
క్లిష్టమైన టీఏవీఆర్ చికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్యులు
మొట్టమొదటిసారి TAVR ప్రక్రియను విజయవంతం చేసిన ఆలివ్ హాస్పిటల్
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ప్రాణాలకు కాపాడటంతో కాపాడటంతో అద్వితీయంగా కృషి చేస్తున్న ఆలివ్ హాస్పిటల్... గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకుంది. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనది కాగా, ట్రాన్సాకాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కృతిక్ కులకర్ణి, ఆలివ్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ సంయుక్తంగా నిర్వహించారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్ ఉన్న వృద్ధి రోగులకు TAVR ఒక ప్రాణాలను రక్షించే పరిష్కారం. ఇది సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీకి ఇదొక ఇన్వాసివ్ ప్రత్యామ్నాయం కాగా, అత్యంత ప్రమాదకర స్థాయిలో లేదా సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఈ చికిత్సను మాత్రమే అందిస్తారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్తో బాధపడుతున్న వృద్ధి రోగులకు ఇదొక సంజీవనీల పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఈ బృందానికి సారథ్యం వహించిన డాక్టర్ కృతిక్ కులకర్ణి తన బృంద సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ "తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఉన్న వృద్ధులకు ఈ ప్రక్రియ ఒక వరం. ఇది వారికి పునర్జీవం పోసేలా పనిచేస్తోంది. వేగంగా కోలుకోవడం, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. మా క్యాత్ ల్యాబ్ బృందం, OT టెక్నీషియన్లు, అనస్థీషియా బృందం, హాస్పిటల్ అడ్మిన్ సహకారంతో ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సునాయాసంగా విజయవంతం చేయగలిగాం. డాక్టర్ పాషా, డాక్టర్ బన్సాల్, డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ జియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అహ్మదాబాద్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కూడా ఈ ప్రక్రియలో మార్గదర్శకుడిగా హాజరై బృందానికి తన అమూల్యమైన సలహాలను అందించారు. ఆయనుకున్న విస్తృత అనుభవం విజయానికి తోడ్పడిందన్నారు.
olive రంగంలో ఈ విజయం మా ఆసుపత్రి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా యొక్క అంకితభావాన్ని చాటుకున్నాం. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... "ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ఈ అద్భుతమైన అద్భుతమైన ప్రయాణంలో మేము భాగస్వామ్యం కావడం మాకు దొరికి దొరికి అదృష్టం. ఆలివ్ ఆలివ్ హాస్పిటల్ వైద్య శాస్త్ర రంగంలో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో అందిస్తోంది. TAVR ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం ద్వారా హృదయ సంరక్షణకు ఒక కొత్త ప్రమాణం ఏర్పడింది. భవిష్యత్తులో ఆపత్కర పరిస్థితుల్లో రోగులకు TAVR ద్వారా పునర్జీవం పోసే అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన బాధ్యతల నిర్వహించిన తమకు రోగి కుటుంబ సభ్యుల సహకరించడం అభినందనీయం, వారికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది." అని అన్నారు.
ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది.
ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్. ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం" వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్ధులైన వెద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశులో ఆరోగ్య సంరక్షణ యొక్క నాణ్యమైన ప్రమాణమైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ నుండి గుర్తింపు పొందింది.