భూమి తిరిగి తీసుకుంటారని భయంతో..
Published Sat, Jul 1 2017 3:51 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
మాడ్గులపల్లి: తాను కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటారేమోననే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కుంచెం లింగయ్య(53) అనే రైతు అదే గ్రామానికి చెందిన ఓ దళితుడి నుంచి పదేళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. కాగా ఇప్పుడు ఆ భూమి నాదేనని అతని వారసులు వచ్చి గొడవ చేయడంతో.. మనస్తాపానికి గురైన లింగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement