భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపాక మండలం లక్డారంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలె మల్లయ్య(55)కు సుమారు 33 సంవత్సరాల క్రితం నంగనూరుకు చెందిన ఓ యువతితో పెళ్లయింది. వీరి సంసారం పదేళ్లు సజావుగానే సాగింది. అనంతరం చిన్న గొడవ పడి భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కాపురానికి రాలేదనే మనస్తాపంతో మల్లయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
Published Sun, Aug 21 2016 7:11 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement