ఖమ్మం జిల్లాలో రోడ్లకు త్వరలో మహర్దశ పట్టబోతుంది. ఆర్ అండ్ బీ సూపరిటెండెట్ ఇంజనీర్ ఎం. లింగయ్య గురువారం మండలంలో పర్యటించి,రోడ్లను పరిశీలించారు. అనంతరం విలేక ర్లతో మాట్లాడుతూ.. రూ.1400 కోట్లతో జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 8 మండలాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు 72 కి.మీ.మేర రెండు వరుసల రోడ్ల నిర్మాణం కోసం రూ.119 కోట్లు మంజూరు చేశామన్నారు.
జిల్లాలోని 24 ప్రధాన రహదారులను డబుల్ లైన్లగా మార్చేందుకు రూ.418 కోట్లు కేటాయించామని, వాటిలో 20 పనులకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నాబార్డు కింద ఏడు బ్రిడ్జ్‌లు,21 కి.మీల డబుల్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని,మార్చిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రణాళిక పద్దు కింద రూ.175 కోట్లతో జిల్లాలో 23 బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు.