కోటగిరి, న్యూస్‌లైన్: కోటగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో బాధితుడు వద్ద నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఆధ్వర్యంలో అధికారులు కార్యదర్శిని అరెస్టు చేశారు. వివరాలు.. కోటగిరికి చెందిన ఒడ్డె లింగయ్యకు నర్సింలు, గణేశ్ ఇద్దరు కుమారులు. 2004లో లింగయ్య తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచాడు. ఇంటినం-4-72 ఇల్లును నర్సింలుకు ఇవ్వగా, 15-50 అనే ఇంటిని గణేశ్ పేర రాశారు. కాగా లింగయ్య 2006లో మృతిచెందాడు. నర్సిం లు తమ్ముడు గణేశ్ ఉద్యోగరీత్యా కువైట్‌కు వెళ్లాడు.
ఈనేపథ్యంలో ఇటీవల గణేశ్ కోటగిరికి రాగా ఆస్తి మార్పులు చేసుకుందామని ఇద్దరు అన్నదమ్ములు అంగీకరించి 10 రోజుల క్రితం తండ్రి డెత్ సర్టిఫికెట్‌తోపాటు ఇంటిమార్పిడికి సంబంధించిన పత్రాలను కార్యదర్శికి అందజేశారు. అయితే ఇంటిమార్పిడి చేయాలంటే రూ. 10వేలు ఖర్చు అవుతుందని కార్యదర్శి సుదర్శన్ అన్నదమ్ములకు చెప్పా డు. డబ్బు ఇస్తే వెంటనే మీపనులు పూర్తిచేస్తానన్నాడు. అంతడబ్బు తేలేమని వారు చెప్పడంతో డబ్బు తేకపోతే మీరిచ్చిన పత్రాలు లేవని చెబుతాను.. అప్పుడు ఏం చేసా ్తరో చేసుకోండని సుదర్శన్ డిమాండ్ చేశాడు. మళ్లీ రెండోసారి నర్సింలు సుదర్శన్‌ను వేడుకోగా రూ.8వేలు తీసుకురమ్మని చెప్పాడు.
అదికూడా 21వ తేదీలోగా డబ్బు తీసుకుని పంచాయతీ ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఫిబ్రవరి 18న నర్సింలు ఏసీబీ జిల్లా కార్యాలయానికి వెళ్లి పరి స్థితి వివరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఓపథకం ప్రకారం నర్సింలును పురమాయించారు. దీంతో 21న నర్సింలు కోటగిరి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శికి రూ.8 వేలు నగదును లంచం ఇస్తుండగా ఏసీ బీ అధికారులు దాడిచేసి కార్యదర్శి సుదర్శన్‌ను రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఫైల్స్ అన్నింటిని సీజ్ చేశారు. సుదర్శన్‌ను శనివారం హెదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు జిల్లా రేంజ్ అధికారి సంజీవ్‌రావ్ తెలిపారు. ఎవరైన అధికారులు అంచం ఇవ్వాలని అడిగితే తమకు ఈ సెల్ నం. 94404 46155కు ఫోన్ చేయాలని సూచించారు.
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
Published Sat, Feb 22 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement