలు, గణేశ్ ఇద్దరు కుమారులు. 2004లో లింగయ్య తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచాడు. ఇంటినం-4-72 ఇల్లును నర్సింలుకు ఇవ్వగా, 15-50 అనే ఇంటిని గణేశ్ పేర రాశారు. కాగా లింగయ్య 2006లో మృతిచెందాడు. నర్సిం లు తమ్ముడు గణేశ్ ఉద్యోగరీత్యా కువైట్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో ఇటీవల గణేశ్ కోటగిరికి రాగా ఆస్తి మార్పులు చేసుకుందామని ఇద్దరు అన్నదమ్ములు అంగీకరించి 10 రోజుల క్రితం తండ్రి డెత్ సర్టిఫికెట్‌తోపాటు ఇంటిమార్పిడికి సంబంధించిన పత్రాలను కార్యదర్శికి అందజేశారు. అయితే ఇంటిమార్పిడి చేయాలంటే రూ. 10వేలు ఖర్చు అవుతుందని కార్యదర్శి సుదర్శన్ అన్నదమ్ములకు చెప్పా డు. డబ్బు ఇస్తే వెంటనే మీపనులు పూర్తిచేస్తానన్నాడు. అంతడబ్బు తేలేమని వారు చెప్పడంతో డబ్బు తేకపోతే మీరిచ్చిన పత్రాలు లేవని చెబుతాను.. అప్పుడు ఏం చేసా ్తరో చేసుకోండని సుదర్శన్ డిమాండ్ చేశాడు. మళ్లీ రెండోసారి నర్సింలు సుదర్శన్‌ను వేడుకోగా రూ.8వేలు తీసుకురమ్మని చెప్పాడు. అదికూడా 21వ తేదీలోగా డబ్బు తీసుకుని పంచాయతీ ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఫిబ్రవరి 18న నర్సింలు ఏసీబీ జిల్లా కార్యాలయానికి వెళ్లి పరి స్థితి వివరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఓపథకం ప్రకారం నర్సింలును పురమాయించారు. దీంతో 21న నర్సింలు కోటగిరి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శికి రూ.8 వేలు నగదును లంచం ఇస్తుండగా ఏసీ బీ అధికారులు దాడిచేసి కార్యదర్శి సుదర్శన్‌ను రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఫైల్స్ అన్నింటిని సీజ్ చేశారు. సుదర్శన్‌ను శనివారం హెదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు జిల్లా రేంజ్ అధికారి సంజీవ్‌రావ్ తెలిపారు. ఎవరైన అధికారులు అంచం ఇవ్వాలని అడిగితే తమకు ఈ సెల్ నం. 94404 46155కు ఫోన్ చేయాలని సూచించారు. -
కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో మృతి