నిద్రకూ గుండెపోటు నివారణకూ సంబంధం ఉంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల తో గుండెపోటును ఇలా నివారించుకోవచ్చు.
►మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక.
►మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
►తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు.
►నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది.
►నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.
మంచి నిద్రతో గుండెపోటు దూరం
Published Sat, Mar 13 2021 12:01 AM | Last Updated on Sat, Mar 13 2021 3:14 AM
Comments
Please login to add a commentAdd a comment