Mallaiah
-
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
పొలంలో వరినాట్లు వేస్తుండగా హఠాత్తుగా..
రాజన్న, సిరిసిల్ల: తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సుద్దాల వెంకటేశంగౌడ్ (40) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశంకు భార్య స్రవంతి, ఇద్దరు కూతుళ్లు ఉండగా కొన్నేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు. మృతుడికి తల్లిదండ్రులు బాలయ్య, బాలలక్ష్మి, అక్క, తమ్ముడు ఉన్నారు. పొలంవద్దే ఆగిన రైతు గుండె.. పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన నంద్యాడపు బుచ్చి మల్లయ్య (68) పొలంలో వరినాట్లు వేయిస్తున్నాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. అప్పటి వరకు పొలం పనులు చేస్తూ కళ్లేదుటే బుచ్చిమల్లయ్య మృతిచెదండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య నర్సవ్వ, కొడుకు తిరుపతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు! -
కాకతీయ కాలువలో హెడ్ కానిస్టేబుల్ గల్లంతు.. ఆచూకీ దొరక్కపోవడంతో..
కరీంనగర్: ఎల్ఎండీ రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. తినుబండారం తిని కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. స్థానికులు గమనించి అతడ్ని కాపాడేందుకు తాడు వేసినా సమయానికి అందుకోకపోవడంతో పాటు కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. మల్లయ్య కరీంనగర్ భగత్‌నగర్‌లో నివాసం ఉంటూ హెడ్ కానిస్టేబుల్‌గా పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వద్ద గన్‌మెన్‌గా పని చేశాడు. ఈత వచ్చినా.. దుండే మల్లయ్యకు 50 ఏళ్ల వయసు ఉన్నా యువకుడిలా యాక్టీవ్‌గా ఉండేవాడు. మృదుస్వభావి, మంచికి మారుపేరుగా ఉండడంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టుబట్టి అతడ్ని గన్‌మెన్‌గా పెట్టుకున్నారు. అతడికి ఈత వచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. గల్లంతు అయ్యే సమయంలో మత్స్యకారులు తాళ్లు విసిరివేసే క్రమంలో మల్లయ్య కొద్దిదూరం ఈత కొట్టినట్లు సమాచారం. ఈదుకుంటూ కట్టవైపు రాకపోవడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళుతూ మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెనాల్లో నీటిని నిలిపివేసినా మల్లయ్య ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
ఇంటికి వెళ్లినా గది నుంచి బయటకు రాలేదు!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంట చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చందర్రావుతో సర్దుబాటు చేసుకునేందుకు మల్లయ్యయాదవ్ గురువారం ఆయన ఇంటికి వెళ్లారు బొల్లం వెంట అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మునగాల మండల నాయకులు సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేశ్ తదితరులు ఉన్నారు. ఇంటిలోపలే ఉన్న చందర్రావు తన ఇంటికి ఎమ్మెల్యే బొల్లం వచ్చారని చెప్పినా గది నుంచి బయటికి రాలేదు. దీంతో హాల్లోనే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దాదాపు 20 నిమిషాలు ఎదురుచూశారు. అప్పటికీ చందర్రావు బయటికి రాకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. -
గురుకుల కొలువుల పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) నిర్వహించిన అర్హత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. 6,52,413 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 4,93,727 మంది హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైంది. గురుకుల బోర్డు ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను టీఆర్‌ఈఐఆర్‌బీ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు గురుకుల బోర్డు నిర్వహించినవన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే కావడంతో మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే వీలుంటుంది. ముందుగా అభ్యర్థుల జవాబు పత్రాల నకళ్లు, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ ఖరారు చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగ కేటగిరీలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, కీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. వీటికి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో వెబ్సైట్లో పెట్టలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించాలని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది కీలు తయారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది కీ విడుదల చేసిన రోజునే అభ్యర్థులు సంబంధిత పరీక్షల్లో సాధించిన మార్కులు సైతం విడుదలవుతాయి. గురుకుల విద్యా సంస్థల్లో టాప్ పోస్టులుగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు డెమో పరీక్షలుంటాయి. -
కోదాడ నియోజకవర్గం ఘన చరిత్ర..ఇదే
కోదాడ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డిపై 756 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. పద్మావతిరెడ్డి పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి. ఉత్తం, పద్మావతిలు 2014లో ఇద్దరూ ఒకే అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి గెలిస్తే పద్మావతి కోదాడలో విజయం సాదించారు. కాని 2018లో పద్మావతి ఓటమి చెందారు. పద్మావతి మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేశారు. మల్లయ్యయాదవ్‌కు 89715 ఓట్లు రాగా, పద్మావతి రెడ్డికి 88359 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన అంజియాదవ్కు 5200 ఓట్లు వచ్చాయి. బొల్లం మల్లయ్య సామాజిక పరంగా యాదవ వర్గానికి చెందినవారు. 2014లో నల్లమాడ పద్మావతి తన సమీప ప్రత్యర్ధి, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది మల్లయ్య యాదవ్‌పై 13374 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 1978లో ఇక్కడ జనతా పక్షాన గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు అంతకు ముందు హుజూర్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఐ పక్షాన ఇక్కడ రెండుసార్లు, కొత్తగా మళ్ళీ ఏర్పడిన హుజూర్‌నగర్‌లో మూడుసార్లు గెలుపొందారు. 2019లో నల్గొండ ఎమ్.పిగా ఎన్నికవడంతో ఆయన హుజూర్ నగర్ సీటు వదలుకున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఉత్తం భార్య పద్మావతి పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన వీరేపల్లి లక్ష్మీనారాయణ 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడు సార్లు, జనతా పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. టిడిపి పక్షాన వేనేపల్లి చందర్రావు నాలుగుసార్లు గెలుపొందారు. కోదాడలో మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు వెలమ, ఒకసారి కమ్మ, ఒకసారి యాదవ, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి బిసి నేత గెలిచారు. కోదాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అమ్మ ఆరోగ్యం కోసం..70 కి.మీ.
రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య తన తల్లి ఆరోగ్యం బాగుకోసం ఆమెను ఓ చెక్కబండిలో కూర్చోబెట్టుకుని సుమారు 70.కిలోమీటర్లు ప్రయాణించాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకోవడంతోపాటు అక్కడ కొద్దిరోజులు గడిపితే తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకంతో సోమవారం ఖానాపూర్ నుంచి కర్రలతో తయారుచేసిన చెక్కబండిలో తల్లిని ఉంచి ప్రయాణం సాగించాడు. తన తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, కొండగట్టుకు తీసుకెళ్తే కుదుటపడుతుందని భావిస్తున్నట్లు మల్లయ్య చెప్పాడు. తనవద్ద డబ్బులు లేకున్నా..తల్లి ఆరోగ్యం ముఖ్యమని, ఇందుకోసం తల్లిని ఎక్కడికైనా తీసుకెళ్తానని తెలిపాడు. -
సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్యగుప్తా అంత్యక్రియలు పూర్తి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటవీరుడు జైని మల్లయ్యగుప్తా(97) బుధవారంరాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్యగుప్తా హైదరాబాద్ నాగోల్‌లోని తన కుమారుడు మధుసూదన్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం భౌతికకాయాన్ని బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పెద్ద కుమారుడి ఇంటికి తరలించారు. మల్లయ్యగుప్తా సతీమణి సునంద 10 ఏళ్ల క్రితమే మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన జైని మల్లయ్యగుప్తా 1945లో తెలంగాణ సాయుధపోరాటంలో కమ్యూనిస్టు నేత ఆరుట్ల రాంచంద్రారెడ్డి దళంలో పనిచేశారు. మల్లయ్య గుప్తా 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లారు. నిజాం రాచరిక వ్యవస్థ, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి నేతృత్వంలో సాగిన మహోద్యమంలో మల్లయ్యగుప్తా పాల్గొన్నారు. 1946 అక్టోబర్‌లో నిజాం ప్రభుత్వం మల్లయ్యతోపాటు పలువురిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే 1948లో జైలు నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు. ఆయనను పట్టించినవారికి ఇనాం ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ తరువాత పోరాటకాలంలో రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. 1942లో భువనగిరి పురపాలక సంఘానికి మల్లయ్య గుప్తా తొలి వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మొదటి నుంచి ఆయనకు సాహిత్యం, గ్రంథాలయోద్యమంపట్ల మక్కువ ఎక్కువ. అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించారు. పలువురు ప్రముఖుల సంతాపం జైని మల్లయ్యగుప్తా భౌతికకాయాన్ని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్, పాశం యాదగిరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, సీపీఎం నేత ఎం.శ్రీనివాస్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు అంబర్‌పేట శ్మశాన వాటికలో మల్లయ్యగుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. -
ఈటల మల్లయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన కేటీఆర్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న మల్లయ్య మెదక్ జిల్లాలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌తో తుదిశ్వాస విడిచారు. మృతుడు మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. My wholehearted condolences to Sri @Eatala_Rajender Garu and his family members on the loss of Sri Eatala Mallaiah Garu May his soul rest in peace 🙏 — KTR (@KTRTRS) August 24, 2022 -
ఈటల రాజేందర్ ఇంట విషాదం
సాక్షి, హనుమకొండ: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పితృవియోగంపై ఈటల రాజేందర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. సంతాప సూచికంగా.. కమలాపూర్తో పాటు హనుమకొండలో ఇవాళ బిజెపీ చేపట్టాల్సిన నిరసన దీక్షలు రద్దు అయ్యాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఇక ఈటల మలయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హఠాన్మరణం -
ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్పర్సన్ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం 9గంటలై నా రాలేదు. దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్ కమిషనర్ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్ చైర్ పర్సన్ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. -
తనకంటే ముందే తనువు చాలించాలని..
సాక్షి, రాయికోడ్(అందోల్): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్‌పూర్ సర్పంచ్ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
వైరల్‌గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో
సాక్షి, సూర్యాపేట : అధికారుల పోస్టింగులకు సంబంధించి కోదాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. ఎమ్మెల్యే ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని, వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో వారిని తప్పిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే విశిష్ట అధికారాలతో వీరందరితో పని చేయించుకోవచ్చు అధికారం మన చేతుల్లో ఉందన్నారు. తాము చెబితే ఎవరైనా వినాల్సిందే అంటూ చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అదే సందర్భంలో ఒక ఎంపీపీ వెళ్ళిపోతే మనకు ఏం కాదు ఆ మండలంలో ఎమ్మార్వో ఎస్సై ఎంపీడీవోలతో పనులు చేయించే బాధ్యత నాది అంటూ సదరు నాయకులు కార్యకర్తలకు ఆయన భరోసా ఇస్తున్నట్లు మాట్లాడిన వీడియో వాట్సాప్ గ్రూపులో విస్తృత చర్చకు దారితీసింది. అయితే ఈ వీడియో ఇటీవల మాట్లాడింది కాదని.. గతంలో (డిసెంబర్లో) మునగాల మండలం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడిన వీడియోగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఉత్తమ్‌కు షాకిచ్చిన టీడీపీ నేత
సాక్షి, నల్గొండ : ఎన్నికల ముందు మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగంగా నల్గొండ జిల్లా కోదాడ సీటు తనకే వస్తుందని భావించిన టీడీపీ నేత బొల్ల మల్లయ్య యాదవ్ టికెట్ రాకపోవడంతో గులాబీ గూటికి చేరారు. కోదాడ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతికి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరశ చెందిన ఆయన శుక్రవారం తెలంగాణ భవన్లో ఆపధర్మ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లయ్య పార్టీని వీడడంతో మహాకూటిమి అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి విజయంపై పడుతుందని అక్కడి నేతలు విశ్లేషిస్తున్నారు. మల్లయ్య చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహాకూటమిలో మల్లయ్య యాదవ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ‘‘కేసీఆర్‌యే స్వయంగా ఫోన్ చేసి తాను బలహీన వర్గాల గొంతుకగా ఉంటానని మల్లయ్యకు భరోసా ఇచ్చారు. కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే ఇంతమంది తెలంగాణ భవన్‌కు రావడం సంతోషకరం. తెలంగాణ భవన్లో ప్రతి రోజు వేలాది మందితో చేరికలు జరుగుతుంటే గాంధీ భవన్‌కు మాత్రం గేట్లకు తాళాలు వేస్తున్నారు. అక్కడ బౌన్సర్లే, ఉత్తమ్ ఇంటి వద్ద బౌన్సర్లే. 30 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మూడు కోట్లకు టికెట్ అమ్ముకుంటున్న వారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమేస్తారు. చంద్రబాబుకే తెలంగాణను అమ్ముకోరని గ్యారంటీ ఎంటి? వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారు అయ్యాయి. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. గత పాలనను చూడండి నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడండి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కిక్కురు చాలెంజ్!
అనగనగా ఒక దిబ్బరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు డబ్బరాజు. ఆ రాజ్యంలో రోడ్లు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో బస్సులు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో ఉద్యోగాలు లేవు. బార్లు ఉన్నాయి.ఆ రాజ్యంలో సంతోషాలు లేవు బార్లు ఉన్నాయి. సౌకర్యాలు లేవు....బార్లు ఉన్నాయి!‘యథారాజా తథాప్రజా’ అంటారు మాటవరుసకి.కానీ ఇక్కడ అది అక్షరాల నిజం. దిబ్బరాజ్యం రాజు డబ్బరాజు గజతాగుబోతు. ఆయన బాటలోనే ప్రజలు మత్తుగా నడుస్తున్నారు. తూలుతూ నడుస్తున్నారు. అకారణంగా ఎవరినో తిడుతూ నడుస్తున్నారు.రోజు రోజుకూ తాగుబోతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడంతో రాజ్యంలో వాంతిభద్రతల సమస్యతో పాటు శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తింది.అలాంటిలోజుల్లో ఒకరోజు మహామంత్రి మల్లయ్య రాజుగారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చి సీరియస్‌గా ఇలా అన్నాడు...‘‘అయ్యా! మీకు మందుచూపు తప్పా... ముందుచూపు బొత్తిగా లోపించింది. ఇలా అయితే మన దిబ్బరాజ్యంలో రాజ్యం మిగలదు. దిబ్బ మాత్రమే మిగులుతుంది. సోషల్‌మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో మనకేమవుతుందిలే అనుకుంటే మన్ను మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత తమ ఇష్టం’’‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆరో పెగ్గు అవలీలగా గుటుక్కుమనిపించి అడిగాడు రాజు.‘‘మీరు మందు మానేయండి... ప్రజలు కూడా మానేస్తారు’’ టీవీ యాంకర్లా వంకర్లు తిరుగుతూ సలహా ఇచ్చాడు మంత్రి.‘‘ఓస్... అంతేనా. ఇదే నా ఆన. ఈ ఫుల్‌బాటిల్ కంప్లీట్ చేసి.... ఇక ఈ జన్మలో మందు ముట్టను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా...‘‘ఈరోజు నుంచే రాజ్యంలో మందును నిషేధిస్తున్నాను’’ అని గట్టిగా అరిచాడు.‘‘నిషేధం విధించడం కంటే ప్రజలే స్వచ్ఛందంగా మందు మానేసేలా చేస్తే మంచిది మహారాజా’’ అన్నాడు మంత్రి.‘‘అలాగే’’ అంటూ చివరి పెగ్గు పూర్తి చేశాడు రాజు. ‘మందు మానేసిన వారికి లక్షరూపాయల క్యాష్ అవార్డ్’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ముగ్గురు కూడా మానలేదు.‘మందు మానేసిన వారికి అయిదు ఎకరాల పొలం’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ఇద్దరు కూడా మానలేదు.చివరిగా...‘మందుమానేసిన వారికి పది ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, అంబాసిడర్ కారు, ఫ్రిజ్జు, ఒనిడా కలర్‌టీవీ....’ ఒకటా రెండా...ఇలా ఎన్నో ప్రకటించింది ప్రభుత్వం.అయినా సరే....కనీసం ఒక్కరు కూడా మానలేదు!రాజుగారు జుట్టు పీక్కుందామని ట్రై చేశారుగానీ... తనది బట్టతల అని గుర్తుకొచ్చి నిరాశగా సైలెంటైపోయారు. రాజుగారికి ఏంచేయాలో పాలు పోవడం లేదు.సరే. పాలు తాగి ఆలోచిద్దాం అనుకున్నాడు.వేడి వేడి పాలుతాగుతున్న రాజుగారి దగ్గరికి కూల్‌గా నడిచి వచ్చాడు మంత్రి.‘‘మంత్రివర్యా! ఒక్కడు కూడా రాజ్యంలో మందుమానలేదయ్య...ఏంచేయాలో పాలు పోక ఇలా పాలు తాగున్నాను. నువ్వు కూడా తాగుతావా? పంచదార వేయమంటావా వద్దా?’’ అడుగుతున్నాడు రాజు.‘‘పాలు–పంచదార–తొక్క–తోటకూర...ఇది కాదు మహారాజా ఈ టైమ్‌లో మనం ఆలోచించాల్సింది. మన రాజ్యంలో ఇకముందు ఒక్కడు కూడా మందు తాగవద్దు. మందు అనే మాట వినబడగానే ముందు వెనక చూడకుండా పరుగెత్తాలి...దీనికి బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను’’ ఉత్సాహంగా చెప్పాడు మంత్రి.‘ఏమిటా ఐడియా?’’ మరింత ఉత్సాహంగా అడిగాడు రాజు.రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు మంత్రి.రాజుగారి ముఖం మున్సిపాలిటీ వారి స్ట్రీటులైటులా వెలిగిపోయింది!రెండు నెలలు తిరక్కుండానే మంత్రిగారు అన్నంత పనీ అయింది. రాజ్యంలో అందరూ మద్యం మానేశారు! ‘‘రాజా! ఇప్పుడు చెప్పు...ఏ ఐడియా ద్వారా మంత్రిగారు మందుబాబులు మందు అంటేనే జడుసుకునేలా చేశారు?’’ విక్రమార్కుడిని అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడంటే...‘‘భేతాళా! టైమ్లీ ఐడియా అని కొన్ని ఐడియాలు ఉంటాయి. ప్రతి కాలంలోనూ ఒక వేవ్లాంటిది, ట్రెండ్లాంటిది, పిచ్చిలాంటిది ఒకటి వస్తుంది. ఆ సమయంలోనే ఆ పిచ్చిలాంటి ట్రెండ్‌లోకి జంపైపోయి ఒక ఐడియా ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు’’‘‘విక్రమార్కా! నువ్వు ఏంచెబుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’’ అయోమయంగా అన్నాడు భేతాళుడు.‘‘ఇప్పుడు అందరినీ కిక్ ఎక్కిస్తున్నది ఏమిటి?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘కికి’’ అన్నాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు...‘‘ఒక కికి చాలెంజ్ అనే ఏమిటి! ప్లాంకింగ్ చాలెంజ్, చోకింగ్ చాలెంజ్, ఫైర్ చాలేంజ్, కట్టింగ్ చాలెంజ్...ఒక్కటా రెండా! ఇలా ఎన్నో చాలేంజ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బరాజ్యం ‘కిక్కురు’ అనే చాలెంజిని విసిరింది. మందులో కాస్త నీళ్లు పోసుకొని ఎవరైనా తాగుతారు. కానీ అయిదు లీటర్ల నీళ్లలో అర క్వార్టరు మందుతో పాటు, చింతపండు పులుసు, కాస్త ఆముదం కలుపుకొని తాగాలి. ఇదే ‘కిక్కురు చాలెంజి’. ఊహించినట్లుగానే మందుబాబుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కిక్కురు చాలెంజిని స్వీకరించని వారిని లెక్కలోకి తీసుకోని పరిస్థితి వచ్చింది. వేలంవెర్రి మొదలైంది. ఎంతో వాటర్+ కొంతమందు+ చింతపండు పులుసు+ కొంత ఆముదం= విరేచనాలు. ఈ ఫార్ములా ప్రకారం రాజ్యంలో ఎటుచూసినా విరేచనాలే. ఈ దెబ్బతో మందుబాబులకు మందు మీద విరక్తి పుట్టడమే కాదు ఒకలాంటి భయం ఏర్పడింది. అలా కేవలం మూడు నెలలలో కాలంలోనే మందుబాబులంతా కిక్కురుమనకుండా మందు మానేశారు. కిక్కురు చాలెంజా మజాకా!’’ – యాకుబ్ పాషా -
దూరపు దేశంలో నరక యాతన
రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన అక్కెనపల్లి మల్లయ్య(55) కూలి పనులు చేస్తూ జీవించేవాడు. ఆయన 1995లో బహ్రెయిన్ వెళ్లాడు. మనామ సిటీలో పనరానా కంపనీలో పనికి కుదిరాడు. నెలకు 45 దినార్ల జీతం. ఇండియన్ కరెన్సీలో రూ.4000. రెండేళ్ల పాటు పనిచేసి మర్తనపేట చేరాడు. అందరిలోనూ ఒకింత గుర్తింపు లభించింది. ఊరిలో భూమి కొనాలని అప్పట్లో రూ.85 వేలకు మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. బయానాగా రూ.35వేలు చెల్లించి, మిగతా రూ.50 వేలను గల్ఫ్ వెళ్లాక పంపిస్తానని చెప్పాడు. ఎంతో సంతోషంతో మళ్లీ బహ్రెయిన్ వెళ్లిన మల్లయ్య.. ఆ కంపనీలో పనిచేస్తే భూమి అప్పు తీరదని భావించి బయటకు వెళ్లాడు. బయట పని చేస్తూ ఇంటికి నెలకు రూ.10వేల చొప్పున పంపాడు. రెండు నెలలకే వీసా గడువు తీరిపోయింది. పాస్‌పోర్టు లేదు. వీసా లేదు. అయినా అక్కడే పని చేస్తూ భూమికి డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత మల్లయ్యకు కష్టాలు మొదలయ్యాయి. వీసా లేదని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇంటికి ఫోన్ చేసే అవకాశం లేదు. ఉత్తరం వేసే వీలు లేకపోయింది. బహ్రెయిన్ జైలులో ఉన్న మల్లయ్య సమాచారం భార్య లక్ష్మికి అందలేదు. ఐదేళ్లు జైలులో ఉండడంతో ఇంటి వద్ద భార్యకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించింది. భార్య చనిపోయిన విషయమూ మల్లయ్యకు తెలియని దుస్థితి. కేరళకు చెందిన ఓ అధికారి జోక్యంతో మల్లయ్య జైలునుంచి బయటకు వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మల్లయ్య భిక్షాటన చేస్తూ బతుకుసాగించాడు. మళ్లీ పోలీసులు పట్టుకుని జైలులో వేశారు. మూడు నెలలకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆరోగ్య క్షీణించి పక్షవాతం వచ్చింది. నడువలేని స్థితిలో ఉన్న మల్లయ్యకు ఊరిలో భార్య చనిపోయిన విషయం తెలిసింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని బహ్రెయిన్‌లోని భారత రాయభార కార్యాలయాన్ని ఆశ్రయించాడు. సొంత ఊరి నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పంపితేనే ఇండియాకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఊరి నుంచి ధ్రువీకరణ పత్రాలు పంపేవారు లేకపోయారు. ఇలా పదేళ్ల పాటు అక్కడే భిక్షాటన చేస్తూ.. ఇండియాకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఎంబసీ జోక్యంతో రెండేళ్ల కిందట ఇల్లు చేరాడు. ఊరవతల ఒంటరిగా.. మల్లయ్య ఊరి బయట పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఊరిలో స్థలం లేక.. ఇల్లు లేక పశువుల కోసం వేసి గుడిసెలో బతుకు సాగిస్తున్నాడు. ఊరిలోని వాళ్లే మల్లయ్యకు ఏడాదిగా తిండి పెడుతున్నారు. ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తున్నాడు. ప్రభుత్వం ఆసరా పింఛన్ మంజూరు చేసింది. రూ.1500 పింఛన్ డబ్బులతో మల్లయ్య జీవిస్తున్నాడు. మూడు చక్రాల సైకిల్‌ను ప్రభుత్వం ఇచ్చింది. రూ.10 లక్షల ప్రమాద బీమా గల్ఫ్‌తో సహా 18 ఈసీఆర్ దేశాలకు వెళ్లే ఈసీఆర్ కేటగిరీ పాస్‌పోర్ట్ కలిగిన కార్మికులకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ అనే ఇన్సూరెన్స్ పథకాన్ని ’మాండేటరీ’ (చట్టప్రకారం తప్పనిసరి) గా అమలు చేస్తున్నది. 2017 ఆగస్టు 1 నుంచి కొన్ని నిబంధనలను సరళతరం చేశారు. రూ.10 లక్షల ప్రమాద బీమా విదేశాలతోపాటు, భారత్‌లో కూడా వర్తిస్తుంది. యజమాని మారిన సందర్భంలో కూడా వర్తిస్తుంది. రెండేళ్ల కోసం రూ.275, మూడేళ్ళ కోసం రూ.375 ప్రీమియం చెల్లించాలి. ఆన్లైన్లో కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. గాయాలు, అనారోగ్యం, జబ్బు, వ్యాధుల చిత్సకు రూ.ఒక లక్ష ఆరోగ్య బీమా వర్తిస్తుంది. భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యుల చికిత్సకు రూ.50 వేలు, మహిళా ప్రవాసీ కార్మికుల ప్రసూతి సాయం రూ.35 వేలు, విదేశీ ఉద్యోగ సంబంధ న్యాయ సహాయం కోసం రూ.45 వేలు, మెడికల్ అన్‌ఫిట్ గానీ, ఒప్పందం కంటే ముందే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో గానీ విదేశం నుంచి భారత్‌కు రావడానికి విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ప్రమాదంలో చనిపోయినప్పుడు శవపేటికను తరలించడానికి, ప్రమాదం వలన శాశ్వత అంగవైకల్యం ఏర్పడినప్పుడు కూడా విమాన ప్రయాణ టికెట్టు ఇస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను https://emigrate.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇల్లు చేరుతానని అనుకోలేదు.. జైలులో అనేక కష్టాలు పడ్డాను. మన తెలుగువాళ్లు చాలా మంది కలిసే వాళ్లు. అనారో గ్యంతో పక్షవాతం రావడంతో పనిచేయలేకపోయాను. ఇండియాకు వచ్చేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పుట్టిపెరిగిన ఊరిలో కన్ను మూయాలని అనుకున్నారు. మర్తనపేటలోనే ఉంటున్నా. నాకొచ్చిన కష్టాలు పగోళ్లకు కూడా రావద్దు. – అక్కెనపల్లి మల్లయ్య, గల్ఫ్ బాధితుడు సౌదీలో కనీస వేతనాలు భారత ప్రభుత్వం 2014లో సౌదీ ప్రభుత్వానికి ప్రతిపాదించిన కనీస వేతనాలు ఈవిధంగా ఉన్నాయి. భవన నిర్మాణ కూలీలు, నైపుణ్యం లేని, పాక్షిక నైపుణ్యం కలిగిన కూలీలు, క్లీనర్లు, ఇంటి పని మనుషులు, అన్ని రకాల హెల్పర్లు, గార్డెనర్లు, వ్యవసాయ కూలీలకు 1500 రియాళ్ళు. నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, స్టీల్ ఫిక్సర్లు, ప్లంబర్లు, వెల్డర్లు, క్రేన్ ఆపరేటర్లు, ఏసీ టెక్నీషియన్లు, ఫ్యాబ్రికేటెర్లు, డెంటర్లు, టైల్ ఫిక్సర్లు, మెకానిక్‌లు, జనరల్ ఎలక్ట్రీషియన్లు, ఆటో ఎలక్ట్రీషియన్లు, డెకొరేటర్లు, టైలర్లు, మత్స్యకారులతోపాటు హోటళ్లలో పనిచేసే వంట మనుషులు, వేటర్లు, సూపర్వైజర్లకు 1700. భారీ యంత్రాలు నడిపే ఆపరేటర్లకు 1900 రియాళ్లు. నర్సు, లాబ్ టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్, క్లర్కు, సెక్రటరీ లాంటి వైద్య సిబ్బందికి 2100. అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రాఫ్ట్మన్లకు 2500. కంప్యూటర్ ప్రోగ్రామర్‌కు 3500 రియాళ్ళు. జనవరి 3న ఢిల్లీలో ఓపెన్ హౌజ్ గల్ఫ్‌తో సహా 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లేవారు, వాపస్ వచ్చినవారి సమస్యలను వినడానికి ప్రతినెల మొదటి బుధవారం ఢిల్లీలోని విదేశాంగ శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీజీఈ) కార్యాలయంలో ’ఓపెన్ హౌస్’ (ప్రవాసి ప్రజావాణి) నిర్వహిం చనున్నారు. జనవరి 3న బుధవారం ఢిల్లీలోని చాణక్యపురి, అక్బర్ భవన్లో గల పీజీఈ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ’ఓపెన్ హౌస్’ నిర్వహిస్తారు. వివరాలకు ఫోన్ నెం. 011 2467 3965 ఈ–మెయిల్:pge@mea.gov.in లో సంప్రదించవచ్చు.(సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్) -
సౌదీలో వలస కూలీ మృతి!
కోస్గి (కొడంగల్): జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మహ బూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి పల్లెగడ్డకు చెందిన మల్లయ్య(35) జీవనోపాధి కోసం 2014లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మల్లయ్య మృతి చెందాడంటూ తోటి కూలీలు గురువారం ఫోన్ చేసి ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. అయితే, పూర్తి సమా చారం తెలుసుకునేందుకు ఆరా తీయగా మొదట ఫోన్ చేసిన కూలీలు మళ్లీ అందు బాటులోకి రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో శుక్రవా రం కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను కలసి తమ పరిస్థితి వివరించారు. ఎంపీ జితేందర్ రెడ్డికి ఫోన్లో సమాచారం ఇవ్వగా ప్రభుత్వం తరఫున∙విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. -
ఒగ్గు కళాకారుడు మల్లయ్య కన్నుమూత
హైదరాబాద్: ఒగ్గు కళకు జీవం పోసి, పాటే ప్రాణంగా బతికిన దేవుని మల్లయ్య(62) (అచ్చన మల్లయ్య) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ముకునూర్‌లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచి ఒగ్గు కళతో అచ్చన మల్లయ్య గుర్తింపు పొందారు. తెలంగాణ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఒగ్గు కళాకారుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒగ్గు కళాకారుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేశారు. ప్రభుత్వంతో పోరాడి దాదాపు 3,000 మందికి పింఛన్ అందేలా కృషి చేశారు. కాగా, మల్లయ్య అంత్యక్రియలు గురువారం సాయంత్రం నిర్వహించారు. మల్లయ్య మరణం తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, జెడ్పీటీసీ సభ్యుడు పొట్టి అయిలయ్య, కళాకారులు, ప్రజలు నివాళులు అర్పించారు. -
యువరైతు ఆత్మహత్య
మెదక్: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన మెదక్ మండలంలోని కుచాన్‌పల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మల్లయ్య(28) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో వ్యవసాయ నిమిత్తం చేసిన అప్పులు పెరిగిపోవడంతో.. గత కొన్ని రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపాక మండలం లక్డారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలె మల్లయ్య(55)కు సుమారు 33 సంవత్సరాల క్రితం నంగనూరుకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. వీరి సంసారం పదేళ్లు సజావుగానే సాగింది. అనంతరం చిన్న గొడవ పడి భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కాపురానికి రాలేదనే మనస్తాపంతో మల్లయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకు దంపతులకు గాయాలు
వేములపల్లి మండలం మంగాపురంలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. పొలంలో వరినాట్లు వేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఈద మల్లయ్య(35), ఈద నాగమణి(32)లను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పాముకాటుతో రైతు మృతి
అరవపల్లి మండలం కొమ్మాలలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దూదిగామ మల్లయ్య(35) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా పాము కాటేసింది. హుటాహుటిన 108 వాహనంలో సూర్యాపేటకు తరలించగా..చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందాడు. -
పింఛన్ రావడం లేదని సజీవ సమాధికి యత్నం
మానసిక, శారీరక వికలాంగులైన భార్యాభర్తలు ఏ పనీ చేయలేక, ప్రభుత్వ ‘ఆసరా’ అందక చావే శరణ్యమనుకుని నిర్మించుకుంటున్న సమాధిని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య మానసిక, ఆయన భార్య ఉప్పలమ్మ శారీరక వికలాంగులు. ఉప్పలమ్మకు 2010 సెప్టెంబర్ వరకు పింఛన్ వచ్చేది. ఆ తర్వాత సదరం క్యాంపులో డాక్టర్ల నిర్లక్ష్యంతో పెన్షన్ కోల్పోరుుంది. మల్లయ్యకు ఐదు నెలలుగా పింఛన్ రావడం లేదు. దీంతో ఎలా బతకాలో తెలియని ఆ దంపతులు తమకు చావే దిక్కంటూ సమాధి నిర్మించుకుంటుండగా స్థానికులు అడ్డుకుని గ్రామంలోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ రూరల్ : అసలే పేద కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ అభాగ్యులకు ప్రభుత్వ ‘ఆసరా’ కరువైంది. భార్యాభర్తలిద్దరూ వికలాంగులే.. కానీ వారికి పింఛన్ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరూ సజీవ సమాధి కావాలని నిర్ణరుుం చుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య, ఉప్పల మ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులతో పాటు నెలనెలా వచ్చే పింఛన్‌తో జీవనం సాగించేవారు. మల్లయ్య మానసిక వికలాంగుడు కాగా, ఉప్పలమ్మకు అంగవైకల్యం. దీనికి తోడు ఇటీవల నడుం నొప్పి రావడంతో ఏపనీ చేయడం లేదు. ఈమెకు 2010 అక్టోబర్ నుంచి పింఛన్ రావటం లేదు. అంగవైకల్యం ఉన్నప్పటికీ సదరం క్యాంపు సందర్భంగా డాక్టర్లు పరీక్ష చేయకుండానే ఈమె బాగానే ఉందని, వికలాంగ పింఛన్‌కు అనర్హురాలని సర్టిఫికెట్ జారీ చేశారు. మల్లయ్యకు మానసిక వికలాంగుడు అని సదరం సర్టిఫికెట్ ఉంది. 2014 ఫిబ్రవరి 7న డాక్టర్లు ఆ సర్టిఫికెట్ జారీ చేశారు. అరుుతే రెండేళ్ల తర్వాత రీ అసైన్మెంట్ చేరుుంచుకోవాలని దానిపై ఉండడంతో 5 నెలలుగా మల్లయ్యకూ పింఛన్ నిలిచిపోరుుంది. ఇద్దరికి పెన్షన్ రాకపోవడంతో అధికారులు, సదరం క్యాంపు చుట్టు ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మల్లయ్య గ్రామ శివారులోని పెద్ద చెరువు కట్ట పక్కన వారం రోజులుగా సమాధి నిర్మించుకునే పనిలో పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సమాధి నిర్మాణాన్ని ఆపి మల్లయ్యను గ్రామంలోకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగం గా అప్పటి మంత్రి డీఎస్ రెడ్యానాయక్ పర్వతగిరిలో మొ దటి ఇంటిని మల్లయ్య దంపతులకు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఇద్దరికీ పింఛన్ వచ్చేదని స్థానికులు తెలిపార -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(38) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గొర్రెలను మేపుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక కరీంనగర్ జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన తొత్తల మల్లయ్య (59) గత ఏడాది వరిసాగు చేయగా వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో మూడెకరాల్లో పత్తి సాగు ప్రారంభించాడు. విత్తనాలు మొలకెత్తలేదు. రెండేళ్లుగా పంటలు పండలేదు. పెట్టుబడి చేతికందకపోవ డంతో పాటు పంటల సాగుకు రూ.మూడు లక్షల వ రకు అప్పులయ్యాయి. దీంతో అప్పులెలా తీర్చాలన్న బెంగతో మనస్తాపానికి గురై.. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
ఖానాపూర్ మండలం శాంతినగర్‌కు చెందిన పులి మల్లయ్య(65) ఎండవేడిమి తాళలేక బుధవారం సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. -
కూతురి పెళ్లి అడ్డుకున్నారని..
హయత్‌నగర్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చాకలి మల్లయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 20 రోజుల క్రితం కూతురికి బాల్యవివాహం చేస్తున్నాడని రెవెన్యూ అధికారులు, చైల్డ్ క మీషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి పెళ్లలు పడి ఇద్దరి మృతి
- మరొకరికి తీవ్ర గాయాలు ఎల్కతుర్తి(కరీంనగర్ జిల్లా) కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. జగన్నాధపురం శివారులో బావి తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి మల్లయ్య(55), రాజు(30) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రఘునాథపల్లి: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి చేశాడో కామాంధుడు. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పతేషాపూర్కు చెందిన ఓ మహిళ కొన్నాళ్లుగా మతిస్థిమితం కొల్పోరుు కంచనపల్లి శివారు శివాజీనగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. కంచనపల్లిలో కట్టర్‌గా పనిచేసే బాస్కుల మల్లయ్య ఈ నెల 17న రాత్రి సెంట్రల్ బ్యాంక్ సమీపంలో రేకుల షెడ్డులో ఒంటరిగా పడుకున్న మహిళపై మద్యం మత్తులో లైంగిక దాడి చేశాడు. మహిళ అరుపులు విన్న స్థానికులు వచ్చి మల్లయ్యను చితకబాదారు. అరుునా, అదే రాత్రి మరోసారి వచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉదయాన్నే స్థానిక ప్రజాప్రతినిధులు మల్లయ్యను ముక్కు నేలకు రాయించి తప్పనిపించి..ఘటన బయటకు పొక్కకుండా యత్నించినట్లు ఆరోపణలున్నారుు. స్థానికుల అండతో బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
కుమారుడిని చూసేందుకు వచ్చి..
శంకర్పల్లి: కుమారుడిని చూసేందుకు వచ్చిన ఓ తండ్రిని ఆటో ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మరొకరు మృతిచెం దారు. శంకర్పల్లి పోలీసుల కథనం ప్రకారం.. ధారూరు మండలం మైలరం గ్రామానికి చెందిన మల్లయ్య(55) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు గోపాల్ మోకిల గ్రామంలో అద్దెకు ఉంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం మల్లయ్య కుమారుడిని చూసేందుకు మోకిల గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం మోకిల గ్రామంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను వెనుక నుంచి టాటాఎస్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర రక్తగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు రాందాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు.. పరిగి: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకా రం.. పరిగి మండలం రంగంపల్లికి చెందిన మల్లయ్య(38) బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా తుంకిమెట్లలో తమ బంధువుల వద్ద జరిగిన వింధుకు వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చే క్రమంలో చీకటిపడింది. రంగంపల్లి గేటు వద్ద గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వరుడు అదృశ్యం.. నిలిచిన పెళ్లి..
చెన్నూర్ (ఆదిలాబాద్ జిల్లా): మరి రెండు రోజుల్లో పెళ్లి. అంతా రెడీ. వరుడు సరుకుల కోసం వెళ్లాడు. తిరిగి రాలేదు. బుధవారం ఉదయం కావాల్సిన వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పట్టణంలోని బజ్జారికాలనీకి బజ్జూరి బానయ్య కుమార్తెకు కోటపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పడాల సమ్మయ్య కుమారుడు మల్లయ్యతో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉంది. వరుడు మల్లయ్య పెళ్లి పనుల నిమిత్తం ఆదివారం చెన్నూర్‌కు వెళ్లగా.. సోమవారం ఇంటికి చేరలేదు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు వాళ్లకు చెప్పకపోవడంతో వాళ్లు అన్ని ఏర్పాట్లూ చేశారు. మంగళవారం రాత్రి వరకు కూడా మల్లయ్య రాకపోవడంతో తండ్రి సమ్మయ్య చెన్నూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వరుని జాడ తెలియకపోవడంతో బుధవారం 10 గంటలకు జరగాల్సిన వివాహం నిలిచిపోయింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వివాహ వేడుకకు వచ్చిన వారంతా వెనుదిరిగారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీలత తెలిపారు. -
70 ఏళ్లు దాటినా పింఛన్ ఇస్తలేరు!
సంగారెడ్డి అర్బన్: తనకు 70 సంవత్సరాలు దాటినా పెన్షన్ మంజూరు కావడం లేదని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా పెన్షన్ మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన మునగాల మల్లయ్య ఏజేసీ మూర్తికి ఫిర్యాదు చేశారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులను అందజేశారు. తన డబ్బుల సంచీని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని రామచంద్రపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన సుందర్రాజు విజ్ఞప్తి చేశారు. 8 నెలలుగా తనకు రేషన్ సరుకులు అందడం లేదని, కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన అంతమ్మ విజ్ఞప్తి చేసింది. తనకు రెండు నెలలుగా పెన్షన్ అందడం లేదని, కొత్త జాబితాలో కూడా పేరు లేదని అధికారులు చెబుతున్నారని దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు కాలేదని,పెన్షన్‌తో పాటు కొత్త రేషన్ కార్డు ఇప్పించాలని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్ కోరారు. తాను కళాకారుడినని, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్‌కు చెందిన టేకుమట్ల బసవయ్య విజ్ఞప్తి చేశారు. తనకు రెండు నెలలుగా పింఛను అందడం లేదని అదే గ్రామానికి చెందిన టేకుమట్ల సాయిలు పేర్కొన్నారు. ఈ - పంచాయతీ కంప్యూటర్ అపరేటర్‌గా 8 నెలల క్రితం హైదరాబాద్‌లోని కార్వీ సంస్థలో శిక్షణ పూర్తిచేసినా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ విషయమై అధికారులను కలిస్తే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారని, నిరుద్యోగులమైన తమకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాలని ఆపరేటర్లు రవీందర్, రామస్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్ , వెంకటేష్, దామోదర్ కోరారు. కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
‘ఆసరా’పై బెంగతో నలుగురు వృద్ధుల మృతి
సాక్షి నెట్వర్క్: ఆసరా పథకం జాబితా విడు దల చేయకపోవడంతో వృద్ధుల్లో ఆందోళన లు పెరుగుతున్నాయి. ఆసరా పథకం తమకు వర్తిస్తుందో.. లేదోనన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు వృద్ధులు మృతి చెందారు. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన ఎగ్గడి మల్లయ్య(80) పింఛన్ పథకంలో పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారంతో తన పేరు జాబితాలో ఉంటుందో లేదోనని బెంగపెట్టుకున్నాడు. అనారోగ్యానికి గురై వారం రోజు లుగా మంచం పట్టాడు. శనివారం వేకువ జామున మృతి చెందా డు. అయితే, మల్లయ్య కు పింఛన్ మంజూరైం దని ఎంపీడీవో శ్రీనివా స్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌కు చెందిన బెస్త నర్సుబాయి(68)కి పింఛన్ మంజూరైంది. ఈనెల 8 నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నర్సుబాయికి డబ్బులు అందకపోవడంతో పింఛన్ వస్తుందో.. రాదోనని బెంగపెట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి మనోవేదనతో గుండెపోటుతో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కీసన మండలం భోగారం గ్రామానికి చెందిన రొండ్ల మాసమ్మ(90)కి 3 నెలలుగా పింఛన్ రావడం లేదు. కొత్త పింఛన్ జాబితాలోనైనా తన పేరు ఉందో లేదోనని మాసమ్మ మనస్తాపం చెందింది. శనివారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని కప్రాయపెల్లికి చెందిన తుమ్మల బాల నర్సమ్మ (70) పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో మృతి చెందింది. -
ఎండిన పంట.. ఆగిన గుండె
రంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో రైతు మృతి బంట్వారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తిచేను ఎండుముఖం పట్టడం.. అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతన్న గుండె ఆగింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జినుగుర్తి మల్లయ్య(50) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఖరీఫ్ సీజన్లో పత్తిపంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రెండేళ్లుగా వడ్డీ వ్యాపారుల వద్ద రూ.20 వేలకు పైగా అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి ఇటీవల రూ.లక్ష దాటిపోయింది. వర్షాభావ పరిస్థితులతో పత్తిపంట ఎండుముఖం పట్టింది. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన మల్లయ్య చేనును చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రాత్రి ఇంటికి వెళ్లిన ఆయన అప్పులు ఎలా తీర్చుదామంటూ కుటుంబసభ్యులతో ఆవేదన వ్య క్తం చేశాడు. ఈక్రమం లో గురువారం తెల్లావారుజామున మల్లయ్యకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంట నే వికారాబాద్ ఆస్పత్రికి తరలించేయత్నం చేయగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతుడికి భార్య చంద్రమ్మ, ఇద్దరు కొడుకులున్నారు. -
ప్రక్షాళన ప్రారంభం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను ప్రక్షాళన చేసేందుకు ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత ఉపక్రమించారు. క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే డివిజన్ ఉపాధ్యక్షులను ఎంపిక చేశారు. ఈ విషయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మల్లయ్యతోపాటు తాజాగా అంతర్గత ఎన్నికల్లో గెలుపొందిన రాజిరెడ్డి వర్గంలోని కొందరు అసంతృప్తిగా ఉండటం చర్చనీయాంశం అయింది. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో డివిజన్ ఉపాధ్యక్ష పదవి కీలకమైంది. డివిజన్ ఉపాధ్యక్షుడు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో నెలకోసారి సంబంధిత జీఎంతో ఏరియా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుంది. రాజుకుంటున్న నిప్పు డివిజన్ కమిటీలతో మల్లయ్య, రాజిరెడ్డి వర్గాల మధ్య రచ్చ మళ్లీ రాజుకుంటోంది. మెజార్టీ వర్గం కార్మికులు పాత కమిటీలనే కొనసాగించాలని కోరుతున్నారని మల్లయ్య వర్గం వాదిస్తుండగా.. కోర్టు తీర్పును అనుసరించి, సంఘం శ్రేయస్సురీత్యా కొత్త ఉపాధ్యక్షులను ఎంపిక చేస్తున్నట్లు రాజిరెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇదే సమయంలో మల్లయ్య వర్గం సంఘం సభ్యత్వాలు తగ్గించడం ద్వారా రాజిరెడ్డి వర్గాన్ని బలహీనం చేయవచ్చనే ఎత్తుగడను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 5 వేల మంది కార్మికులు మల్లయ్య వర్గం డివిజన్ కమిటీలు ఉంటేనే తాము టీబీజీకేఎస్‌లో కొనసాగుతామని లేనిపక్షంలో సంఘం సభ్యత్వం నుంచి వైదొలుగుతామని పేర్కొంటూ లేఖలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. వారు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి డివిజన్ నియామకం కమిటీ రూపకల్పన జరిగిందనే వార్తల విషయమై సంఘం కీలక నేత ఒకరిని కలిసేందుకు కొందరు బెల్లంపల్లి నాయకులు ప్రయత్నించినట్లు సమాచారం. శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్ష పదవి విషయంలో తమకు న్యాయం చేయాలని కొందరు సింగరేణీయులు టీబీజీకేఎస్ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఓ నాయకుడిని కలిసినట్లు సమాచారం. అధిష్టానం మథనం టీబీజీకేఎస్ సంఘాన్ని ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ పార్టీ సమర్థులై న కొత్తవారికి పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యక్ష స్థానం దక్కించుకున్న వారి పనితీరుపై సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పనితీరు బాగోలే ని పక్షంలో మూడు లేదా నాలులు నెలలు వేచి చూసి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యవేక్షణ అంతా కవిత నేతృత్వంలో సాగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న డివిజన్ల అధ్యక్షులు శ్రీరాంపూర్-బంటు సారయ్య, మందమర్రి-జె.రవీందర్, బెల్లంపల్లి- శ్రీనివాసరావు, ఆర్జీ 1-గండ్ర దామోదర్, ఆర్జీ 2-అయిలి శ్రీనివాస్, ఆర్జీ 3- పెర్కారి నాగేశ్వరరావు, భూపాలపల్లి- అప్పని శ్రీనివాస్, కొత్తగూడెం-సంగం చంద్రయ్య, కార్పొరేట్-నరేంద్రబాబు, ఇల్లందు-వెంకటేశ్వర్లు, మణుగూరు-ఆకమయ్య. కొత్త ఉపాధ్యక్షులుగా ఖరారు చేసే అవకాశం ఉన్న పేర్లు.. మందమర్రి-సంపత్, బెల్లంపల్లి-సదాశివ్, ఆర్జీ 1-ఆరెల్లి పోషం, ఆర్జీ 2- రాఘవరెడ్డి లేదా సురేశ్, ఆర్జీ 3- రఘువీర్‌రెడ్డి, కొత్తగూడెం-కాపు కృష్ణ, ఇల్లందు- జగన్నాథం, కొత్తగూడెం కార్పొరేట్-కొమురయ్య, మణుగూరు-శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాంపూర్, భూపాలపల్లి-పేర్ల ఖరారు కసరత్తు సాగుతోంది. డివిజన్ ఉపాధ్యక్షులు సంబంధిత కమిటీల సభ్యుల కసరత్తు పూర్తిచేసిన అనంతరం ఆ పేర్లను సూచిస్తూ మేనేజ్మెంట్ కు లేఖ అందజేస్తారు. -
అన్న దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక తమ్ముడి ఆత్మహత్య
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘‘ఇల్లు అమ్మనివ్వటం లేదు. ఎవరినీ కొన నీయటం లేదు. ఉన్న ఇల్లు అమ్మి నా చిన్నకూతురు పెళ్లి చేద్దామంటే నా అన్న, అతని కొడుకులు... అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇక జీవితంలో నా కూతురు పెళ్లి చేయలేను, అతని దౌర్జన్యం ముందు నేను నిలబడలేక పోతున్నా... గ్రామపెద్దలారా...మీరే న్యాయం చేయండి. ఎస్ఐగారూ నా ఆత్మహత్యకు కారణమైన నా అన్నను, అతని కొడుకులను చట్టప్రకారం శిక్షించండి’’ అంటూ సూసైడ్ నోట్ రాసిన ఓ వ్యక్తి తొలుత విషం తాగి, అనంతరం తన అన్న ఇంటి ఎదుట ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయవిదారక ఈ సంఘటన మెదక్ మండలం పోచమ్మరాళ్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...మెదక్ మండల పరిధిలోని పోచమ్మరాళ్ గ్రామానికి చెందిన బీర్ల మల్లయ్య(40), బీర్ల నారాయణలు అన్నదమ్ములు. బీర్ల మల్లయ్యకు ముగ్గురు కూతుళ్లు సంతానం. నాలుగేళ్ల క్రితమే భార్య మృత్యువాతపడింది. తన వాటాగా వచ్చిన భూములను విక్రయించిన మల్లయ్య ఆ వచ్చిన సొమ్ముతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించాడు. పొలాలన్నీ అమ్మివేయగా మల్లయ్యకు ఓ ఇల్లు, ఆ ఇంటి ముందు ఖాళీ స్థలం మిగిలింది. దీంతో వాటిని కూడా విక్రయించి చిన్నకూతురు పెళ్లి చేయాలని భావించాడు. అందుకోసం తన ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లోనే ఉన్న అల్లుడి ఇంట్లో చిన్నకూతరుతో సహా ఉంటున్నాడు. అయితే మల్లయ్య తన ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించగా అతని అన్న బీర్ల నారాయణ, అతని కుమారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా తాము కొనం, ఇతరులను కొననివ్వమంటూ పేచీ పెట్టారు. దీంతో తగవు గురించి తెలుసుకున్న గ్రామస్తులెవరూ మల్లయ్య ఇంటిని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో మల్లయ్య కొన్నిరోజులుగా తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఓ పుస్తకంలో తన ఆత్మహత్యకు గల కారణాలన్నీ రాసి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగాడు. అనంతరం అక్కడ నుంచి తన అన్న నారాయణ ఇంటి వద్దకు వెళ్లి ఇంటి ఎదుటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఆ రోడ్డు వెంట వెళ్లేవారు గమనించి విషయాన్ని కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ ఎస్ఐ వేణుకుమార్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేసి ఆదుకోండయ్యా.... బీర్ల మల్లయ్య మృతితో అతని కూతుళ్లు ముగ్గురూ శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలోనే తమ తల్లి చనిపోయిందనీ, ఇపుడు తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో తాము దిక్కలేనివారమయ్యామంటూ రోదించారు. తమ పెదనాన్న నారాయణ, అతని కుమారులు వల్లే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తండ్రి మృతదేహంపై పడి వారు రోదించిన తీరు చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.