
గంపలగూడెం(తిరువూరు): ఒకరిని చెట్టుకు కట్టేసి కొట్టడంతో మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాలు.. మండలంలోని పెనుగొలనుకు చెందిన బొల్లెపోగు నరసింహారావు(23)కు మతిస్థిమితం లేదు. రాత్రి సమయంలో మట్టగుంజ పిచ్చియ్య ఇంటివద్ద తిరుగుతున్నాడు.
ఎందుకు ఇక్కడ ఉన్నావని నరసింహారావును పిచ్చియ్య ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో పిచ్చియ్య, కృష్ణ మరికొందరు కలసి నరసింహారావును చెట్టుకు కట్టేశారు. దాడి చేశారు. తలకు, పొట్టమీద బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. ఈవిషయమై మృతుడి తల్లి అనసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నూజివీడు సీఐ రామ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.