ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
రఘునాథపల్లి: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి చేశాడో కామాంధుడు. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పతేషాపూర్‌కు చెందిన ఓ మహిళ కొన్నాళ్లుగా మతిస్థిమితం కొల్పోరుు కంచనపల్లి శివారు శివాజీనగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. కంచనపల్లిలో కట్టర్‌గా పనిచేసే బాస్కుల మల్లయ్య ఈ నెల 17న రాత్రి సెంట్రల్ బ్యాంక్ సమీపంలో రేకుల షెడ్డులో ఒంటరిగా పడుకున్న మహిళపై మద్యం మత్తులో లైంగిక దాడి చేశాడు.
మహిళ అరుపులు విన్న స్థానికులు వచ్చి మల్లయ్యను చితకబాదారు. అరుునా, అదే రాత్రి మరోసారి వచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉదయాన్నే స్థానిక ప్రజాప్రతినిధులు మల్లయ్యను ముక్కు నేలకు రాయించి తప్పనిపించి..ఘటన బయటకు పొక్కకుండా యత్నించినట్లు ఆరోపణలున్నారుు. స్థానికుల అండతో బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి
Published Thu, Aug 20 2015 2:15 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement