
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: మతిస్థిమితం లేని ఓ మహిళ చెట్టుఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ అందరికి ముచ్చెమటలు పట్టించిన ఘటన మంగళవారం నగరంలోని కాందారీ రోడ్‌లో చోటు చేసుకొంది. చెట్టు దిగమని స్థానికులు ఎంత చెప్పినా పట్టించుకోకపోగా.. దూకేస్తానని మహిళ బెదిరించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. చెట్టుకు నిచ్చెన వేసి అతి కష్టం మీద మహిళను కిందకు దించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చెట్టు ఎక్కే క్రమంలో సదరు మహిళకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, ఆమెకు మతిస్థిమితం లేనట్టు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment