మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడికి యత్నం | young lady Insane sexual assault | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడికి యత్నం

Jul 13 2016 3:43 AM | Updated on Apr 8 2019 6:20 PM

మతిస్థిమితం లేని ఓ యువతిపై లైంగిక దాడికియత్నం జరిగిన సంఘటన మండలంలో మం గళవారం మధ్యాహ్నం జరిగింది.

మామిళ్లవారిగూడెం(అశ్వారావుపేట రూరల్): మతిస్థిమితం లేని ఓ యువతిపై లైంగిక దాడికియత్నం జరిగిన సంఘటన మండలంలో మం గళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మామిళ్లవారిగూడెంలో బంధువు ఇంటి వద్ద ఉంటు న్న  మతిస్థిమితం లేని ఓ యువతి(16) మధ్యాహ్నం సమయంలో సమీపంలోని చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లగా తిరుమలకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి యత్నించినట్లు ప్రచారం జరుగుతుంది.

మతిస్థిమితం లేని యువతి కావడంతో బంధువుల్లో ఒకరు అటువైపుగా వెళ్లడంతో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిసింది. దీనిపై కుటుంబ సభ్యులు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని గ్రామ పెద్దలకు సమాచారం అందించి వాహనాన్ని అప్పగించారు. కాగా లైంగిక దాడికి యత్నించిన యువకులపై గతంలో కుడా గిరిజన యువతిపై లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement