ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్‌ | Minister Satya Kumar Over Action For YSRCP MLC Questions In Assembly | Sakshi
Sakshi News home page

ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్‌

Published Fri, Nov 15 2024 12:23 PM | Last Updated on Fri, Nov 15 2024 3:07 PM

Minister Satya Kumar Over Action For YSRCP MLC Questions In Assembly

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్‌ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తో​ంది. వైఎస్సార్‌సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్‌ సమాధానం చెప్పకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారు.

అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో​ మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని  అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్‌ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.

ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్‌ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్‌ చేసే విధంగా కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్‌ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు.

మంత్రి సత్యకుమార్ ఇచ్చిన సమాధానంపై బొత్స అసంతృప్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement