కోతుల దాడి: గుండెపోటుతో వ్యక్తి మృతి | man dies due to heart attack ovar monkeys attack | Sakshi

కోతుల దాడి: గుండెపోటుతో వ్యక్తి మృతి

Published Sat, Jan 30 2016 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో కోతుల దాడితో భయపడిపోయిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు.

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో కోతుల దాడితో భయపడిపోయిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. రైల్వే మాజీ ఉద్యోగి అయిన అమీరుద్దీన్ ఖాజేపేటలో నివాసం ఉంటారు. రామగుండంలో ఓ వేడుకకు కుటుంబ సభ్యులతో కలసి హాజరైన ఆయన శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు.

రామగుండం రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫామ్‌కి వెళ్లేందుకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వెళ్తుండగా ఒక్కసారిగా కోతుల మంద దాడి చేసింది.  ఆయన చేతిలో అరటి పండు ఉండడంతో అమీరుద్దీన్‌పై దాడికి దిగాయి. భయంతో పరుగు పెడుతూ  గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలి పోయారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లే లోపలే ఆయన ప్రాణాలు వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement