అందని పింఛన్ డబ్బులు..!
అందని పింఛన్ డబ్బులు..!
Published Sat, Mar 4 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
దేవనకొండ: మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు శుక్రవారం పింఛన్ డబ్బులు రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని చెల్లిచెలిమల, వెలమకూరు, నల్లచెలిమల, కప్పట్రాళ్ల, దేవనకొండతో పాటు మరో 7 పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. దీంతో 3 వేల మంది పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement