అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Fri, Jun 17 2016 8:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

The farmer committed suicide

అప్పుల బాధ భరించలేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన తొత్తల మల్లయ్య (59) గత ఏడాది వరిసాగు చేయగా వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో మూడెకరాల్లో పత్తి సాగు ప్రారంభించాడు. విత్తనాలు మొలకెత్తలేదు. రెండేళ్లుగా పంటలు పండలేదు. పెట్టుబడి చేతికందకపోవ డంతో పాటు పంటల సాగుకు రూ.మూడు లక్షల వ రకు అప్పులయ్యాయి. దీంతో అప్పులెలా తీర్చాలన్న బెంగతో మనస్తాపానికి గురై.. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement