ఉప్పల్, సాక్షి హైదరాబాద్: తన ఇల్లు కూల్చివేస్తారేమో అన్న దిగులుతో ఓ నిరుపేద గుండె ఆగింది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ కేటీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన స్కూల్ వ్యాన్ నడిపే తాటిపల్లి రవీందర్ (55)కి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరికీ వివాహాలు అయ్యాయి. రవీందర్ 75 గజాల స్థలంలో నిరి్మంచిన రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఇది మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వల్ల రవీందర్ నివాసముంటున్న ఇంటికి అవతలి పక్కన ఉన్న ఇంటికి అధికారులు మార్కు చేశారు. దీంతో రవీందర్‌కు తన ఇంటిని కూడా కూల్చి వేస్తారేమోనన్న బెంగ పట్టుకుంది.
అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఉన్న చిన్న ఇల్లు ఆధారం పోతే ఎలా బతికేదంటూ కుటుంబ సభ్యులతో ఆందోళన వ్యక్తం చేసేవాడు. నెల రోజుల క్రితం ఇదే ఆవేదనతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవీందర్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
హైడ్రాపై ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రంగనాథ్
మూసీ నది ఎఫ్‌ఐఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఫేక్ ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో హైడ్రాపై భయాందోళనలు సృష్టిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిచారు. మూసీ నదిలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టదనీ, నిబంధనల ప్రకారమే హైడ్రా కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment