insane
-
మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి
రాయగడ (ఒడిశా): మతిస్థిమితి లేని బాలికపై లైంగికదాడి జరిగిన సంఘటన జిల్లాలో సంచలనం రేకిత్తించింది. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలోని నతమ గ్రామంలో భగీరథి నచిక తన 13 ఏళ్ల దివ్యాంగ బాలికను ఎప్పటిలాగే ఇంటి దగ్గరే ఉంచి, కట్టెల కోసం భార్యతో కలిసి సమీపంలోని అడవికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసిన దుండగులు బాధిత బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ వివస్త్రగా ఉండడం చూసి, మతిస్థిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. కన్నీరుమున్నీరైన బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ని ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని, కోర్టుకు అప్పగిస్తామని ఐఐసీ అధికారి రస్మీరంజన్ ప్రధాన్ భరోసా తెలిపారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) -
చెట్టుఎక్కి మతిస్థిమితం లేని మహిళ హల్చల్
సాక్షి, విజయవాడ: మతిస్థిమితం లేని ఓ మహిళ చెట్టుఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ అందరికి ముచ్చెమటలు పట్టించిన ఘటన మంగళవారం నగరంలోని కాందారీ రోడ్లో చోటు చేసుకొంది. చెట్టు దిగమని స్థానికులు ఎంత చెప్పినా పట్టించుకోకపోగా.. దూకేస్తానని మహిళ బెదిరించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. చెట్టుకు నిచ్చెన వేసి అతి కష్టం మీద మహిళను కిందకు దించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చెట్టు ఎక్కే క్రమంలో సదరు మహిళకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, ఆమెకు మతిస్థిమితం లేనట్టు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. -
వ్యక్తిని కొట్టి చంపేశారు..
గంపలగూడెం(తిరువూరు): ఒకరిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని పెనుగొలనుకు చెందిన బొల్లెపోగు నరసింహారావు(23)కు మతిస్థిమితం లేదు. రాత్రి సమయంలో మట్టగుంజ పిచ్చియ్య ఇంటివద్ద తిరుగుతున్నాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావని నరసింహారావును పిచ్చియ్య ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో పిచ్చియ్య, కృష్ణ మరికొందరు కలసి నరసింహారావును చెట్టుకు కట్టేశారు. దాడి చేశారు. తలకు, పొట్టమీద బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. ఈవిషయమై మృతుడి తల్లి అనసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నూజివీడు సీఐ రామ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో భయం!
కొడవలూరు: కోవూరులో సంచలనం సృష్టించిన సైకో భయం ఇప్పటికీ వీడలేదు. మతిస్థిమితం లేని వ్యక్తిని సైకోగా భావించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటన మండలంలోని గుండాలమ్మపాళెం గాంధీ గిరిజన కాలనీలో గురువారం చోటుచేసుకొంది. కాలనీలో మహిళలు దుస్తులు ఉతుక్కొంటుండగా వారున్నచోటుకు ఓ మతిస్థిమితం లేని యువకుడు వెళ్లి హిందీలో బెదిరించినట్లు మాట్లాడాడు. మహిళలు భయాందోళనకు గురై సైకో అంటూ కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి అక్కడే కట్టేశారు. నంబర్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ సమాచారం తెలుసుకున్న దగదర్తి ఎస్సై విజయకుమార్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి చేతిలో బ్లేడు కూడా ఉందని మహిళలు తెలియజేయడంతో యువకుడ్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఎలాంటి ఆయుధాలు లేకపోగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండటంతో స్టేషన్‌కు తరలించి వివరాలు రాబట్టేందుకు యత్నించారు. హిందీలో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడే తప్ప పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో ఇతర రాష్ట్రానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. స్థానికులు చితకబాదడంతో యువకుడికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆ యువకుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. కోవూరులో అలజడి సృష్టించిన సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం ఉన్నా పోలీసు వర్గాలు అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో సైకో భయం ప్రజలను వీడలేదు. రోజూ ఏదోఒక చోట సైకో పేరుతో మద్యంప్రియులు, మతిస్థిమితం లేని వ్యక్తులను ఆయా ప్రాంతాలవారు చితకబాదుతూనే ఉన్నారు. -
మతిస్థిమితం లేని యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. హబ్సిగూడలో ఉండే అన్నపూర్ణ కుమార్తె జన్ను మానస(19)కు మతిస్థిమితం లేదు. ఆమె శనివారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ప్రధాన రహదారిపై ఓ ఆటో ఎక్కిన ఆమెను... ఎక్కడకు వెళ్లాలని ఆటో డ్రైవర్ అడిగాడు. సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆటో డ్రైవర్ ఆమెను అక్కడే రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా మానస కనిపించకపోవడంతో అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. కాగా, మానస ఇటీవల మరణించిన ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ జె.శ్రీనివాసులు(జెస్సీ) కుమార్తె. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు పసుపు రంగు పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆచూకీ తెలిసిన వారు ఓయూ పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
మధుయాష్కీకి మతిస్థిమితం తప్పింది
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ మతిస్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీ కవితలపై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. యాష్కీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలసి గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని కవిత అభివృద్ధి చేస్తున్నారని, ఏడు నియోజకవర్గాల్లో రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కవితదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ టీఆర్ఎస్ను కవిత బలోపేతం చేస్తున్నారని.. పార్టీ బలపడితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్న అక్కసుతోనే యాష్కీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా సోకుల కోసమే కవిత విదేశాలకు వెళుతున్నారని యాష్కీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై యాష్కీ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు అర్థరహితమని, ఆ విద్యలు కాంగ్రెస్ నేతలకే తెలుసన్నారు. ప్రధాని మోదీని రాహుల్ కలిస్తే లేని తప్పు.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే తప్పా అని నిలదీశారు. తాము ఏం చేసినా బాజాప్తా చేస్తామని, ఉస్మానియా వర్సిటీపై కాంగ్రెస్ నేతలకు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మధు యాష్కీ పవర్ పోయి పరేషాన్ లో మాట్లాడుతున్నారని, ఎంపీ నిధులను ఖర్చు చేయకుండా వాపస్ పంపిన ఘనత యాష్కీదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. -
మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడికి యత్నం
మామిళ్లవారిగూడెం(అశ్వారావుపేట రూరల్): మతిస్థిమితం లేని ఓ యువతిపై లైంగిక దాడికియత్నం జరిగిన సంఘటన మండలంలో మం గళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మామిళ్లవారిగూడెంలో బంధువు ఇంటి వద్ద ఉంటు న్న మతిస్థిమితం లేని ఓ యువతి(16) మధ్యాహ్నం సమయంలో సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లగా తిరుమలకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి యత్నించినట్లు ప్రచారం జరుగుతుంది. మతిస్థిమితం లేని యువతి కావడంతో బంధువుల్లో ఒకరు అటువైపుగా వెళ్లడంతో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిసింది. దీనిపై కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని గ్రామ పెద్దలకు సమాచారం అందించి వాహనాన్ని అప్పగించారు. కాగా లైంగిక దాడికి యత్నించిన యువకులపై గతంలో కుడా గిరిజన యువతిపై లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయి. -
మహిళలపై దుండగుడి దాడి
కర్రతో కొట్టడంతో ఇద్దరికి గాయాలు కేకలు వేయడంతో పలాయనం పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత మతిస్థిమితం లేదని సమాచారం గతంలో జరిగిన బైక్ దొంగతనాలతో సంబంధాలున్నట్లు అనుమానం ముదినేపల్లి రూరల్ : ఉభయ గోదావరి జిల్లాల్లో సూది సైకోగాళ్లు సంచలనం సృష్టిస్తుండగా తాజాగా ముదినేపల్లి మండలంలో ఆదివారంఒక వ్యక్తి ఇద్దరు మహిళలపై దాడిచేయడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళలు స్థానిక పెదలంక డ్రెయిన్‌లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, కలిదిండి ధనలక్ష్మి పెదలంక డ్రెయిన్‌పై ఉన్న వంతెన సమీపంలో ఆదివారం బట్టలు ఉతుకుతున్నారు. అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి కర్ర, కత్తి, తాడుతో హఠాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు పరుగున వచ్చారు. వారిని గమనించిన సదరు వ్యక్తి సమీప పొలాల్లోకి పారిపోయాడు. యువకులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చినవాడవల్లి సమీపంలోని వరి పొలాల్లో దాక్కుని ఉన్న దుండగుడిని ఎట్టకేలకు పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో ముదినేపల్లి పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత మహిళలను స్థానికులు 108 అంబులెన్సులో గుడివాడలో ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మతి స్థిమితం లేకే... దుండగుడిని గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన ఈడే ఏడుకొండలుగా గుర్తించినట్లు తెలిసింది. పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం అత్తవారిల్లు కాగా కొంతకాలంగా మతి స్థిమితం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏడుకొండలు గురించి స్థానిక పోలీసు లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని మోటార్ బైక్ దొంగతనం కేసుల్లో ఏడు కొండలు పాత్ర ఉన్నట్లు అనుమానించి విచారిస్తున్నట్లు సమాచారం. -
మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రఘునాథపల్లి: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడి చేశాడో కామాంధుడు. బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పతేషాపూర్కు చెందిన ఓ మహిళ కొన్నాళ్లుగా మతిస్థిమితం కొల్పోరుు కంచనపల్లి శివారు శివాజీనగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. కంచనపల్లిలో కట్టర్‌గా పనిచేసే బాస్కుల మల్లయ్య ఈ నెల 17న రాత్రి సెంట్రల్ బ్యాంక్ సమీపంలో రేకుల షెడ్డులో ఒంటరిగా పడుకున్న మహిళపై మద్యం మత్తులో లైంగిక దాడి చేశాడు. మహిళ అరుపులు విన్న స్థానికులు వచ్చి మల్లయ్యను చితకబాదారు. అరుునా, అదే రాత్రి మరోసారి వచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఉదయాన్నే స్థానిక ప్రజాప్రతినిధులు మల్లయ్యను ముక్కు నేలకు రాయించి తప్పనిపించి..ఘటన బయటకు పొక్కకుండా యత్నించినట్లు ఆరోపణలున్నారుు. స్థానికుల అండతో బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు
హైదరాబాద్: నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. మతిస్థిమితం సరిగా లేని ఆ వ్యక్తి రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది గుండెల్లో గంటన్నరపాటు ‘రైళ్లు’ పరుగెత్తించాడు. పిచ్చిగా అరుస్తూ... పరుగులు పెడుతూ.. చివరికి తన ప్రాణాలకే ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దొల్లోనిపల్లికి చెందిన సంపంగి రంగయ్య (40) వృత్తిరీత్యా వడ్డరి. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం భార్య కాంతమ్మ కుమారుడు శ్రీకాంత్‌తో కలసి ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. నగరంలోని తన సోదరి బాలమ్మ చిరునామా కోసం తిరగగా దొరకలేదు. దీంతో గత్యంతరం లేక మళ్లీ కుటుంబంతో సహా మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నాడు. అంతలోనే అకస్మాత్తుగా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. తొలుత ప్లాట్‌ఫాం పైన ఉన్న రేకులషెడ్డు మీదకు ఎక్కాడు. అక్కడి నుంచి కేకలు వేసుకుంటూ పక్కనే నిలిచి ఉన్న శాతవాహన రైలుపై దూకాడు. రైల్వే పోలీసులు,ప్రయాణికులు ఎంత వారించినా వినకుండా రైలు బోగీల మీది నుంచి పరుగు తీయడం మొదలుపెట్టాడు. ఒక బోగీపై నిల్చుని బీడీ కాల్చేందుకు అగ్గిపుల్లను అంటించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో రైలుకు అనుసంధానమై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ రంగయ్య చేతికి తగలడంతో పెద్ద పెట్టున మంటలు చెలరేగాయి. రంగయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలు ఉండడంతో రంగయ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
‘మదపిచ్చి’ మగ మృగాలు..
సామర్లకోట :తమ బిడ్డకు పట్టిన దుర్గతి.. కలలో కూడా మరెవరి బిడ్డకూ రాకూడదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘పిచ్చితల్లులను’ కూడా మదపిచ్చి తీర్చుకునే పనిముట్లుగా చూసే వారి నీచత్వానికి ఎన్నడు తెరపడుతుందని ఆక్రోశిస్తున్నారు. ఆడదై పుట్టినంత మాత్రాన ఈ లోకంలో అణువణువునా ఆపదలను, అభద్రతనూ ఎదుర్కోవలసిందేనా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక రజకపేటకు చెందిన ముమన కావమ్మ(23) అనే మతిస్థిమితం లేని యువతి శుక్రవారం రైల్వేస్టేషన్ వద్దనున్న జయ డార్మిటరీ బాత్రూమ్లో ప్రసవవేదనతో మరణించిన విషయం తెలిసిందే. కావమ్మకు చాలా కాలం నుంచి మతిస్థిమితం లేదు. వైద్యులకు చూపినా ఫలితం లేదనడంతో తల్లిదండ్రులైన గంగ, త్రిమూర్తులు చేసేది లేక మిన్నకుండిపోయారు. కావమ్మ పట్టణంలోనే తిరుగుతూ దుకాణాల్లో చిన్నచిన్న పనులు చేస్తూ వారిచ్చే డబ్బులు తీసుకునేది. మధ్యమధ్య ఇంటికి వస్తుండేది. పిచ్చిదైన తమ బిడ్డ ఎక్కడెక్కడ తిరిగినా అప్పుడప్పుడూ కనిపిస్తే చాలని, పిచ్చితనమే ఓ రకంగా ఆమెకు రక్షణ అని తల్లిదండ్రులు భావించారు. అంతేతప్ప ఆడదైతే చాలు అని.. కాముకతను తీర్చుకోవడానికి సిద్ధమయ్యే పరమ నికృష్టులు ఉంటారని వారు అనుమానించలేదు. ఈ క్రమంలోనే కావమ్మను ఎవరో కామాం ధులు గర్భవతిని చేశారు. ఆ విషయం కూడా ఆమె తల్లిదండ్రులు గమనించలేకపోయారు. ఆమె ఎప్పటిలాగే ఊరు పట్టుకుని తిరిగేది. శుక్రవారం తాను అప్పుడప్పుడూ చిన్నచిన్న పనులు చేసే జయ డార్మిటరీకి వెళ్లింది. ఆ సమయంలో పురిటినొప్పులు రావడంతో పరిస్థితి విషమించి బాత్రూమ్లో ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డా తల్లినే అనుసరించి, కన్నుతెరవకుం డానే కన్నుమూసింది. కావమ్మ మృతిపై పోలీసు లు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఎప్పుడూ డార్మిట రీకి వచ్చే కావమ్మ పరిస్థితిని అక్కడివారు ప ట్టించుకుని, సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే తమ కుమార్తె ప్రాణం దక్కేదని గంగ,త్రిమూర్తులు రోదిస్తున్నారు. ఆమెను తల్లిని చేసిన ముష్కరుల్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఏదేమై నా.. ప్రభుత్వం మతిస్థిమితం లేని వారి ఆలనాపాలన బాధ్యత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పింఛన్ రాలేదని.. మతిస్థిమితం కోల్పోయాడు
జోగిపేట: పింఛన్ రాలేదన్న బెంగతో మెదక్ జిల్లా ఆందోలు మండలం చింతకుంటలో ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామానికి చెందిన నీరుడి దుర్గయ్య వికలాంగుడు. 2 నెలల కిందటి వరకు ప్రభుత్వమిచ్చే వికలాంగ పింఛన్ రూ.500 పొందేవాడు. తాజా పింఛన్ జాబితాలో దుర్గయ్య పేరు లేకపోవడంతో కలత చెంది మతిస్థిమితం కోల్పో యాడు. స్వారూప్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు బుధవారం దుర్గయ్యను హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానకసిక వికలాంగుల ఆస్పత్రిలో చేర్పించారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో ముగ్గురి మృతి పింఛన్ రాదేమోనన్న బెంగతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఏన్కతలకు చెందిన కౌడి కిష్టమ్మ(70), మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లికి చెందిన దూదేకుల లాల్‌బీ(71), కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెరందిన పొన్నాల గాలవ్వ (80) పింఛన్ రాలేదని మనస్తాపం చెంది మరణించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగాయపల్లితండాకు చెందిన బానోతు రవి (28) అప్పుల బాధతో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకర పొలంతో పాటు మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావంతో పంట దెబ్బతినింది. దీంతో బోర్ల కోసం చేసిన రూ.2 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించక తీవ్ర ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.