ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది.
– ఎన్. శ్రీలీల, చెన్నై
ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్‌లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది.
అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్‌బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి.
బీఎమ్‌ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి.
- డా.భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment