
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక
రాయగడ (ఒడిశా): మతిస్థిమితి లేని బాలికపై లైంగికదాడి జరిగిన సంఘటన జిల్లాలో సంచలనం రేకిత్తించింది. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలోని నతమ గ్రామంలో భగీరథి నచిక తన 13 ఏళ్ల దివ్యాంగ బాలికను ఎప్పటిలాగే ఇంటి దగ్గరే ఉంచి, కట్టెల కోసం భార్యతో కలిసి సమీపంలోని అడవికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసిన దుండగులు బాధిత బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం.
సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ వివస్త్రగా ఉండడం చూసి, మతిస్థిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..)
ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. కన్నీరుమున్నీరైన బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ని ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని, కోర్టుకు అప్పగిస్తామని ఐఐసీ అధికారి రస్మీరంజన్ ప్రధాన్ భరోసా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment