satya kumar
-
మంత్రి సత్యకుమార్ ఇచ్చిన సమాధానంపై బొత్స అసంతృప్తి
-
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డయేరియా మరణాలపై నవ్వుతూ మాట్లాడిన ఏపీ మంత్రి
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. -
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
సత్య కుమార్ యాదవ్ పై సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్
-
వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు నిధుల లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దానిని ఎలా అధిగమించాలో ఆలోచించిన తర్వాత పీపీపీ విధానంపై ముందుకు వెళ్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వైద్య రంగంలో అద్భుతాలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు. వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి 30 అంశాలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. ముందుగా ప్రభుత్వాస్పత్రుల్లో వనరుల ఆవశ్యకతపై ఆడిట్ చేస్తామన్నారు. అనంతరం ఆరు నెలల్లోగా ఆస్పత్రుల్లో వసతులు, సాంకేతిక నిపుణుల కొరతను అధిగమిస్తామని చెప్పారు. ఏడాదిలోగా అవసరాల మేరకు సీటీ, ఎమ్మారై వంటి ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా)తో చర్చించామన్నారు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశామని, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. నెలవారీగా బిల్లులు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు కోరినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటూనే.. గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందింది ఏమీ లేదని, ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఆరోపిస్తూనే.. అనంతపురం జీజీహెచ్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి చికిత్స పొందుతున్నారని, గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, లివర్ వంటి అవయవాల మారి్పడి సర్జరీలు కూడా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదుతరగతుల ప్రారంభానికి సిద్ధమైన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రి స్పందించారు. వైద్య శాఖలో స్వల్ప కాలంలో పరిష్కరించదగ్గ సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో సరిపడా ఫ్యాకల్టీ లేరని, వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు నిరాకరించిందన్నారు. రెండు నెలల్లో పోస్టులేమీ భర్తీ చేయలేదని తెలిపారు. పులివెందుల వైద్య కళాశాలలో 50 సీట్లకు అండర్‌టేకింగ్ ఇస్తామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని విద్యార్థులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తొలి, మలి, చివరి విడతల కళాశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. స్వల్ప వ్యవధిలో అద్భుతాలు సృష్టించలేమని పేర్కొన్నారు. -
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: నారా చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేదు. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన సాగడం విశేషం. అలాంటిది మరోసారి సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒకరు చంద్రబాబు సంపద సృష్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారిప్పుడు. సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్ జగన్ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు. అయితే.. అధికారంలోకి వచ్చాక ‘వీటన్నింటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారు’? అని ప్రశ్నిస్తే మాత్రం అరిగిపోయిన రికార్డులాగా.. సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ లేని సీఎంగా పేరున్న చంద్రబాబు గత మూడు టర్మ్‌లు ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి పంచిపెట్టారు..? అనే విశ్లేషణలు తరచూ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు స్వయానా ఆయన కేబినెట్లోని మంత్రి తాజా ప్రకటనతో.. ఆ సంపద సృష్టి కూడా మోసం అనేది తేటతెల్లమయ్యింది. -
మెడికల్ కాలేజీల పై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
సత్య.. ఇక అమాత్య !
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరువాసి సత్యకుమార్ యాదవ్ ఆదినుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో చురుగ్గా ఉన్నారు. టెన్త్ వరకు ప్రొద్దుటూరులోనే చదివిన ఆయన పాలిటెక్నిక్ విద్యనభ్యసించేందుకు అప్పటి చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లారు. అక్కడ ఏబీవీపీ నాయకుడిగా ఉన్నారు. అక్కడి బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డితో ఉన్న చనువు కారణంగా ఆయన ద్వారా అప్పటి బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుకు చేరువయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో వ్యక్తిగత సహాయకుడిగా, ఓఎస్డీగా సేవలందించారు. అప్పటి నుంచి కేంద్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించారు. వెంకయ్యనాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి దక్కడంతో సత్యకుమార్‌ను పార్టీ అధిష్టానం బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇన్చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తదితర నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికేతరుడైనప్పటికీ సత్యసాయిజిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు. ఈయన ఎన్నికల ప్రచార సభకు అమిత్‌షా సైతం హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోమంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సత్యగా పిలుచుకునే ఆయన సన్నిహితులు ఆయనకు మంత్రి పదవి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలిసారే విజయం సాధించడం, మంత్రివర్గంలో చో టు సంపాదించడంతో డబుల్ ధమాకా సాధించినట్లయింది.సీనియర్లకు లభించని అవకాశంప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయంగా విశేషానుభవం ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డిలకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించలేదు. బీజేపీకి లభించే ఛాన్సును చేజెక్కించుకునేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది విశేషంగా ప్రయత్నించారు. కాగా బీజేపీ అధిష్టానం మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి రావడంతో ఆదికి మంత్రి పదవి చేజారినట్లు పలువురు వివరిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న చరిత్ర జిల్లాలో నంద్యాల వరదరాజులరెడ్డికి ఉంది. ఈమారు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆమేరకు భారీగా ప్రయత్నాలు చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత ద్వారా విశేషంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.మాధవీరెడ్డికి నిరాశకడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మంత్రి పదవి కోసం విశేషంగా ప్రయత్నించారు. టీడీపీ తరఫున 20 ఏళ్లుగా కడప ఎమ్మెల్యేగా ఎవరూ గెలుపొందని నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న తొలిసారే విజయం సాధించారీమె. దీంతో మహిళ కోటాలో మంత్రియోగం కల్పించాలని అభ్యర్థించారు. తుదివరకూ మాధవీరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒక దశలో చంద్రబాబు ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు లోకేష్ రాజకీయ సమీకరణల నేపధ్యంలో రామ్‌ప్రసాద్‌రెడ్డికి అవకాశం కల్పించా ల్సిందిగా పట్టుబట్టినట్లు సమాచారం. పైగా జిల్లా లోని ముఖ్యనేతలు వాసు కుటుంబానికి మంత్రి పదవి కేటాయించడాన్ని సమర్థించలేదని సమాచారం.ఫలితంగా చివరి నిమిషంలో ఆమెకు మంత్రియోగం చేజారినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్సీపీలో చేరారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి చెక్ అందించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: విధి నిర్వహణలో.. అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. కానిస్టేబుల్ సత్య కుమార్ డిసెంబర్ 5వ తేదీన డ్యూటీకి వెళ్తుండగా.. కడప-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సత్యకుమార్ కుటుంబానికి సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్‌గ్రేషియాగా రూ.30 లక్షలను ప్రకటించారాయన. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయానికి సత్యకుమార్ కుటుంబ సభ్యుల్ని డీజీపీ తీసుకెళ్లి సీఎం జగన్‌ను కలిపించారు. సత్యకుమార్ భార్యా కొడుకుకి సీఎం జగన్ స్వయంగా చెక్ అందించారు. అంతేకాదు సత్యకుమార్ కొడుకు ప్రస్తుతం ఇంటర్ చదువుకున్నట్లు తెలియడంతో.. డిగ్రీ పూర్తైన వెంటనే అతనికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇప్పించాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడే జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సత్యకుమార్‌ది 2004 ఏపీఎస్పీ బ్యాచ్. డిసెంబర్ 5వ తేదీన భాకరాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మిచాంగ్ తుఫాన్ బీభత్సంతో చెట్టు విరిగి బైక్‌పై వెళ్తున్న ఆయన మీద పడడంతో దుర్మరణం పాలయ్యారు. -
సత్య కుమార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకో : జోగి రమేష్
-
ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు: ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
-
‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్యకుమార్ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సత్యకుమార్ కాదు.. అసత్యకుమార్ అని పేరు పెట్టుకోవాలంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: 'టార్గెట్ 175' కుప్పం నుంచే తొలి అడుగు ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో స్కాం జరిగిందన్న బీజేపీ విమర్శలు వాస్తవం కాదా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్ సీపీపై సత్యకుమార్ అనుచిత వ్యాఖ్యలు
-
కేంద్రం చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం
సాక్షి, విజయవాడ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోందని, దాన్ని అరికట్టడానికి లాక్డౌన్ విధించి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని వర్గాలకు ఆదుకునేలా ప్యాకేజీ ప్రకటించారని పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెల రేషన్ బియ్యం అందించారని తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఊరట కల్పించారని చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ‘ఆత్మ నిర్భర భారత్’ కింద ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారని గుర్తు చేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే మరో వైపు పార్టీ కార్యకర్తలు కూడా ముందుండి ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వైరస్‌తో పోరాడుతున్న వారికి పీపీఈ కిట్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అవసరం ఉన్న చోట్ల పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు అందిస్తున్నామని చెప్పారు. 5 వేల కిట్లను కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీకి అందిస్తున్నామని అన్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవవుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కరోనా విధుల్లో నేరుగా పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లను పార్టీ తరపున అందచేస్తున్నామని చెప్పారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఇచ్చామని తెలిపారు. ఏపీలో ఐదువేల కిట్లను సిబ్బందికి గురువారం అందించామని, వెయ్యి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తామన్నారు. ఐదు వందల ప్రదర్శనలు చేపట్టి కేంద్రం చేసిన సంక్షేమ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళతామని సత్యకుమార్ అన్నారు. -
‘అందుకు మోదీ విధాన నిర్ణయాలే కారణం’
సాక్షి, కర్నూలు: ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో ఉంటే, భారత్ మాత్రం ఆర్థికపరంగా అభివృద్ధిలో దూసుకెళ్తుందని.. అందుకు ప్రధాని నరేంద్ర మోదీ విధాన నిర్ణయాలే కారణమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కర్నూలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాత్ర దోహద పడుతుందన్నారు. గాంధీజీ సూచించిన మార్గాన్ని ప్రజలు ఆచరించే విధంగా చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలించడం, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలను పైకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని వెల్లడించారు. -
సాగర్ జలాలొచ్చాయ్..
త్రిపురాంతకం: జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85/3 వద్ద 700 క్యూసెక్కుల నీరు జిల్లాలో ప్రవేశించింది. ఈ నీటితో అధికారులు తాగునీటి చెరువులు నింపనున్నారు. జిల్లాలోని తాగునీటి చెరువుల్లో నీటిమట్టం అడుగంటింది. 129 ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులున్నాయి. వీటిని ముందుగా నింపేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటి తరువాత మరో 160 మంచినీటి చెరువుల్ని నింపుతారు. తొలిరోజు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా..క్రమేణా రెండు వేల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని సాగర్ డీఈ సత్యకుమార్ తెలిపారు. పది రోజుల పాటు నీరు విడుదల చేస్తారన్నారు. రైతులు సాగు అవసరాలకు ఈ నీటిని వినియోగించరాదని హెచ్చరించారు. సాగర్ కాలువలు పరిశీలించిన ఎస్ఈ : జిల్లాలోని తాగునీటి ట్యాంకులు నింపేందుకు సాగర్ జలాలు విడుదల చేసేందుకు ముందు ఎన్ఎస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు సాగర్ కాలవపై పర్యటించారు. రామతీర్థం జలాశయం నుంచి జిల్లా సరిహద్దు 85-3 వరకు ప్రధాన కాలువపై పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు, సలహాలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదలవుతున్న నీరు వృథా కాకుండా ఉపయోగించుకోవాలని కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోకి తాగునీరు ప్రవేశించే సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉండి పరిశీలించారు. ఆయన వెంట సాగర్ డీఈఈ సత్యకుమార్, ఏఈలు దేవేందర్, విజయేందర్ గుంటూరు జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.