ప్రతీకాత్మక చిత్రం
గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు.. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. జగ్గును బతికించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వైద్యుడు లక్ష్మణ్ సైతం గుండెపోటుకు గురై అక్కడికక్కడే తనువు చాలించారు. వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించే క్రమంలో పేషెంట్ కూడా మృత్యు ఒడికి చేరాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలు గాంధారిలో విషాదాన్ని నింపాయి. ఇలా రోజూ ఎందరో గుండెపోటుకు గురై మృత్యువాతపడుతున్నారు.
సాక్షి, కామారెడ్డి: అన్ని రంగాల్లో పెరిగిన పో టీ, మారిన ఆహారపు అలవాట్లు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తపోటు గుండెపోటుకు దారితీస్తోంది. సకాలంలో గు ర్తించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పలువురు మృత్యుఒడికి చేరుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 33,137 మంది, నిజామాబాద్ జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లాలో 90 వేల పైచిలుకు మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మధుమేహం బారిన పడిన వారు కామారెడ్డి జిల్లాలో 17,690 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మధుమేహం బాధితులు 47 వేలు దాటారు.
ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లతో..
పొగ పీల్చడం, అతిగా మద్యం సేవించడం, అనవసరపు ఒత్తిళ్లు, జంక్ ఫుడ్ తినడం వంటి వాటితో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
ఒత్తిళ్లను అధిగమించాలి
ముఖ్యంగా యువత సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, మద్యం సేవించ డం, స్థూలకాయం, ఒత్తిడి వంటి వాటితో గుండె జబ్బులబారిన పడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది.
– సురేశ్, ఎండీ, జనరల్ ఫిజీషియన్, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment