
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment