కార్డియాలజి విభాగ పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజి విభాగాన్ని శనివారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైద్యుల బృందం పరిశీలించింది. ఇటీవలే ఈ విభాగానికి రెండు డీఎం సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇక్కడి వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు డాక్టర్ శ్రీనివాసులు(గుంటూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల), డాక్టర్ సుబ్బారెడ్డి(ఉస్మానియా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి) వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ వీరికి పూర్తి వివరాలు అందించారు.