కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తకొండ గ్రామానికి చెందిన జుర్రు లింగయ్య (40) పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కార్యాలయం సిబ్బంది అతడిని హుటాహుటిన ములకనూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తన వాటా భూమిని సోదరుడు సంపత్ ఆయన పేరిట పట్టా చేయించుకున్నాడని... అది తన పేరిట మార్చాలని లింగయ్య కొద్దికాలంగా.. రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విషయమై మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రైతు ఆత్మహత్యాయత్నం
Published Mon, Feb 15 2016 2:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement