
హైదరాబాద్: నగరంలో ఆక్రమణలపై ఇప్పటికే హైడ్రా కొరడా ఝుళిపిస్తూ వస్తోంది. ఆక్రమణలకు పాల్పడిన కట్టడాలని కూల్చివేసే ప్రక్రియను గత కొన్ని నెలల క్రితమే హైడ్రా ఆరంభించింది. అయితే హైడ్రా జేఏసీ పేరుతో పలువురు దందాలు చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు జేఏసీ ఏర్పాటు పేరుతో దందాలు చేస్తూ బిల్డింగ్ నిర్మాణదారుల నుంచి డబ్బులు పిండుకునే వ్యవహారానికి శ్రీకారం చుట్టారు.
ప్రధానంగా అమీన్ పూర్ పెద్ద చెరువులో దందాలు నిర్వహిస్తున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.