శంకర్‌పల్లి: కుమారుడిని చూసేందుకు వచ్చిన ఓ తండ్రిని ఆటో ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మరొకరు మృతిచెం దారు. శంకర్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. ధారూరు మండలం మైలరం గ్రామానికి చెందిన మల్లయ్య(55) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు గోపాల్ మోకిల గ్రామంలో అద్దెకు ఉంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
బుధవారం మల్లయ్య కుమారుడిని చూసేందుకు మోకిల గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం మోకిల గ్రామంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను వెనుక నుంచి టాటాఎస్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర రక్తగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు రాందాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..
పరిగి: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకా రం.. పరిగి మండలం రంగంపల్లికి చెందిన మల్లయ్య(38) బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా తుంకిమెట్లలో తమ బంధువుల వద్ద జరిగిన వింధుకు వెళ్లాడు.
అదే రోజు రాత్రి ఇంటికి వచ్చే క్రమంలో చీకటిపడింది. రంగంపల్లి గేటు వద్ద గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కుమారుడిని చూసేందుకు వచ్చి..
Published Fri, Jun 26 2015 12:54 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement