పింఛన్ బెంగతో 14 మంది మృతి | Pension concerned that killed 14 people | Sakshi
Sakshi News home page

పింఛన్ బెంగతో 14 మంది మృతి

Published Tue, Dec 23 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

Pension concerned that killed 14 people

సాక్షి నెట్‌వర్క్: పింఛన్ రాదేమోనని, రాలేదని వేర్వేరు జిల్లాల్లో 14 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుం డారం గ్రామానికి చెందిన ఎల్కంటి కొండాల్‌రెడ్డి(85)కి గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. తాజాగా తన పింఛన్ రద్దు కావడంతో బెంగపెట్టుకొని, సోమవారం గుండెపోటుకు గురయ్యా డు. ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెం దిన సముద్రాల గట్టయ్య(68)కు గతంలో పిం ఛన్ వచ్చేది.

తాజాగా తొలగించడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. రామగుండం మండలం గోలివాడకి చెందిన గుడి లక్ష్మి(70)కూ గతం లో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. తాజా జాబితా లో పేరు లేకపోవడంతో పింఛన్ వస్తుందో రాదోనని బెంగతో తుదిశ్వాస విడిచింది. ఇదే జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన కొంకట రాజయ్య(85) పింఛన్ రాలేద న్న బెంగతో సోమవారం గుండెపోటుకు గురయ్యాడు. హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి పంచాయతీ పరిధి బొడిగపల్లికి చెందిన బొడి గె సారయ్య(50) వికలాంగుడు.

తాజా జాబితాలో పింఛన్ రాకపోవడంతో బెంగతో సోమవారం మృతి చెందాడు.  మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లికి చెందిన పచ్చివెండ్ల రామలచ్చవ్వ(75)కూ తాజా జాబితాలో పేరు లేకపోవడంతో ఆదివారం రాత్రి నిద్ర లోనే చనిపోయింది. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనపతుర్తి శివారు రామోజీతండాకు చెందిన గుగులోతు పెద్ద పంతులు (80)కు పింఛన్ రాదని అధికారులు తేల్చడం తో  సోమవారం చనిపోయాడు.

నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశ్వాపురానికి చెందిన పెద వీరయ్య(80), యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన జి. బిక్షపతి(80), ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని శ్రీపతి నగర్‌కు చెందిన పారుపెల్లి రమాదేవి(35), ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ గౌన్ల రామవరం ప్రాంతానికి చెందిన కండె ముసలయ్య(79), చండ్రుగొండ మండలం గానుగపాడు పంచాయతీ పరిధి అన్నారం తండాకు చెందిన నూనావత్ కేళీ(71), ఖమ్మంకి చెందిన కవడి వెంకటేశ్వర్లు(73), వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్‌ఎం) గ్రామానికి  చెందిన  మామడిశెట్టి రాజేశ్వరి(75)  పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆందోళనకు గురై సోమవారం మృతి చెందారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement