LINGAIAH
-
ఆ రెండు నంబర్ల కేంద్రంగానే విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడిని విచారించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం దాదా పు 2 గంటలపాటు ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్ని కల నేపథ్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సహకరించారా? ఆ రెండు ఫోన్ నంబర్లు ఎందుకు పంపారనే కోణంలోనే లింగయ్య విచారణ సాగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదు. అప్పటి అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశాడు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లింగయ్యను సంప్రదించిన తిరుపతన్న బీఆర్ఎస్లో ఉంటూ ఆ పారీ్టకి వ్యతిరేకంగా పని చేస్తున్న, అసమ్మతితో ఉన్న నాయకులతోపాటు వారి అనుచరుల ఫోన్ నంబర్లను సేకరించిన ఎస్ఐబీ అధికారులు వాటిని నాటి డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్ చేయించారు. ఇందులో భాగంగా నకిరేకల్‌కు చెందిన వేముల వీరేశం (అప్పట్లో బీఆర్ఎస్ అసమ్మతి నేత)తోపాటు ఆయన అనుచరులపై నిఘా ఉంచాలని అందిన ఆదేశాల మేరకు ఆ వివరాలు సేకరించే బా«ధ్యతను తిరుపతన్నకు అప్పగించారు. వీరేశంతో సన్నిహితంగా ఉంటున్న పెదకాపర్తికి చెందిన రాజ్‌కుమార్, నకిరేకల్‌కు చెందిన మదన్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయాలని భావించారు. ఆ ఇద్దరి ఫోన్ నంబర్ల కోసం తిరుపతన్న అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సంప్రదించారు. గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేసి ఉండటంతో తిరుపతన్నకు లింగయ్యతో పరిచయం ఉంది. తొలుత రెండు–మూడుసార్లు ఫోన్లో సంప్రదించిన తిరుపతన్న ఆపై ఆ ఇద్దరి ఫోన్ నంబర్లు కావాలని కోరారు. దీంతో తనకున్న పరిచయాలతో మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ నంబర్లు తీసుకున్న లింగయ్య వాటిని తిరుపతన్నకు పంపారు. ట్యాపింగ్ కేసులో తిరుపతన్న అరెస్టుకు ముందే తన ఫోన్‌ను ఫార్మాట్ చేశారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ఆ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల ల్యాబ్ నుంచి ఆ నివేదిక పోలీసులకు అందింది. ఇందులో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్న–లింగయ్య మధ్యఫోన్ కాల్స్, ఆపై లింగయ్యనుంచి తిరుపతన్నకు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ల ఫోన్ నంబర్లు వచ్చినట్లు తేలింది. దీని ఆధారంగా నోటీసులిచ్చి పోలీసులు లింగయ్యను విచారించారు. ఫోన్లో తిరుపతన్న ఏం అడిగారు? ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉందా? ఆ ఇద్దరి నంబర్లు ఎందుకు పంపారు? అనే వివరాలు ఆరా తీసి లింగయ్య వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పా..ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. చాలా కాలంగా పరిచయం ఉన్న అధికారి కాబట్టే తిరుపతన్నతో మాట్లాడాను. మదన్‌రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నంబర్లు అడిగితే నా అనుచరుల నుంచి తీసుకుని ఇచ్చా. అప్పట్లోనూ ఆ నంబర్లు ఎందుకని ప్రశ్నించా. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, ఆ వివరాలు తెలుసుకోవడానికే వారి నంబర్లు తీసుకున్నట్లు చెప్పారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశాననేది అవాస్తవం. కేవలం మీడియాలో ప్రాచుర్యం పొందాలనే నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. – మీడియాతో చిరుమర్తి లింగయ్య -
పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా లింగయ్య
పంజగుట్ట (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మిద్ది లింగయ్యను ఎన్నుకున్నట్లు ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ చించు ఊషన్న తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన నియామక పత్రాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లింగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోకాపేటలో ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల స్థలం, రూ.2 కోట్లతో త్వరలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని తీర్మానించినట్లు తెలిపారు. -
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్సై లింగయ్య యాదవ్‌పై వేటు
-
రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం
‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం. సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి. వైద్యరంగంలో బలోపేతమయ్యాం.. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్ మార్కెట్ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి.. నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్ఎస్ స్కాన్ , కేన్సర్ యూనిట్కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. ⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం. ⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. ⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్నగర్ రింగ్ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్నగర్ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. ⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అండతో రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ⇒ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య : ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా. ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లో కోల్డ్స్టోరీజే ఏర్పాటు చేయిస్తా. ⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
రీపోస్టుమార్టం చేయండి
సాక్షి, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పున్నం లింగయ్య మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ముగ్గురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది. ఖమ్మం ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం ఉదయం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని, సాయంత్రం 6 గంటల్లోగా రీ పోస్టుమార్టం నిర్వహించి వాటి నివేదికలను ఈ నెల 5న తమకు నివేదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని లింగయ్య కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. విచారణను 5కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. మృతదేహంపై గాయాలున్నాయా? లింగయ్యను రాళ్లగడ్డ అటవీ ప్రాంతంలో గత నెల 31న పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో పొట్టనబెట్టుకున్నారని, బూటకపు కాల్పుల్లో చంపేసి ఎన్కౌంటర్ అని పోలీసులు చెబుతున్నారని పేర్కొంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాల్పులు జరిపిన పోలీసులపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదించారు. ఆదివాసీల హక్కుల కోసం లింగయ్య పోరాడేవారని, పోడు వ్యవసాయం చేసేందుకు ఆదివాసీలకు మద్దతుగా ఉండటం ప్రభుత్వానికి నచ్చలేదని పేర్కొన్నారు. లింగయ్యను పోలీసులు అక్రమంగా తమ కస్టడీలోకి తీసుకుని చంపేశారని ఆరోపించారు. కొత్తగూడెం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పడేశారని, అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, మహారాష్ట్ర హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన గుండాల స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌పై హత్యానేరం కింద 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. లింగయ్య మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా ఎలా చెబుతున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, మృతుడి బంధువుల సమాచారమని, మృతదేహాన్ని బంధువులు చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని ఆయన బదులిచ్చారు. ఎన్కౌంటర్ పేరుతో ఇదే తరహాలో గతంలో శేషాచల అడవుల్లో ఏకంగా 12 మంది చనిపోయారని, వారి మృతదేహాలకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రీపోస్టుమార్టం జరిగిందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. లింగయ్య దగ్గర ఆయుధాలు ఉన్నాయని, పోలీసులపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాతే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని చెప్పారు. తీవ్రవాదంతో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. పోస్టుమార్టం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుని.. మృతదేహంపై గాయాలున్నాయని, బూటకపు ఎన్కౌంటరని పిటిషనర్ ఆరోపిస్తున్నందున రీ పోస్ట్‌మార్టం, రీ అటాప్సీ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కాగా, ఈ కేసులో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, గుండాల ఎస్హెచ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం ఆస్పత్రి సూపరింటెండెండ్లను చేర్చారు. -
భూమి తిరిగి తీసుకుంటారని భయంతో..
మాడ్గులపల్లి: తాను కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటారేమోననే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కుంచెం లింగయ్య(53) అనే రైతు అదే గ్రామానికి చెందిన ఓ దళితుడి నుంచి పదేళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. కాగా ఇప్పుడు ఆ భూమి నాదేనని అతని వారసులు వచ్చి గొడవ చేయడంతో.. మనస్తాపానికి గురైన లింగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
కొత్తగూడ: వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లిలో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్జి లింగయ్య(36) పత్తి సాగు చేస్తున్నాడు. అయితే ఇటీవలి భారీ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. వచ్చే వేసవిలో కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పంట నష్టపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుమార్తె పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో సోమవారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
లింగయ్యా.. గిదేందయ్యా..!
కానిస్టేబుల్ తల్లిదండ్రుల ఆమరణ దీక్ష డబ్బులు ఇప్పించి.. న్యాయం చేయాలని వేడుకోలు ఖమ్మం అర్బన్ : ఉండేందుకు ఇల్లు లేదు.. కొడుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు.. ఆ డబ్బులు ఇప్పించి.. ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఓ కానిస్టేబుల్ తల్లిదండ్రులు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు. తల్లిదండ్రులు కోడి మల్లయ్య, పుల్లమ్మ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాది వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం రేపోణి గ్రామం. మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు లింగయ్య ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మిగతా ఇద్దరు కొడుకులు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఖమ్మంలోని మేకల నారాయణ నగర్లో ఉన్న రూ.కోటి విలువ చేస్తే ఆస్తిని తన పేర రాయించుకుని.. తమ్ముళ్లకు అన్యాయం చేస్తున్నాడు. స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం కూడా బయటి మార్కెట్లో రూ.10లక్షలకు అడుగుతుంటే.. బెదిరించి దానిని కూడా రూ.5.75లక్షలకు తీసుకున్నాడు. దీనిపై అనేక చోట్ల ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, తాను కానిస్టేబుల్‌ను అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇద్దరు తమ్ముళ్లు మాట్లాడుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వృద్ధ దంపతులను అర్బన్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై ఎస్సై మొగిలిని వివరణ కోరగా.. తల్లిదండ్రులు, కొడుకు నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై ఉన్నతాధికారుల సూచనల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. అలాగే కానిస్టేబుల్ లింగయ్య వివరణ కోరగా.. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, గతంలోనే తమ గ్రామంలో సమస్యను పెద్దమనుషులు పరిష్కరించి.. అగ్రిమెంట్ రాసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగం ఉందనే తనపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాడు. -
జిల్లాలో రోడ్లకు మహర్దశ..
ఖమ్మం జిల్లాలో రోడ్లకు త్వరలో మహర్దశ పట్టబోతుంది. ఆర్ అండ్ బీ సూపరిటెండెట్ ఇంజనీర్ ఎం. లింగయ్య గురువారం మండలంలో పర్యటించి,రోడ్లను పరిశీలించారు. అనంతరం విలేక ర్లతో మాట్లాడుతూ.. రూ.1400 కోట్లతో జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 8 మండలాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు 72 కి.మీ.మేర రెండు వరుసల రోడ్ల నిర్మాణం కోసం రూ.119 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని 24 ప్రధాన రహదారులను డబుల్ లైన్లగా మార్చేందుకు రూ.418 కోట్లు కేటాయించామని, వాటిలో 20 పనులకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నాబార్డు కింద ఏడు బ్రిడ్జ్‌లు,21 కి.మీల డబుల్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని,మార్చిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రణాళిక పద్దు కింద రూ.175 కోట్లతో జిల్లాలో 23 బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తకొండ గ్రామానికి చెందిన జుర్రు లింగయ్య (40) పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కార్యాలయం సిబ్బంది అతడిని హుటాహుటిన ములకనూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తన వాటా భూమిని సోదరుడు సంపత్ ఆయన పేరిట పట్టా చేయించుకున్నాడని... అది తన పేరిట మార్చాలని లింగయ్య కొద్దికాలంగా.. రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విషయమై మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. -
నక్సల్ కమాండర్ లొంగుబాటు
కరీంనగర్ : మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ లింగయ్య అలియాస్ మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆరోగ్యప్రభుత్వం గతంలో అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డెవీస్ మాట్లాడుతూ లింగయ్యపై సుమారు 15 కేసులు ఉన్నాయని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అతని పేరు మీద ఉన్న రూ. లక్ష రివార్డును త్వరలోనే అతనికే అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా లింగయ్యపై ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యలతో పాటు తెలంగాణ రీ రీజయన్ పరిధిలోని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురు గ్రామస్తులను హత్య చేసిన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. 2010 లో మావోయిస్టు గ్రూప్ చేరిన మల్లేష్, 2014 లో మహదేవ్పూర్ మండలం ఏటూరు నాగారం మావోయిస్టు డిప్యూటీ కమాండర్ పదవి చేపట్టాడు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతోనే లొంగిపోయినట్లు లింగయ్య పేర్కొన్నాడు. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
కోటగిరి, న్యూస్‌లైన్: కోటగిరి గ్రామపంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో బాధితుడు వద్ద నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఆధ్వర్యంలో అధికారులు కార్యదర్శిని అరెస్టు చేశారు. వివరాలు.. కోటగిరికి చెందిన ఒడ్డె లింగయ్యకు నర్సింలు, గణేశ్ ఇద్దరు కుమారులు. 2004లో లింగయ్య తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచాడు. ఇంటినం-4-72 ఇల్లును నర్సింలుకు ఇవ్వగా, 15-50 అనే ఇంటిని గణేశ్ పేర రాశారు. కాగా లింగయ్య 2006లో మృతిచెందాడు. నర్సిం లు తమ్ముడు గణేశ్ ఉద్యోగరీత్యా కువైట్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో ఇటీవల గణేశ్ కోటగిరికి రాగా ఆస్తి మార్పులు చేసుకుందామని ఇద్దరు అన్నదమ్ములు అంగీకరించి 10 రోజుల క్రితం తండ్రి డెత్ సర్టిఫికెట్‌తోపాటు ఇంటిమార్పిడికి సంబంధించిన పత్రాలను కార్యదర్శికి అందజేశారు. అయితే ఇంటిమార్పిడి చేయాలంటే రూ. 10వేలు ఖర్చు అవుతుందని కార్యదర్శి సుదర్శన్ అన్నదమ్ములకు చెప్పా డు. డబ్బు ఇస్తే వెంటనే మీపనులు పూర్తిచేస్తానన్నాడు. అంతడబ్బు తేలేమని వారు చెప్పడంతో డబ్బు తేకపోతే మీరిచ్చిన పత్రాలు లేవని చెబుతాను.. అప్పుడు ఏం చేసా ్తరో చేసుకోండని సుదర్శన్ డిమాండ్ చేశాడు. మళ్లీ రెండోసారి నర్సింలు సుదర్శన్‌ను వేడుకోగా రూ.8వేలు తీసుకురమ్మని చెప్పాడు. అదికూడా 21వ తేదీలోగా డబ్బు తీసుకుని పంచాయతీ ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఫిబ్రవరి 18న నర్సింలు ఏసీబీ జిల్లా కార్యాలయానికి వెళ్లి పరి స్థితి వివరించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావ్ ఓపథకం ప్రకారం నర్సింలును పురమాయించారు. దీంతో 21న నర్సింలు కోటగిరి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శికి రూ.8 వేలు నగదును లంచం ఇస్తుండగా ఏసీ బీ అధికారులు దాడిచేసి కార్యదర్శి సుదర్శన్‌ను రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఫైల్స్ అన్నింటిని సీజ్ చేశారు. సుదర్శన్‌ను శనివారం హెదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు జిల్లా రేంజ్ అధికారి సంజీవ్‌రావ్ తెలిపారు. ఎవరైన అధికారులు అంచం ఇవ్వాలని అడిగితే తమకు ఈ సెల్ నం. 94404 46155కు ఫోన్ చేయాలని సూచించారు. -
ఫిబ్రవరి లోగా తెలంగాణ
కట్టంగూర్ , న్యూస్‌లైన్ :ఫిబ్రవరి 2014లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మణవెల్లెంల కాలువ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2014 డిసెంబర్ వరకు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అభివృద్ది పనులను వేగవంతమవుతాయని తెలిపారు. బ్రాహ్మణవెల్లెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. సమన్యాయం అంటే ఏమిటో చెప్పకుండా ఢిల్లీలో దీక్ష చేపట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిచ్చోడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత బీజేపీతో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్ర లు పన్నినా తెలంగాణను ఆపలేరన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లను కానుకగా ఇవ్వాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రికి రూ.500 కోట్లు కేటాయించమని అడిగితే సీఎం కిరణ్ నిరాకరించారని తెలిపారు. తెలంగాణకు నిధులివ్వని సీఎంకు ఈ ప్రాంతాన్ని పాలించే హక్కు లేదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకరబోయిన నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ చెవుగోని సాయిలు, సర్పంచ్ మేడి కృష్టయ్య, నాయకులు పోగుల నర్సింహ, బీరెల్లి రామచంద్రయ్య, బూర్గు శ్రీను, మంగదుడ్ల వెంకన్న, గట్టిగొర్ల సత్తయ్య, ఎం. శేఖర్, మర్రి రాజు, రేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి భరతం పట్టిన సామాన్యుడు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : అక్షరజ్ఞానం కూడా లేని ఓ అమాయక రైతు అవినీతి భరతం పట్టాడు. పహణీ ఇచ్చేం దుకు లంచం కావాలంటూ మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న వీఆర్వోను ఏసీబీకి పట్టిం చాడు. అడిగినంత ఇచ్చుకోవడమే తప్ప.. ప్రశ్నించడం ఎరుగని తనలాంటి సామాన్యులకు ఆదర్శంగా నిలిచాడు. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రాచర్ల లింగయ్యకు 976 సర్వేనంబరులో 13గుంటల భూమి ఉంది. దానికి సంబంధించిన పహణీ కోసం మూడు నెలల క్రితం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ మేరకు పహణీ జారీ చేయాలని తహశీల్దార్ మర్రిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) మూలె సంజీవ్‌ను ఆదేశించారు. ఇందుకోసం రూ.8వేలు ఇవ్వాలంటూ లింగయ్యను సంజీవ్ డిమాండ్ చేశారు. తన దగ్గర అంత డబ్బు లేదని లింగయ్య ప్రాధేయపడగా రూ.5వేలకు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని లింగయ్య తమ బంధువుల వద్ద చెప్పి ఆవేదన వెల్లగక్కాడు. ఇటీవల ఏసీబీ దాడుల గురించి పత్రికల్లో వస్తున్న వార్తలను గమనించిన బంధువులు.. ఏసీబీని ఆశ్రయించాలని ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో లింగయ్య కరీంనగర్‌లోని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్‌ను సంప్రదించి విషయం చెప్పాడు. వారి సూచన మేరకు లింగయ్య సోమవారం ఉదయం రూ.5వేలు తీసుకుని వీఆర్వో సంజీవ్‌ను కలువగా, కరీంనగర్‌కు వచ్చి డబ్బులివ్వాలన్నాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంనగర్‌లోని ఓ స్వీట్‌హౌస్ వద్ద లింగయ్య నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. సంజీవ్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన సంజీవ్ 2008లో వీఆర్వోగా ఎంపికయ్యాడు. తొలి పోస్టింగ్ సొంత గ్రామంలోనే పొందిన ఆయన ఏడాదిన్నర క్రితం మర్రిపల్లి గ్రామానికి బదిలీ అయ్యాడు. సమాచారం ఇవ్వండి.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచాలు అడిగితే తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ సూచించారు. లింగయ్య చదువు రాకున్నా వీఆర్వో అవినీతిపై తమకు ఫిర్యాదు చేశాడని ఆయనను అభినందించారు. డీఎస్పీ సెల్‌నంబరు 94404 46150.