పింఛన్ రావడం లేదని సజీవ సమాధికి యత్నం | Looking at the pension was not coming xeno | Sakshi
Sakshi News home page

పింఛన్ రావడం లేదని సజీవ సమాధికి యత్నం

Published Mon, Jul 11 2016 2:47 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

పింఛన్ రావడం లేదని   సజీవ సమాధికి యత్నం - Sakshi

పింఛన్ రావడం లేదని సజీవ సమాధికి యత్నం

మానసిక, శారీరక వికలాంగులైన భార్యాభర్తలు ఏ పనీ చేయలేక, ప్రభుత్వ ‘ఆసరా’ అందక చావే శరణ్యమనుకుని నిర్మించుకుంటున్న సమాధిని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య మానసిక, ఆయన భార్య ఉప్పలమ్మ శారీరక వికలాంగులు. ఉప్పలమ్మకు 2010 సెప్టెంబర్ వరకు పింఛన్ వచ్చేది. ఆ తర్వాత సదరం క్యాంపులో డాక్టర్ల నిర్లక్ష్యంతో పెన్షన్ కోల్పోరుుంది. మల్లయ్యకు ఐదు నెలలుగా పింఛన్ రావడం లేదు. దీంతో ఎలా బతకాలో తెలియని ఆ దంపతులు తమకు చావే దిక్కంటూ సమాధి నిర్మించుకుంటుండగా స్థానికులు అడ్డుకుని గ్రామంలోకి తీసుకొచ్చారు.

 

మహబూబాబాద్ రూరల్ : అసలే పేద కుటుంబం.. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ అభాగ్యులకు ప్రభుత్వ ‘ఆసరా’ కరువైంది. భార్యాభర్తలిద్దరూ వికలాంగులే.. కానీ వారికి పింఛన్ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరూ సజీవ సమాధి కావాలని నిర్ణరుుం చుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య, ఉప్పల మ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులతో పాటు నెలనెలా వచ్చే పింఛన్‌తో జీవనం సాగించేవారు. మల్లయ్య మానసిక వికలాంగుడు కాగా, ఉప్పలమ్మకు అంగవైకల్యం. దీనికి తోడు ఇటీవల నడుం నొప్పి రావడంతో ఏపనీ చేయడం లేదు. ఈమెకు 2010 అక్టోబర్ నుంచి పింఛన్ రావటం లేదు. అంగవైకల్యం ఉన్నప్పటికీ సదరం క్యాంపు సందర్భంగా డాక్టర్లు పరీక్ష చేయకుండానే ఈమె బాగానే ఉందని, వికలాంగ పింఛన్‌కు అనర్హురాలని సర్టిఫికెట్ జారీ చేశారు. మల్లయ్యకు మానసిక వికలాంగుడు అని సదరం సర్టిఫికెట్ ఉంది. 2014 ఫిబ్రవరి 7న డాక్టర్లు ఆ సర్టిఫికెట్ జారీ చేశారు. అరుుతే రెండేళ్ల తర్వాత రీ అసైన్‌మెంట్ చేరుుంచుకోవాలని దానిపై ఉండడంతో 5 నెలలుగా మల్లయ్యకూ పింఛన్ నిలిచిపోరుుంది. ఇద్దరికి పెన్షన్ రాకపోవడంతో అధికారులు, సదరం క్యాంపు చుట్టు ఎన్నిసార్లు  తిరిగినా ఫలితం లేదు.


దీంతో జీవితంపై విరక్తి చెందిన మల్లయ్య గ్రామ శివారులోని పెద్ద చెరువు కట్ట పక్కన వారం రోజులుగా సమాధి నిర్మించుకునే పనిలో పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సమాధి నిర్మాణాన్ని ఆపి మల్లయ్యను గ్రామంలోకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగం గా  అప్పటి మంత్రి డీఎస్ రెడ్యానాయక్ పర్వతగిరిలో మొ దటి ఇంటిని మల్లయ్య దంపతులకు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఇద్దరికీ పింఛన్ వచ్చేదని స్థానికులు తెలిపార

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement