‘ఆసరా’పై బెంగతో నలుగురు వృద్ధుల మృతి
సాక్షి నెట్‌వర్క్: ఆసరా పథకం జాబితా విడు దల చేయకపోవడంతో వృద్ధుల్లో ఆందోళన లు పెరుగుతున్నాయి. ఆసరా పథకం తమకు వర్తిస్తుందో.. లేదోనన్న బెంగతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు వృద్ధులు మృతి చెందారు. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన ఎగ్గడి మల్లయ్య(80) పింఛన్ పథకంలో పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారంతో తన పేరు జాబితాలో ఉంటుందో లేదోనని బెంగపెట్టుకున్నాడు. అనారోగ్యానికి గురై వారం రోజు లుగా మంచం పట్టాడు.
శనివారం వేకువ జామున మృతి చెందా డు. అయితే, మల్లయ్య కు పింఛన్ మంజూరైం దని ఎంపీడీవో శ్రీనివా స్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌కు చెందిన బెస్త నర్సుబాయి(68)కి పింఛన్ మంజూరైంది. ఈనెల 8 నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నర్సుబాయికి డబ్బులు అందకపోవడంతో పింఛన్ వస్తుందో.. రాదోనని బెంగపెట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి మనోవేదనతో గుండెపోటుతో మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లా కీసన మండలం భోగారం గ్రామానికి చెందిన రొండ్ల మాసమ్మ(90)కి 3 నెలలుగా పింఛన్ రావడం లేదు. కొత్త పింఛన్ జాబితాలోనైనా తన పేరు ఉందో లేదోనని మాసమ్మ మనస్తాపం చెందింది. శనివారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని కప్రాయపెల్లికి చెందిన తుమ్మల బాల నర్సమ్మ (70) పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో మృతి చెందింది.