సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి పాలనలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల కూటమి నేతలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. తాజా మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని టీడీపీ నేత ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గుంటూరులో మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్‌పై మంత్రిని టీడీపీ నేత నిలదీశారు. మెడికల్ కాలేజీల్లో ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా పెడతారని సదరు నేత ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్సిటీలో ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. అయితే, సత్య కుమార్ మాత్రం విద్యార్థులు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment