Cardiology
-
ఇకపై పరగడుపున కొలెస్ట్రాల్టెస్ట్ అక్కర్లేదు!
ఇప్పటివరకూ రక్తంలో కొలెస్ట్రాల్విలువలు తెలుసుకోడానికి రాత్రి భోజనం తర్వాత కనీసం 12 గంటలపాటు ఆగాక..ఉదయమే ఏదీ తినకుండా పరగడుపున ఈ పరీక్ష చేయించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఆంక్షలేమీ ఉండవని కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) పేర్కొంది. ‘లిపిడ్ ప్రొఫైల్’పరీక్ష ఇకపై పరగడుపున చేయించాల్సిన అవసరం లేదని సీఎస్ఐ తెలిపింది. రక్తంలో ఈ విలువలు నార్మల్‌గా లేకపోవడాన్ని ‘డిస్లిపిడేమియా’అని పేర్కొంటారు. ఇలా లేకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది. ఈ మేరకు సీఎస్ఐ తొలిసారిగా ‘డిస్లిపిడేమియా’కు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిజానికి ఇప్పటివరకూ మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్దేశించిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 22 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఇటీవలే అది డిస్లిపిడేమియా మార్గదర్శకాలనూ, మంచి, చెడు కొలె్రస్టాల్ల నార్మల్ తాలూకు కొత్త విలువలను వెల్లడించింది. ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆనరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ధూర్జటి ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ ఇకపై పరగడుపున మాత్రమే లిపిడ్ ప్రొఫైల్ అక్కర్లేదనే సూచన తొలగిపోవడం అందరికీ మంచి సౌలభ్యం కలిగించే అంశమన్నారు. దీంతో అనేకమంది ఎప్పుడంటే అప్పుడు ఈ పరీక్ష చేయించుకునే సౌకర్యం కలిగిందని చెప్పారు. ఈ మార్గదర్శకాల ప్రకారం..» లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష వీలైనంత త్వరగా (18 ఏళు దాటేనాటికే) చేయించుకోవాలి. అయితే కుటుంబంలో గుండెజబ్బులు, రక్తంలో కొలె్రస్టాల్ మోతాదులు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోని వారు (అంటే ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరాలేమియా హైరిస్క్ పేషెంట్స్) అంతకంటే ముందే ఈ పరీక్ష చేయించుకోవచ్చు. » ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ చెడు కొలె్రస్టాల్ మోతాదుల (ఎల్డీఎల్–సీ) నార్మల్ విలువ 100 ఎంజీ/డీఎల్. » ముప్పు ఎక్కువగా ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ హెచ్‌డీఎల్ కాకుండా మిగతా అన్ని కొలెస్ట్రాల్ల మోతాదుల (నాన్–హెచ్‌డీఎల్–సీ) నార్మల్ విలువ 130 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి. » డయాబెటిస్ / హైబీపీ వల్ల ముప్పు ఎక్కువగా (హైరిస్్క) ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్–సీ) విలువ 70 ఎంజీ/డీఎస్ కంటే తక్కువగా ఉండాలి. » ఈ నార్మల్ విలువల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎక్కువగా ఉన్నట్టయితే అది గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) లేదా గుండెజబ్బులు (పెరిఫెరల్ హార్ట్ డిసీజ్)లకు దారితీయవచ్చని తెలుసుకోవాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కొవ్వుల నార్మల్ విలువ 150 ఎంజీ/డీఎల్‌కు లోపున ఉండాలని గుర్తుంచుకోవాలి. » మరీ ఎక్కువ ముప్పు (వెరీ హై–రిస్్క) ఉన్న పేషెంట్స్... అంటే గుండెపోటు వచ్చి ఉన్నవారు, యాంజైనా అనే చాతీనొప్పి వచ్చినవారు, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు (సీకేడీ) ఉన్నవారిలో చెడు కొలె్రస్టాల్ (ఎల్డీఎల్) మోతాదులు 55 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగానూ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) కాకుండా మిగతాది (నాన్–హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ మోతాదులు 85 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.– సాక్షి హెల్త్‌డెస్క్ -
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్‌గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్‌లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్‌లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
CPR అవగాహన వీడియో
-
వైన్ తాగుతున్నారా.. అయితే ఇది చదవండి
చాలా తక్కువ మోతాదులో రెడ్‌వైన్ గుండెకు మేలు చేస్తుందని కొందరి దురభిప్రాయం. కానీ పరిమిత మోతాదులో వైన్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్)ను దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గ్లాసు వైన్ తీసుకునేవారిలో హార్ట్ రిథమ్ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే గుండె లయలో సమస్య వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఎప్పుడో ఒకసారి మద్యం తాగుతామని లేదా చాలా అరుదుగా తీసుకుంటామని చెబుతూ మద్యం తీసుకునే వారిలో గుండె లయకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడో ఒకసారి తాగుతామని చెప్పే 65 ఏళ్లు పైబడిన ప్రతి 100 లోనూ ఏడుగురు గుండె లయకు సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారనే ఆ అధ్యయన ఫలితాలను అమెరియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి సంబంధించిన ఒక జర్నల్‌లో ప్రచురించారు. -
గుండె లయ తప్పుతోంది
సాక్షి, హైదరాబాద్: శరీరానికి కనీస వ్యాయామం లేని ఉన్నత, మధ్య తరగతి ప్రజల్లోనే కాదు....రోజంతా కాయ కష్టం చేసే పేదల్లోనూ హృద్రోగ సమస్యలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరేళ్లలో ఆరోగ్యశ్రీలో జరిగిన చికిత్సలను పరిశీలిస్తే నిరుపేదల్లో హృద్రోగుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 19,442 మంది ఆరోగ్యశ్రీ పథకంలో గుండె చికిత్సలు చేయించుకున్నారు. 2019 నాటి కి ఈ సంఖ్య 75 వేలు దాటింది. వీటిలో సగానికిపైగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే నగదు చెల్లించి చికిత్స లు పొందిన వారే కాకుండా సీఎంఆర్ ఎఫ్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఈఎస్ఐ, ఆర్టీసీ, రైల్వే, ట్రాన్స్‌కో, జెన్కో వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు వీరికి అదనం. బాధితుల్లో 60 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో పెద్ద తేడా లేకపోవడమే ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత నగరంలో అనేక ఐటీ, అనుబంధ కంపెనీలు వెలిశాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కంపెనీలు ఆయా ఉద్యోగులకు టార్గెట్లు ఇస్తుండటంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇదే సమయంలో చేతిలో పుష్కలంగా డబ్బు ఉండటంతో వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మద్యం, మాంసాహారాలకు అలవాటుపడ్డారు. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రెడీమేడ్‌గా లభించే ఆహార పదార్థాలను, హానికరమైన శీతల పానియాలను ఎక్కువగా తీసుకుంటున్నారు .అంతేకాదు... పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఫలితంగా ఆహార వ్యవహారాల్లో పేద, ధనికులు అనే తేడా లేకుండా పోయింది. బస్తీల్లోనే కాదు పల్లేల్లోనూ ఫాస్ట్ç ఫుడ్ సెంటర్లు, బార్లు, వైన్ షాపులు వెలిశాయి. ఇక శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుక పోతోది. దీనికి తోడు చిన్న వయసులోనే అనేక మంది హైపర్ టెన్షన్, మధుమేహం వంటి రుగ్మతల భారినపడుతున్నారు.విటమిన్ల లోపం కూడా పరోక్షంగా గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఒకప్పుడు ఆరు పదుల వయసు దాటిన వారిలే కన్పించే ఈ గుండె జబ్బులు ప్రస్తుతం పాతికేళ్ల లోపు యువకుల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచుపదార్థ్దాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను మెరుగు పర్చుకోవడం ద్వారా విటమిన్ లోపాలను, ఇన్ఫెక్షన్లను అధిగమించొచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి పార్కులు, ఇతర అహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. – డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ సాయిసుధాకర్ ఆరోగ్య స్పృహ పెరిగింది ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం పేద, మధ్య తరగతి ప్రజల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లోనూ కార్డియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఛాతిలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే సమీపంలో ఉన్న కార్డియాలజీ సెంటర్లకు వెళ్లి ఈసీజీ పరీక్షలు చే యించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం హృద్రోగ చికిత్సలు ఎక్కువగా జరుగుతుండటానికి ఇది కూడా ఓ కారణం. – డాక్టర్ గోఖలే, కార్డియాలజిస్ట్ -
కరోనా కాలం గుండె భద్రం!
ఈ కరోనా సీజన్లో వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎవరైనా సీరియస్ కండిషన్లోకి వెళ్లారంటే... వైరస్ వారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలగజేయడం... దాంతో వారిని వెంటిలేటర్‌పై ఉంచాల్సి రావడం చాలా సాధారణమని మొదట్లో భావించేవారు. కానీ ఆ తర్వాత్తర్వాత పరిశోధనల్లో, పరిశీలనల్లో కొత్త విషయాలు తెలిశాయి. కేవలం ఊపిరితిత్తులే కాదు... గుండె కూడా అంతే స్థాయిలో ప్రభావితమవుతుందని స్పష్టమైంది. ఈ నెల 29న వరల్డ్ హార్ట్‌డే! ఈ సందర్భంగా అసలు కరోనా వల్ల గుండె ఎన్ని రకాలుగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందీ, అలా జరిగేందుకు కారణాలేమిటీ, వాటిని నివారించడం / అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. కరోనాతో పెరిగే ముప్పు – అందుకు కారణాలు మనలోకి కరోనా వైరస్ ప్రవేశించడానికి దోహదపడే అంశాల్లో ‘ఏసీఈ–2 రిసెప్టార్స్’ అన్నిటికంటే ముఖ్యమైనవి. సాధారణంగా మన శరీరంలో ఉన్నట్లే మన గుండెపై కూడా ఈ రిసెప్టార్స్ ఉంటాయి. సాధారణంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉన్నవారికి చికిత్సలో భాగంగా ఏసీఈ ఇన్హిబిటార్స్ అనే మందులు ఇస్తుంటారు. అలాగే యాంజియోటెన్సిన్ 2 రిసెప్టార్ బ్లాకర్స్ కూడా ఇస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఈ ఏసీఈ–2 రిసెప్టార్స్ ద్వారానే గుండె కండరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ అంశం ఆధారంగానే ఏసీఈ–2 రిపెప్టార్స్కూ, కరోనా ప్రవేశానికీ సంబంధముందని స్పష్టంగానే తెలుస్తుంది. గుండె కండరంపైన ‘ఏసీఈ–2 రిసెప్టార్స్’ సంఖ్య మరింత ఎక్కువ. కాబట్టి కరోనా గుండెను ప్రభావితం చేసే అవకాశాలు ఆటోమేటిగ్గా మరింత ఎక్కువవుతాయన్నమాట. ఇక డయాబెటిస్, హైబీపీ ఉన్నవారిలో ఇచ్చే మందుల వల్ల కరోనా ప్రవేశానికీ, తద్వారా గుండెకు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ యూరోపియన్ సొసైటీ ఫర్ కార్డియాలజీ, బ్రిటిష్ కార్డియాక్ సొసైటీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి సంస్థలన్నీ కరోనా సీజన్లో సైతం ఈ మందుల్ని యథావిధిగా తీసుకొమ్మనే సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకంటే... వాటిని తీసుకోవడం కంటే... కరోనా వైరస్ సోకుతుందేమో అనే ఆందోళనతో వాటిని మాన్పించడం వల్ల జరిగే అనర్థాల తీవ్రత చాలా ఎక్కువ. మరో కారణం ఏమిటంటే... పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులలో రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మన దక్షిణభారతీయుల్లో ఇవి మరింత సన్నగా ఉంటాయి. కరోనా వైరస్ కారణంగా రక్తనాళాల్లోని లోపలిపొర దెబ్బతింటుంది. అంతేకాదు... నాళాల్లో రక్తం గడ్డకట్టే (అంటే క్లాట్స్ ఏర్పడే) అవకాశాలూ పెరుగుతాయి. సాధారణంగా రక్తనాళాలు సన్నబారడం / దెబ్బతినడాన్ని వైద్యపరిభాషలో ‘అథెరో స్క్లిరోసిస్’ అంటారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఇలా జరగడం సాధారణం. కానీ కరోనా కారణంగా ఈ పరిణామం ఠక్కున సంభవించే అవకాశం ఉంది. ఇలా రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు రక్తపు గడ్డలు (క్లాట్స్) వల్ల గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా కరోనా సీజన్లో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ కారణంగానూ గుండెపోటు రావచ్చు. ఇలా రక్తనాళాల్లో క్లాట్స్ వచ్చే అవకాశాలు కేవలం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కరొనరీ ఆర్టరీలో మాత్రమే గాక... అన్ని ధమనుల్లోనూ ఉంటుంది. కాకపోతే మిగతాచోట్ల రక్తం గడ్డకట్టినా తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అత్యంత కీలకమైన గుండెకు అనునిత్యం రక్తం సాఫీగా అందకపోవడం వల్ల జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక్కడ గుండెకు నేరుగా కాకుండా పరోక్షంగా వచ్చే ముప్పు గురించి కూడా చెప్పుకోవాలి. కాళ్ల రక్తనాళాల్లో లేదా దేహంలోని మరెక్కడైనా రక్తనాళాల్లో రక్తపు క్లాట్స్ వచ్చి అవి గుండెకు చేరి, అక్కడ ఊపిరితిత్తులకు జరిగే రక్తసరఫరాకు అడ్డుపడితే... ‘పల్మునరీ ఎంబోలిజం’ అని పిలిచే ఈ పరిణామం వల్ల కూడా అకస్మాత్తుగా మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ. మన దేశవాసుల్లో వచ్చే ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ అంటారు. స్థూలకాయంతో బాధపడేవారిలో (అంటే బీఎమ్ఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో) కరోనాతో కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు దాదాపు 40 శాతం ఎక్కువగా ఉందని తేలింది. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇటీవలే బ్రిటిష్ పరిశోధకులు కనుగొన్నారు. మన దేహబరువు పెరుగుతున్న కొద్దీ ముప్పు కూడా అంతే ఎక్కువగా పెరుగుతోందని కూడా ఈ అధ్యయనంలో తేలింది. పొగతాగడం అన్నది అటు ఊపిరితిత్తులకూ, ఇటు అథెరోస్కి›్లరోసిస్ దోహదపడే అంశం. అందుకే పొగతాగే అలవాటు ఉన్న వారికి కరోనా సోకితే అటు ఊపిరితిత్తులను దెబ్బతీసే అవకాశం ఎంతగా ఉంటుందో... ఇటు గుండెకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశమూ అంతకు తక్కువేమీ కాదు. కరోనా కారణంగా ప్రభావితమయ్యే కీలకమైన రెండు అవయవాలైన ఊపిరితిత్తులూ, గుండెను పొగ కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే పొగతాగడం కూడా కరోనా విజృంభణకు దోహదపడి అటు లంగ్స్‌తో పాటు ఇటు గుండెకూ ముప్పును మరింత పెంచుతుంది. గుండెకు మరెన్ని రకాల సమస్యలో... కరోనా వైరస్ గుండెను ప్రభావితం చేసినప్పుడు కొందరిలో నేరుగా హార్ట్ ఎటాక్ యే రావచ్చు. కరోనా వైరస్ వల్ల గుండె కండరానికి ఇన్ఫెక్షన్, కండరంలో వాపు, నొప్పి (ఇన్ఫ్లమేషన్) రావచ్చు. దీన్ని మయోకార్డయిటిస్ అంటారు. ఈ కారణంగా గుండె పనితీరు దెబ్బతిని అది హార్ట్ ఫెయిల్యూర్‌కు సైతం దారితీయవచ్చు. కొందరిలో గుండె స్పందనలు లయ తప్పవచ్చు (అంటే రిథమ్ దెబ్బతిని ఇర్రెగ్యులర్గా కొట్టుకోవచ్చు). హాస్పిటల్స్‌కు వెళ్లనివ్వని కరోనా భయం... అంతకు ముందు క్రమం తప్పకుండా కనీసం ఏ రెండు నెలలకొకసారో, మూణ్ణల్లకొకమారో రక్తంలో తమ చక్కెర పాళ్లను తెలుసుకునే డయాబెటిస్ రోగులు సైతం ఈ కరోనా సీజన్లో హాస్పిటల్ దిక్కుకు వెళ్లడమే మానేశారు. గుండెజబ్బులు ఉన్నవారు సైతం ఆసుపత్రును అవాయిడ్ చేస్తున్నారు. కరోనా కారణంగా పైన పేర్కొన్న రక్తనాళాలు సన్నబారడం, రక్తంలో క్లాట్స్ రావడం వంటి ఆరోగ్యవంతుల్లోనే మామూలేతే... మరి డయాబెటిస్, హైబీపీ వంటి వారిలో ఎంత ప్రమాదమో ఎవరికి వారే ఊహించవచ్చు. దాంతో క్రమం తప్పకుండా హాజరుకావాల్సిన ఫాలో అప్స్కు వెల్లకపోవడం, వ్యాధి బాగా ముదిరాక మాత్రమే హాస్పిటల్స్‌కు వచ్చే కేసులు సైతం పెరిగిపోయాయి. దాంతో వాళ్లకు సకాలంలో అందాల్సిన చికిత్స అందకపోవడం వల్ల కూడా చాలా అనర్థాలు సంభవిస్తున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే ఎక్కువ అని చెప్పవచ్చు. అసలు గుండె జబ్బు ఎందుకొస్తుంది, ఎలా బయటపడుతుంది? కరోనరీ ధమనులు గుండెకు పోషకాలనూ, ఆక్సిజన్‌ను అందిస్తుంటాయి. సాధారణంగా ఏ కారణంగానైనా ఈ ధమనులు సన్నబడవచ్చు లేదా వాటిలో రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం కూడా జరగవచ్చు. మొదట్లో వయసుపెరగడం లాంటి ఏదైనా కారణంతో రక్తనాళాలు దెబ్బతినడం, సన్నబారడం జరిగితే... ఇప్పుడు కరోనా కూడా అలాంటి ప్రభావాన్నే చూపుతోందని అధ్యయనల్లో తేలింది. ఇలా రక్తనాళాలు సన్నబడినప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను యాంజినా పెక్టోరిస్ అంటారు. గుండెకు తగినంత రక్తసరఫరా జరగని సందర్భాల్లో గుండె కండరాలు క్రమంగా చచ్చుపడిపోవడం మొదలవుతుంది. ఈ కండిషన్‌నే హార్ట్ ఎటాక్ అనీ లేదా వైద్యపరిభాషలో అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ) అని అంటుంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ వివిధ రూపాల్లో ఉంటుంది. యాంజైనల్ చెస్ట్ పెయిన్ (కేవలం ఛాతీ నొప్పి) మొదలుకొని... తీవ్రమైన పరిస్థితిలో (వరస్ట్ కండిషన్లో) రోగిని కోల్పోయే పరిస్థితి వరకు ఏదైనా జరగవచ్చు. ముప్పునుంచి గుండెను తప్పించండిలా... ఇటీవల పెరిగిన అవగాహనలో మనలో చాలామంది పల్స్ ఆక్సిమీటర్‌ను కొని ఇంట్లో పెట్టుకుని తరచూ ఆక్సిజన్ పాళ్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఉపకరణంతో తమ రక్తంలో ఆక్సిజన్ పాళ్లు (ఆక్సీజన్ శాచ్యురేషన్) తగినంతగా ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మొదట విశ్రాంతిగా కూర్చుని ఒకసారి చెక్ చేసుకుని, ఆ తర్వాత మరో ఐదారు నిమిషాలు నడిచాక మరోమారు చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ శాచ్యురేషన్ 95 కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. కానీ అంతకంటే తక్కువగా ఉంటే తక్షణం ఆసుపత్రికి వెళ్లాల్సిందే. కొందరు చిన్న నొప్పిని కూడా భరించలేరు. కండరాల్లోనూ లేదా ఇతరత్రా ఏదైనా నొప్పి కనిపిస్తే తక్షణం నొప్పినివారణ మాత్ర వేసుకుంటూ ఉంటారు. వీలైనంతవరకు పెయిన్‌కిల్లర్ వేసుకోకపోవడమే మంచిది. ఇక ఐబూప్రొఫెన్ లాంటి మందులైతే అస్సలు వద్దు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఎలాంటి హానీ చేయని నొప్పినివారణ మందును డాక్టర్ సలహా మేరకే పరిమితమైన సమయం కోసం మాత్రమే వాడాలి. ఒకసారి ఈసీజీ తీయించుకోండి. దాంట్లో ఏదైనా తేడా ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించండి. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు తాము వాడే అన్ని రకాల మందుల్ని ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఎప్పుడూ గ్యాప్ రానివ్వకుండా అందుబాటులో ఉంచుకోవాలి. మామూలు డయాబెటిస్, హైబీపీ ఉన్నవారే ఇంత జాగ్రత్తగా ఉంటే ఇప్పటికే గుండెజబ్బులున్నవారూ, స్టెంట్ వేయించుకుని మందులు వాడే వారు, హార్ట్సర్జరీ (సీఏబీజీ) చేయించుకున్నవారు తమ మందుల్ని క్రమం తప్పక వాడాల్సిందే అన్న విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కరోనాతో రక్తంలో క్లాట్స్ వచ్చే ప్రమాదం ఉన్నందున... గుండెజబ్బులున్నవారు వాడే రక్తాన్ని పలచబార్చే మందులు వారికి మరింత ప్రయోజనకారి అన్న విషయాన్ని గుర్తించి, ఆ మందులతో బాటు... ఇతర ఏ మందులనూ ఆపకూడదు. మందుల పట్ల నిర్లక్ష్యం ఎంత మాత్రమూ తగదు. కొద్దిపాటి ఆయాసం వచ్చేవారు కోవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాటు ఛాతీ సీటీస్కాన్ తీయించుకుని, డాక్టర్‌కు చూపించి దాన్ని దగ్గర ఉంచుకోవడం మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతం గా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం, ఒత్తిడికి గురికావడం అన్నది రక్తనాళాల్లో రక్తాన్ని వేగంగా దౌడు తీయిస్తుంది. అది గుండెపై ఒత్తిడిని పెంచి, దాని స్పందనలను వేగవంతం చేస్తుందన్నది మనకు తెలిసిందే. మనం ప్రశాంతంగా ఉంటే గుండె కూడా ఆటోమేటిగ్గా ప్రశాంతంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కరోనాతో గుండెకు జరిగే నష్టమేమిటి? కరోనా వైరస్ మన గుండెకు చేరాక అది గుండె కండరాన్ని బాగా బలహీన పరుస్తుంది. ఫలితంగా గుండె కండరం తీవ్రంగా దెబ్బతింటుంది. మొదట్లో ఎలాంటి గుండెజబ్బులూ లేదా గుండెకు సంబంధించిన సమస్యలూ లేనివారిలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక అదివరకే గుండెజబ్బులు ఉన్నవారిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టంగా మనకే అర్థమవుతుంది. ఇక గతంలో గుండెపోటు వచ్చి ఉన్న వారి పరిస్థితి మరింత విషమించేందుకు అవకాశాలు ఎక్కువ. -డాక్టర్ అనిల్‌కృష్ణ గుండాల సీనియర్ కార్డియాలజిస్ట్ -
అసమతుల్య ఆహారంతో గుండె జబ్బులు
సాక్షి, హైదరాబాద్: అతి పిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడటానికి అసమతుల్య ఆహారం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణమని పలువురు హృద్రోగ వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో రెండ్రోజులపాటు జరగనున్న ‘అడ్వాన్డ్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, యశోద హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, డైరెక్టర్ డాక్టర్ పవన్‌గోరుకంటి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరద రాజశేఖర్, డాక్టర్ లలిత సహా పలువురు వైద్యనిపుణులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పోషకాహార లోపంతో గుండె జబ్బుల బారిన పడుతుంటే.. పట్టణాల్లో మారిన జీవశైలికితోడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ జబ్బుల బారిన పడుతున్నట్లు తెలిపారు. 1990లో గుండె జబ్బుల మరణాలు 15% ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 28 శాతానికి పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఆర్థికంగా ఉన్నవారు శారీరక అవసరానికి మించి ఏది పడితే అది తింటూ పొట్ట చుట్టూ భారీగా కొవ్వును పోగేసుకుంటున్నారు. దీంతో బరువు పెరిగిపోతున్నారు. ఇది చిన్న వయసులోనే గుండె జబ్బులకు కారణమవుతోంది. పిజ్జాలు, బర్గర్లతో కడుపునింపుతున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతుంది. మిత ఆహారం తీసుకోవడం, ఆహారంలో పండ్లు, కాయగూరలు, నట్స్ ఎక్కువ తీసుకోవడంతో పాటు వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేయడం ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’’అని డాక్టర్ హేమలత తెలిపారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం వల్ల గుండె జబ్బులు పెరిగాయని, విదేశీయుల్లో 60 ఏళ్లకు ఈ జబ్బులు వెలుగు చూస్తుంటే, మన దగ్గర 35 ఏళ్లకే వెలుగు చూస్తున్నాయని డాక్టర్ రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో అత్యాధునిక వైద్యసేవలులతోపాటుగా నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు విదేశాలతో పోలిస్తే ఇక్కడ వైద్య ఖర్చు కూడా చాలా తక్కువని, ప్రస్తుతం 30 దేశాల రోగులు చికిత్సల కోసం నగరానికి వస్తున్నారని తెలిపారు. ఒకవైపు రోగులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. మరోవైపు ఆస్పత్రి సేవలను విస్తరిస్తున్నామని, దీనిలో భాగంగా గచ్చిబౌలిలో 2020 డిసెంబర్ నాటికి అత్యాధునిక ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తున్నామని డాక్టర్ జీఎస్‌రావు తెలిపారు. త్వరలోనే అత్యాధునిక హంగులు, నిపుణులతో ప్రత్యేక గుండె మార్పిడి చికిత్సల విభాగాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. -
పేస్‌మేకర్ ఎందుకు పెడతారు?
మా నాన్నగారి వయసు 59 ఏళ్లు. గతేడాది రిటైర్ అయ్యారు. ఇన్నేళ్లూ ఉద్యోగనిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ చాలా క్రమశిక్షణతో ప్రతిరోజూ నడవడం, వ్యాయామం వంటివి చేస్తూ ఉత్సాహంగా పనిచేశారు. కానీ ఆర్నెల్లుగా తరచూ అలసట, ఆయాసం వస్తుండటంతో డాక్టర్‌ను సంప్రదించాం. పరీక్షల్లో గుండె స్పందనలు తగ్గుతున్నట్లు రిపోర్టు వచ్చింది. సిటీకి తీసుకెళ్లి పేస్‌మేకర్ అమర్చడమే శాశ్వత పరిష్కారమని డాక్టర్ చెప్పారు. పేస్‌మేకర్ అంటే ఏమిటి? దాని గురించి వివరంగా చెప్పండి. గుండె తగినంత వేగంగా కొట్టుకునేందుకు వీలు కల్పిస్తూ ఉండే పరికరమే పేస్‌మేకర్. దీన్ని రోగి శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. గుండె స్పందనల్లో విపరీతంగా తేడాలు ఉన్నప్పుడు వాటిని అదుపు చేయడానికి దీనిని వాడతారు. గుండెవ్యాధుల కారణంగా సమస్యలెదుర్కొంటున్నవారికి ఇది కొత్తజీవితాన్ని అందిస్తుంది. మన గుండె పూర్తిగా కండరాలతో నిర్మితమైన అవయవం. అది నిరంతరాయంగా స్పందిస్తూ ఉండాలి. అయితే కొన్ని రకాల వ్యాధుల కారణంగా గుండె దెబ్బతిన్నప్పుడు గుండెస్పందనల్లో తేడాలు వచ్చి గుండె కొట్టుకునే వేగం తగ్గితే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పేస్‌మేకర్ ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకు అవసరం? విశ్రాంతి లేకుండా శరీరభాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేసే గుండె కుడి, ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలో ఉన్న గదులను ఏట్రియా అనీ, కింద ఉన్న గదులను వెంట్రికిల్స్ అని అంటారు. శరీర భాగాల నుంచి గుండెకు వచ్చిన రక్తం గుండె కుడి ఏట్రియంలోకి చేరుతుంది. తర్వాత దానికిందనే ఉన్న కుడి వెంట్రికిల్లోకి వస్తుంది. అక్కడి నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. శ్వాసకోశాలలో ఆ రక్తం ఆక్సిజన్‌తో శుద్ధి అవుతుంది. ఇప్పుడు శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియంలోకి వెళ్తుంది. అక్కడినుంచి ఎడమ వెంట్రికిల్లోకి చేరుకొంటుంది. ఎడమ వెంట్రికిల్ శుద్ధరక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగేందుకుగాను గుండె సంకోచవ్యాకోచాలు చోటు చేసుకోవాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ విద్యుత్ ప్రేరణ కుడి ఏట్రియంలోని ‘సైనస్నోడ్’ దగ్గర మొదలవుతుంది. దాంతో ఏట్రియా సంకోచించి రక్తాన్ని వెంట్రికిల్స్లోకి పంప్ చేస్తాయి. ‘సైనస్ నోడ్’ నుంచి విద్యుత్ తరంగాలు... ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికిల్స్కు ప్రవహించి అవి సంకోచించేట్లు చేస్తుంది. దాంతో వాటిలోని రక్తం ముందుకు పంప్ అవుతుంటుంది. ఈ విధంగా విద్యుత్ తరంగాల చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ ప్రవాహంలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పందనల్లో లోటుపాట్లకు కారణమవుతుంది. ఇలా గుండె స్పందనల్లో మార్పులు వస్తే దాన్ని అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలన్నవి సైనస్ నోడ్, ఏవీ నోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండెపోటు, గుండెకవాటాల సమస్యల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. గుండెస్పందన సాధారణంగా ఉన్నప్పుడు శరీర భాగాలన్నింటికీ రక్తం సజావుగా సరఫరా అవుతూ ఉంటుంది. కానీ అది అతివేగంగా గానీ లేదా చాలా నెమ్మదిగా గానీ కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీంతో మైకం కమ్మినట్లుగా ఉండటం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం కనిపిస్తాయి. ఇందుకు కారణమయ్యే అరిథ్మియాలకు సాధారణంగా మందులతోనే చికిత్స చేస్తారు. అయితే మందులకు లొంగకుండా గుండె స్పందనలు భారీగా తగ్గిన కేసుల్లో పేస్‌మేకర్‌ను సిఫార్సు చేస్తారు. పేస్ మేకర్ అంటే? ఇదొక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అరిథ్మియా వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇమిడిపోయి, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లోలాగే గుండె స్పందనలు ఉండేలా నియంత్రిస్తుంటుంది. బ్యాటరీపై ఆధారపడి పనిచేసే ఈ చిన్న పరికరం గుండెకు కావాల్సిన విద్యుత్ ప్రేరణలను ఇస్తుంటుంది. దాంతో గుండె తగినన్ని సార్లు కొట్టుకుంటుంది. పేస్‌మేకర్‌లో పల్స్ జనరేటర్, ఇన్సులేటెడ్ లెడ్స్ అనే రెండు భాగాలు ఉంటాయి. వీటిలో పల్స్ జనరేటర్ ఓ చిన్న లోహపు డబ్బాలా ఉంటుంది. దీనిలో అతి చిన్న ఎలక్ట్రానిక్ చిప్; దాదాపు 5 – 7 ఏళ్ల పాటు పనిచేయగల బ్యాటరీ ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఓ చిన్న కంప్యూటర్‌లా పనిచేస్తాయి. ఇది గుండె స్పందన వేగాన్ని గమనించి తగినన్ని సార్లు కొట్టుకునేందుకు అవసరమైన విద్యుత్ ప్రేరణలను పంపిస్తుంది. లెడ్స్ అనే కొన్ని సన్నని కేబుల్స్ పల్స్ జనరేటర్ నుంచి బయలుదేరి గుండెలోని కండరాల వరకు ప్రయాణిస్తాయి. ఇవి గుండె ఎంత వేగంగా స్పందిస్తుందో పల్స్మేకర్కు తెలియజేస్తాయి. దానికి అనుగుణంగా పల్స్ జనరేటర్ నుంచి అవసరమైనన్ని విద్యుత్ ప్రేరణలను గుండె కండరాలకు చేరవేస్తాయి. కొన్ని ముందస్తు పరీక్షలు అవసరం... పేస్‌మేకర్ అమర్చడానికి ముందుగా పేషెంట్‌కు కొన్ని పరీక్షలు చేయించాలి. పేస్‌మేకర్ అమర్చడానికి రోగి అనుకూలుడా, కాదా అని నిర్ధారణ చేసుకునేందుకు డాక్టర్లు ఈ పరీక్షలను సిఫార్సు చేస్తారు. అందులో భాగంగా ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె కండరాల మందాన్ని గుర్తించాలి. శరీరంపై కొన్ని సెన్సర్లను అమర్చడం ద్వారా గుండె నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను గమనించే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష, వ్యాయామం చేసేటప్పుడు గుండె కొట్టుకోవడంలో మార్పులను గుర్తించే స్ట్రెస్ టెస్ట్ వంటి పరీక్షలు చేశాక... ఆ వ్యక్తి పేస్‌మేకర్ అమర్చడానికి అర్హుడా, కాదా నిర్ధారణ చేస్తారు. పేస్‌మేకర్ అమర్చడానికి అనుకూలుడైన వ్యక్తికి అది అమర్చడానికి ముందురోజు రాత్రి తర్వాత ఘన, ద్రవ ఆహారాలు ఏమీ తీసుకోవద్దని చెబుతారు. అయితే డాక్టర్లు సిఫార్సు చేసిన మందులను మాత్రం వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న శస్త్రవైద్య ప్రక్రియ ద్వారా ఛాతీ కుడిభాగానో లేదా ఎడమ భాగానో కాలర్బోన్కి దిగువన 2 – 3 అంగుళాల కింద గాటుపెట్టి అక్కడ దీన్ని అమర్చుతారు. పేస్‌మేకర్ అమర్చుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేస్‌మేకర్ అమర్చుకున్నవారు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి ఏడాదీ రెండుసార్లు డాక్టర్‌ను కలిసి, దాని పనితీరు రోగి అవసరాలకు తగ్గట్లుగా ఉందో లేదో అని తెలుసుకోవాలి. డాక్టర్ తన దగ్గర ఉన్న కంప్యూటర్ మౌస్ లాంటి చిన్న పరికరం సహాయంతో రేడియో సిగ్నల్స్ ద్వారా పేస్‌మేకర్ సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించి, అవసరమైన మార్పులు (ట్యూనింగ్) చేస్తారు. పేస్‌మేకర్ ఉన్న వ్యక్తి క్రమం తప్పకుండా తన నాడి (పల్స్)ని పరిశీలించుకుంటూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఉన్నా లేదా అతివేగంగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను కలవాలి. మైకం కమ్మినట్లు అనిపించినా, ఛాతీలో నొప్పిలేదా శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. పేస్‌మేకర్‌లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆ లక్షణాలు సూచిస్తుండవచ్చు. డా‘‘ వరదరాజశేఖర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ – ఎలక్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కార్డియాలజీ విభాగానికి చేయూత నందిస్తాం
–అమెరికా కార్డియాలజీ వైద్యులు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి అవసరమైన ఆర్థిక, జ్ఞానాన్ని అందించేందుకు తమ వంతు సాయం చేస్తామని అమెరికాకు చెందిన కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రీని గంగసాని(అట్లాంట), డాక్టర్ మహేష్ ములుముడి(సియాటిల్) చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కార్డియో సీఎంఈ కార్యక్రమం నిర్వహించారు. హార్ట్ ఫెయిల్యూర్ అప్డేట్ 2017 అనే అంశం గురించి డాక్టర్ శ్రీని గంగసాని, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో నూతన పద్ధతుల గురించి డాక్టర్ మహేష్ ములుముడి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు చదువు చెప్పిన ఈ కళాశాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. తమకున్న జ్ఞానాన్ని ఇక్కడి విద్యార్థులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి మాట్లాడుతూ బయట నిర్వహించే సీఎంఈలు సైతం కళాశాలలో నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం డాక్టర్ శ్రీని గంగసాని కార్డియాలజీ విభాగానికి పలు స్టెంట్లను విరాళంగా అందజేశారు. అమెరికా వైద్యులకు జ్ఞాపికలు ఇచ్చి ఆసుపత్రి అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కార్డియాలజీ విభాగానికి మహర్దశ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి మహర్దశ వచ్చింది. ఈ విభాగానికి ఇటీవల రెండు డీఎం కార్డియాలజీ సీట్లు మంజూరైన విషయం విదితమే. ఈ సీట్లలో బుధవారం డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ రాజ్‌కుమార్ చేరారు. వీరితో పాటు రెండు రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో డీఎం కార్డియాలజీ కోర్సు పూర్తి చేసి సీనియర్ రెసిడెంట్‌గా డాక్టర్ శ్రీకాంత్ వచ్చారు. ప్రస్తుతం ఈ విభాగంలో హెచ్ఓడీ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అలి సేవలందిస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు పీజీలు, ఒక సీనియర్ రెసిడెంట్ రాకతో ఈ విభాగంలో వైద్యసేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా బుధవారం కార్డియాలజీ విభాగంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎం సీట్లు వచ్చేందుకు కషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్‌తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇకపై ఈ విభాగంలో సేవలు మరింత విస్తత పరుస్తామన్నారు. రోగులు, పరికరాలు ఉన్నాయని, ఉన్నతమైన సేవలందించేందుకు ఇదే మంచి అవకాశమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి కంటే మిన్నగా ఇక్కడ వైద్యసేవలు అందించేందుకు కషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఎండోక్రై నాలజిస్టు డాక్టర్ పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గుండెకు ఏ స్టంట్ అయినా ఒకటే..
సాక్షి,హైదరాబాద్:మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచేందుకు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ, సాధారణ యాంజియోప్లాస్టీలో స్టంట్లను వాడటం సహజమని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందిస్తున్న స్టంట్లకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టంట్లకు జీవిత కాలం విషయంలో తేడాలేదని, ఖరీదైన స్టంట్ వేసుకున్నంత మాత్రన రోగి జీవితకాలం పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ స్పష్టం చేసింది. తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 18–24 వరకు‘ఎటాక్ ది హార్ట్ ఎటాక్ వీక్’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను శుక్రవారం మెర్క్యరీ హోటల్లో చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ జె.శివకుమార్, కార్యదర్శి డాక్టర్ నరసరాజు, సీతారామ్, శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ రోగి జీవితకాలం పెంపు, నాణ్యమైన జీవితం రోగి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, అతను వేసుకున్న స్టంట్‌పై కాదన్నారు. చికిత్స సమయంలో స్టంట్ల ఎంపిక పూర్తిగా రోగి ఇష్టంపైనే ఆధారపడి ఉండాలని, ఈ విషయంలో రోగులను బలవంతం చేయకూడదని వారు పేర్కొన్నారు. తీవ్రమైన గుండె పోటుతో బాధపడుతున్న బాధితుల్లో కేవలం 23 శాతం మందికే ప్రైమరీ కరోనరీ యాంజియోప్లాస్టీ(60 నిమిషాల్లో మూసుకుపోయిన గుండె రక్తనాళాన్ని తెరిపించడం) చికిత్సలు అందుతున్నాయన్నారు. అవగాహన రాహిత్యం, మౌలిక సదుపాయాల లేమి కారణంగా మరో 73 శాతం మంది సాధారణ యాంజియోప్లాస్టీతో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. చికిత్సలో జాప్యంతో గుండె కండరాలు మరింత దెబ్బతింటున్నాయని, ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లడానికి పట్టణాల్లో నాలుగు నుంచి ఆరుగంటలు పడుతుండగా,గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు తేలిందన్నారు. కేవలం 73 మందికే ఆ చికిత్సః సర్వేలో భాగంగా 296 మంది బాధితుల నుంచి వివరాలు సేకరించగా, 73 మందికి మాత్రమే ప్రైమరీయాంజియోప్లాస్టీ చికిత్సలు అందినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 18 శాతం, జిల్లాల్లో 8 శాతం మందికి మాత్రమే ఈ సేవలు అందాయని వారు వివరించారు. తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్న బాధితులకు మందులు, ఇంజక్షన్ల కంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చికిత్సే ఉత్తమమని,తద్వారా రోగి జీవితకాలాన్ని పెంచడంతో పాటు నాణ్యమైన జీవితాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. -
కార్డియాలజి విభాగ పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజి విభాగాన్ని శనివారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల బృందం పరిశీలించింది. ఇటీవలే ఈ విభాగానికి రెండు డీఎం సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇక్కడి వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు డాక్టర్ శ్రీనివాసులు(గుంటూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల), డాక్టర్ సుబ్బారెడ్డి(ఉస్మానియా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ వీరికి పూర్తి వివరాలు అందించారు. -
గుండె లయలో మార్పులను సరిచేయవచ్చు!
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. ఒక్కోసారి నా గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకున్నట్లు అనిపిస్తోంది. అది ఫాస్ట్‌గా దడదడలాడటం నాకు తెలుస్తోంది. ఆ సమయంలో నాకు కళ్లు తిరిగినట్లుగా ఉంటుంది. విపరీతమైన ఆయాసం, నీరసం ఫీలవుతుంటాను. నాకుహైబీపీకూడా ఉంది. అది డౌన్ అవ్వడం వల్ల ఇలా జరుగుతోందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సత్యనారాయణ, వైజాగ్ మన శరీరంలో నిర్విరామంగా గుండె కొట్టుకోడానికి ఎలక్ట్రికల్ వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది. ఇందులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే గుండెదడలో కూడా మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా గుండె 70-80 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా అసాధారణంగా గుండెదడ పెరిగినా లేక తగినా దానిని ప్రమాదంగా పరిగణించాలి. తగిన చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు. గుండె నిమిషానికి 100 కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటే దానిని ‘ట్యాకి కార్డియా’ అంటారు. గుండె నిమిషానికి 60 సార్ల కంటే తక్కువ సార్లు కొట్టుకుంటే దానికి ‘బ్రాడీ కార్డియా’ అని పేర్కొంటారు. గుండెదడలో మార్పులను ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ (ఈపీ స్టడీ) పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. మీ విషయానికి వస్తే మీ గుండె స్పీడుగా కొట్టుకోవడం, కళ్లు తిరగడం, ఆయాసం, నీరసం రావడం లాంటివి చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఇవి ‘ట్యాకీకార్డియా’ లక్షణాలను సూచిస్తున్నాయి. కాబట్టి బీపీ డౌన్ అవ్వడం వల్ల మీకు అలా జరిగి ఉండదు. మీరు వెంటనే మంచి నిష్ణాతులైన వైద్యులను సంప్రదిస్తే వారు అన్ని పరీక్షలూ నిర్వహించి, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో నిర్ధారణ చేస్తారు. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఒకవేళ మీరు ట్యాకీకార్డియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేస్తే మీలో గుండెదడ పెరగడానికి కారణమైన అవాంఛిత ఎలక్ట్రికల్ సర్క్యుట్లను తొలగించి క్రమబద్ధీకరిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి అనవసరం భయాలూ పెట్టుకోకుండా వెంటనే మంచి డాక్టర్‌ను కలిసి, మీ సమస్యకు తగిన చికిత్స పొందండి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే మీ సమస్యకు తగిన చికిత్సను తీసుకొని, ఆనందంగా ఉండండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని అయన చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే అవి కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఇటీవలే తెలిసింది. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీదేవి, కొత్తగూడెం ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్‌ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు ఒకసారి మళ్లీ మీ డాక్టర్ గారిని సంప్రదించండి. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 సంవత్సరాలు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా విపరీతమైన తలనొప్పి, తలలో ఒకవైపు మొదలై కంటి వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. డాక్టర్‌కి చూపిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతున్నంతకాలం బాగానే ఉంటుంది. వాడటం మానేస్తే నొప్పి మళ్లీ మామూలే. ఈ నొప్పి వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - ఎస్. పవన్ కుమార్, తెనాలి మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మైగ్రేన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అంటే చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం, ఏదో ఒకవైపు తలనొప్పి రావడం సాధారణంగా చూస్తుంటాం. ఇది మెడవెనక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. పార్శ్వపు నొప్పికి కారణాల గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపునొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తేలింది. కారణాలు: శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ సమయం ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో, స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు, అతి వెలుగు, గట్టిశబ్దాలు, ఘాటైన వాసనలు, పొగతాగడం లేదా పొగతాగేవారు ఇంట్లో ఉండటం, మద్యం సేవించ డం లేదా ఇంతర మత్తుపదార్థాలు తీసుకోవడం వంటి అంశాలన్నీ మైగ్రేన్‌కి కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం, కొన్ని రకాల తినుబండారాలు ఎక్కువగా ఇష్టపడటం, వెలుతురు, శబ్దాన్ని తట్టుకోలేక పోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించడం జరగవచ్చు. వీటినే ఆరా అంటారు. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు ఎక్కువగా నొప్పి ఉండటం, నొప్పి నాలుగు గంటల నుంచి 72 గంటల వరకు ఉండొచ్చు. కడుపులో వికారం లేదా వాంతులు అవడం జరుగుతాయి. పార్శ్వపునొప్పి వచ్చిన తర్వాత కనిపించే లక్షణాలు: చికాకు, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం. హోమియోకేర్ చికిత్స: హోమియోలోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం అందించవచ్చు. మీరు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో మందులు తీసుకోండి. మీకు మైగ్రేన్ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది. -
ఇక ‘సూపర్’ సేవలు
ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (రిమ్స్) ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకం కింద రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకం కింద రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మనరాష్ట్రంలో వరంగల్ కాకతీయ వైద్య కళాశాల, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు విస్తరించడం, ఆధునిక వైద్య సేవలు, నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎనిమిదేళ్లుగా సరైన వైద్య సేవలు లేక కొట్టుమిట్టాడుతున్న రిమ్స్‌లో ఇక మంచి వైద్య సేవలందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రూ.150 కోట్ల నిధులతో.. పీఎంఎస్ఎస్వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చుతాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం, రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం కేటాయించనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం క్యాన్సర్ సహా ఎనిమిది కీలక వైద్య సేవలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తారు. క్యాన్సర్, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడీయాట్రిక్ సర్జరీ సంబంధిత వ్యాధులకు అధునాతన వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితోపాటు ఎంఆర్ఐ యూనిట్, ఆర్థోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రిమ్స్‌ను పీఎంఎస్ఎస్వై పథకం కింద ఎంపిక చేయడంతో.. రిమ్స్ సామర్థ్యం వెయ్యి పడకలకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు. పీజీ తరగతులకు అవకాశం.. ప్రస్తుతం రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. గతేడాది ఓ బ్యాచ్ చదువు ముగించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. రిమ్స్‌లో పీజీ తరగతుల అనుమతి లేకపోవడంతో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు ఇక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి పీజీ కోసం ఇతర ప్రాంతాలకు పోతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే పీజీ తరగతులకు కూడా అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదు. గ్రామీణ నిరుపేదకు సైతం కార్పొరేట్ వైద్యం అందుతుంది. వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి.. - డాక్టర్ హేమంత్‌రావు, రిమ్స్ డెరైక్టర్ రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు కావడంతో ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం చాలా విభాగాల్లో స్పెషాలిస్టు వైద్యులు లేరు. ఈ నిధులతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలతోపాటు, స్పెషలిస్టు వైద్య నిపుణులు వస్తారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు రిమ్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రి భవనాల కోసం కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది. జిల్లా ప్రజలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయి. -
కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగిస్తే వైద్యరంగంలో పెను మార్పులు
షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ కంచికచర్ల : కమ్యూనికేషన్ టెక్నాలజీని వైద్య రంగంలో కూడా ఉపయోగించుకోవచ్చని, ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చని శ్రీహరికోటలోని షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ స్కోప్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషన్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాటిలైట్ రంగంలో కమ్యూనికేషన్ విభాగంలో వచ్చిన మార్పులను వివరించారు. వివిధ బ్యాండ్లను ఏయే శాటిలైట్స్‌ను లాంచ్ చేయటానికి వినియోగిస్తారనే వివరాలు వెల్లడించారు. తొలిసారిగా ఎక్స్టెండెడ్, సీ బ్యాండ్లను వినియోగించింది భారతదేశమేనని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ విభాగానికి వె చ్చిస్తున్న డబ్బును స్లైడ్స్ ద్వారా చూపించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు భవిషత్ తరాలకు అందించే విధంగా అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేబీకే రావు, వైస్ చైర్మన్ నిమ్మగడ్డ శ్రీనివాసరావు, డెరైక్టర్ ఎన్.కృష్ణ, సీఈవో పాండురంగారావు, సీఈసీ హెచ్‌వోడి ప్రొఫెసర్ గురవారెడ్డి, ప్రొఫెసర్ ఆకుల వెంకటనరేష్బాబు, వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
పేద గుండె పగిలింది..
=కేజీహెచ్ కార్డియాలజీలో నిలిచిన ఆపరేషన్లు =వారం రోజులుగా మూతపడ్డ క్యాథ్‌ల్యాబ్ =ఏడాదిన్నరగా మూతపడ్డ కార్డియో థొరాసిక్ విభాగం =కాసుల కక్కుర్తిలో అధికారులు.. ప్రయివేటు ఆస్పత్రులకు పండగ విశాఖపట్నం-మెడికల్,న్యూస్‌లైన్: పెద్దాసుపత్రి (కేజీహెచ్)కి హార్ట్ ఫెయిలయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో గుండె జబ్బుల విభాగంలోని క్యాథ్‌ల్యాబ్ వారం రోజులుగా మూలకుచేరింది. ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగే కార్డియో థొరాసిక్ విభాగం ఏడాదిన్నర క్రితమే మూతపడింది. దీంతో ఓపెన్ హార్టు సర్జరీల సమయంలో గుండెకు కృత్రిమంగా రక్తాన్ని పంప్చేసే హీమోథెర్మ్ యంత్రం మరమ్మతులకు లోనైంది. ఫలితంగా ప్రస్తుతం ఎటువంటి గుండె జబ్బులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు అందుబాటులో లేకుండా పోయాయి. యాంజీయోగ్రామ్, యాంజీయోప్లాస్టీ వంటి కీలక హద్రోగ చికిత్స ప్రక్రియలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో రోగులు గత్యంతరం లేక అప్పులు చేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఓపెన్ హార్టు సర్జరీలు చేయడంలో కీలకపాత్ర పోషించే పెర్ప్యూజినిస్టు పోస్టు పదేళ్లుగా ఖాళీగాఉంది. ఆరోగ్య శ్రీ ప్రారంభమైన 2008 నుంచి 2011 వరకూ కాంట్రాక్టు పద్దతిలో కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పెర్ప్యూజినిస్టుని తీసుకువచ్చి ఆసమయంలో ఆరోగ్యశ్రీ కింద 150కి పైగా ఓపెన్హార్టు శస్త్రచికిత్సలు ఇక్కడ నిర్వహించారు. అప్పటినుంచి పెర్ప్యూజినిస్టును శాశ్వత ప్రాతిపదికన గాని కాంట్రాక్టు పద్దతినగాని నియమించి మరమ్మతుకుగురైన హీమోథెర్మ్ యంత్రాన్ని బాగుచేయించాలని అనేకపర్యాయాలు ఆస్పత్రి అధికారులను ఓపెన్ హార్టు సర్జరీ వైద్యులు విన్నవిస్తున్నా అడుగడుగునా సహాయనిరాకరనే ఎదురవుతుందని వైద్యులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో టీబీ ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులకు సోకే రుగ్మతులకు చేసే ఆపరేషన్లు మాత్రమే ఇక్కడ అరకొరగా రెండేళ్లుగా సాగుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు ఓపెన్ హార్టు సర్జరీ కేసులను తరలించేందుకే ఆస్పత్రి అధికారులు మొగ్గుచూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రులు విధులించే కాసులకు కక్కుర్తిపడి ఓపెన్ హార్టు సర్జరీ విభాగాన్ని రెండేళ్లుగా మూసేశారన్న ఆరోపణలకు బలం చేకూరుకుంది. ప్రస్తుతం మూతపడిన కార్డియాలజీ విభాగంలో వున్న క్యాథ్‌ల్యాబ్‌లో చెడిపోయిన ఉపకరణం జర్మనీ నుంచి రప్పించాల్సివుండడంతో అప్పటిలో చికిత్సలు అందే అవకాశం లేదు. పనిలో పనిగా క్యాథ్‌ల్యాబ్ వార్షిక నిర్వహణ, కాంట్రాక్టు ఒప్పందం ముగిసినందున, నిర్వహణ ఒప్పందాన్ని తిరిగి పునరుద్దరించాలని ఆస్పత్రి అధికారులు భావిస్తుండడంతో కొంతకాలం నిరుపేద హద్రోగులకు క్యాథ్‌ల్యాబ్ సేవలు అందని దాక్షగా కనిపిస్తున్నాయి. సహాయకులు లేకపోవడంతో గుండె ఆపరేషన్లు నిర్వహించే నిపుణుడికి పనిలేకుండా పోయింది.