పత్తి రైతు ఆత్మహత్య
Published Mon, Nov 28 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
కొత్తగూడ: వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లిలో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్జి లింగయ్య(36) పత్తి సాగు చేస్తున్నాడు. అయితే ఇటీవలి భారీ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. వచ్చే వేసవిలో కుమార్తె పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పంట నష్టపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుమార్తె పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో సోమవారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Advertisement